AP Weather
ఏపీలో నిన్నటి వరకూ మామూలుగా ఉన్న ఆకాశం సాయంత్రం నుంచి ఒక్కసారిగా నల్లటి మబ్బులతో భయం గొలిపేలా మారిపోయింది. పిడుగుల మోత, దానికి తోడు ఈదురుగాలులు ఏపీని వణికించడానికి(AP Weather) సిద్ధమయ్యాయి. ఏదో సాధారణ వాన అని తేలిగ్గా తీసుకోవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. పరిస్థితి తీవ్రతను బట్టి ఏకంగా 12 జిల్లాలను ఆరెంజ్ జోన్గా ప్రకటించి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలిచ్చారు.
వాతావరణ శాఖ ఇచ్చిన తాజా అప్డేట్(AP Weather) ప్రకారం.. ఈరోజు అనగా అక్టోబర్ 17 వ తేదీ శనివారం రాత్రి నుంచి రేపటి వరకు ఏపీ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు దంచి కొట్టబోతున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు కర్నూలు, ప్రకాశం, అనంతపురం, నెల్లూరు, కడప, నంద్యాల, తిరుపతి జిల్లాల పరిధిలో వర్షాల ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉండబోతోంది. దీనికి తోడు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగంతో వీచే రక్కసి ఈదురుగాలులు మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి.
ముఖ్యంగా రంపచోడవరం, నర్సీపట్నం, రౌతులపూడి, కృష్ణదేవిపేట, మాడుగుల వంటి ఏజెన్సీ, మెట్ట ప్రాంతాలతో పాటు గుత్తి, పొదిలి, ఓర్వకల్లు, వెల్దుర్తి, డోన్, శ్రీకాళహస్తి, బద్వేలు, సత్యవేడు, సూళ్లూరుపేట, నాయుడుపేట, గొట్టిప్రోలు పరిసర ప్రాంతాల్లో వాతావరణం హఠాత్తుగా మారిపోతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
విపరీతమైన ఈదురుగాలులు, ఉరుములు ఉన్నప్పుడు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద నిలబడటం గానీ, కరెంట్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, హోర్డింగ్స్ కింద ఆగడం గానీ చేయకూడదు. బహిరంగ ప్రదేశాల్లో, పొలాల్లో తిరిగే వాళ్లు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Vangaveeti Radha : ఎన్నికల హీట్ పెంచిన జనసేన…. వంగవీటి రాధాకు విజయవాడ మేయర్ ఛాన్స్..
