Kakinada Mayor
ఆంధ్రప్రదేశ్ మొత్తం మున్సిపల్ ఎలక్షన్ సందడి నెలకొనగా, అందరి చూపు మాత్రం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పీఠంపైనే పడింది. . ఈ నెల 26వ తేదీన పోలింగ్ నిర్వహించడానికి నోటిఫికేషన్ రావడంతో ప్రధాన పార్టీలు గెలిచే స్ట్రాటజీలకు పదును పెడుతున్నాయి. అధికార కూటమికి, వైసీపీకి ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ముఖ్యంగా కాకినాడ మేయర్(Kakinada Mayor) స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించడంతో సోషల్ ఈక్వేషన్స్ రాజకీయ లెక్కలను మార్చేస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో వైసీపీ వేగంగా అడుగులు వేస్తూ రాజకీయంగా నాలుగు అడుగులు వేస్తూ చురుకుదనం ప్రదర్శించింది. కాకినాడకు చెందిన ఫేమస్ వైద్య నిపుణులు డాక్టర్ కాద వెంకటరమణ వైసీపీలో చేరిన వెంటనే, ఆయన సతీమణి కాద సత్యశ్రీని మేయర్ కేండిడేట్‌గా వైఎస్ జగన్ ప్రకటించారు. నగరంలో మంచి పేరున్న డాక్టర్ల ఫ్యామిలీ కావడం, ఇక్కడ జనాభా రీత్యా అత్యంత ఎఫెక్టివ్ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఛాన్స్ ఇవ్వడంతో వైసీపీ కాకినాడలో కొత్త ఆధిపత్యానికి తెరతీసింది. శెట్టిబలిజ కార్డు ద్వారా ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆ పార్టీ వేగంగా ప్రచారంలోకి దిగుతోంది.
మరోవైపు కూటమి తరఫున మేయర్ స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించారు. కాకినాడ ప్రాంతం తమకు బలమైన కంచుకోట కావడంతో ఇక్కడ గెలుపుపై జనసేన ధీమాగా ఉన్నా కూడా, కేండిడేట్ విషయంలో కూటమి ప్రభుత్వంతో మాత్రం తెరవెనుక మేయర్ స్థానం గురించి తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. మేయర్ పదవిని తమ వద్దే ఉంచుకోవడమా లేదంటే మారుతున్న పొలిటికల్ సమీకరణాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని జనసేన తీసుకోవడానికి మొగ్గు చూపించడమా అనే అంశంపై తర్జనభర్జనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మేయర్ సీట్ కోసం గుత్తుల వెంకట శుభ, చొల్లంగి సుబ్బలక్ష్మి, కడలి ఈశ్వరి వంటి స్ట్రాంగ్ నాయకుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మత్స్యకార లేదంటే శెట్టిబలిజ వర్గాల్లో ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలనే దానిపై జనసేన అంతర్గత కసరత్తు సాగుతోంది. కార్పొరేషన్లో ఇటీవల కొత్తగా కలిసిన 6 పంచాయతీల ఓటర్లు ఇక్కడ గెలుపోటములను శాసించే అవకాశం ఉండటంతో, ఇరుపక్షాలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
Doomsday : 66 ఏళ్ల క్రితం నాటి ప్రళయం అంచనా.. నిన్నటితో ముగిసిన డూమ్స్‌డే డేట్ ఎందుకు తప్పింది?
