CM Chanadra Babu : చదువుల తల్లిగా దుర్గమ్మ..అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు

CM Chanadra Babu : ఏపీ ప్రభుత్వం తరఫున దుర్గమ్మకు అత్యంత భక్తిశ్రద్ధలతో సీఎం దంపతులు.. పట్టువస్త్రాలు, పసుపు కుంకుమల సారెను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

CM Chanadra Babu

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అత్యంత పవిత్రమైన రోజుగా చెప్పుకునే మూలా నక్షత్రం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తజన సంద్రంగా మారింది. శ్రీ మహాసరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న చదువుల తల్లిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు.

కాగా ఈ పవిత్రమైన రోజు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(CM Chanadra Babu) నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున దుర్గమ్మకు అత్యంత భక్తిశ్రద్ధలతో సీఎం దంపతులు.. పట్టువస్త్రాలు, పసుపు కుంకుమల సారెను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ పర్వదినాన ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chanadra Babu), భువనేశ్వరికి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఆలయ ఈఓ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో వారిని నేరుగా గర్భాలయానికి తీసుకువెళ్లగా.. అక్కడ పుస్తకాలు, వీణ ధరించి జ్ఞానప్రదాయినిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకుని చంద్రబాబు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో వర్ధిల్లాలని, విద్యార్థులకు జ్ఞానం సిద్ధించాలని అమ్మవారిని సీఎం దంపతులు వేడుకున్నారు.ఈ పవిత్ర వేడుకలో కొంతమంది మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

దర్శన అనంతరం వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య సీఎం దంపతులకు వేదాశీర్వచనం అందజేసి, అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు , జ్ఞాపికను బహుకరించారు. మరోవైపు, సరస్వతీ దేవి అవతారాన్ని దర్శించుకుంటే జ్ఞానం, పుణ్యం కలుగుతుందనే నమ్మకంతో తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే వీఐపీ దర్శనాలను రద్దు చేశారు. అలాగే భక్తులకు అమ్మ దర్శనం సులభంగా కలిగించేలా చూస్తూనే.. వారికి భారీ భద్రతతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Tesla Roadster : ఎగిరే కార్లు ఇక కల కాదు..గాల్లో ఎగిరి ఆశ్చర్యపరిచిన టెస్లా రోడ్‌స్టర్

↑
Exit mobile version