Papikondalu : పాపికొండల విహారయాత్ర నిలిపివేత..బోటింగ్ బంద్ ఎందుకంటే?

Papikondalu : పాపికొండలు విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న టూరిస్టులకు అధికారులు షాకింగ్ న్యూస్ చెప్పారు

Papikondalu

గోదావరి అలల గలగలలు, పాపికొండల(Papikondalu) మధ్య పచ్చని ప్రకృతి సోయగాలను ఆస్వాదించడమంటే అందరికీ ఇష్టం. అందుకే ప్రతి వీకెండ్‌లో, సెలవు రోజుల్లో వేలాది మంది టూరిస్టులు ఆ అందాలను చూడటానికి క్యూ కడుతుంటారు.

అయితే, ఈ వారాంతంలో పాపికొండలు(Papikondalu) విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న టూరిస్టులకు అధికారులు షాకింగ్ న్యూస్ చెప్పారు. పాపికొండల వైపు వెళ్లే పర్యాటక బోట్ల రాకపోకలను టూరిస్టులుగా నిలిపివేస్తున్నట్లు రంపచోడవరం ఆర్డీవో అధికారికంగా ప్రకటించారు.

ఇటీవల దేవీపట్నం మండలంలోని గండిపోశమ్మ అమ్మవారి ఆలయం బోటింగ్ పాయింట్ నుంచి సుమారు 89 మంది పర్యాటకులు బోటులో పాపికొండల విహారయాత్రకు వెళ్లారు. అంతా హ్యాపీగా సాగిపోతుందనుకున్న టైమ్‌లో, దేవీపట్నం ఓల్డ్ పోలీస్ స్టేషన్ ఏరియాకు రాగానే ఆ బోటులో ఊహించని విధంగా టెక్నికల్ ఇష్యూ తలెత్తింది. దాంతో అప్రమత్తమైన డ్రైవర్ బోటును నది మధ్యలోనే ఆపేశారు.

గోదావరి నది మధ్యలో అలా బోటు ఆగిపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురై, కాపాడాలంటూ కేకలు వేశారు. అయితే పరిస్థితి ప్రమాదకరంగా మారకముందే అలర్ట్ అయిన సిబ్బంది, వెంటనే మరో బోటును అక్కడికి రప్పించడంతో.. పర్యాటకులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయింది.

అయితే,ఈ విషయం ఆలస్యంగా బయటకు పొక్కడంతో శనివారం రోజు ఉన్నతాధికారుల బృందం దేవీపట్నం బోటింగ్ పాయింట్‌కు చేరుకుని స్పెషల్ రైడ్స్ నిర్వహించింది. అసలు నది మధ్యలో బోటు ఏ కారణంతో ఆగిపోయింది? ..ఈ ప్రమాదకరమైన సంఘటనను సీక్రెట్‌గా ఉంచాల్సిన పరిస్థితి ఏంటి? .. బోట్లలో సేఫ్టీ ప్రమాణాలు కరెక్ట్‌గా పాటిస్తున్నారా లేదా అనే అంశాలపై సిబ్బందిని గట్టిగా ప్రశ్నించారు. ఈమధ్య కాలంలో ఇలాంటి టెక్నికల్ సమస్యలు పదే పదే వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో పర్యాటకుల ప్రాణాల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాపికొండల పర్యటనను టెంపరరీగా ఆపేశారు.

Papikondalu

ప్రస్తుతం కలెక్టర్ ఆదేశాలతో స్పెషల్ టీంలు రంగంలోకి దిగి అన్ని బోట్ల ఫిట్‌నెస్, సేఫ్టీ మెజర్స్ పై క్షుణ్ణంగా పరిశీలన జరుపుతున్నాయి. ఈ భద్రతా ప్రమాణాలపై పూర్తి స్థాయి రిపోర్ట్ వచ్చిన తర్వాతే మళ్లీ బోటింగ్ తిరిగి ప్రారంభించాలా వద్దా అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పారు.

కాబట్టి పాపికొండల(Papikondalu) అందాలను చూడాలని అనుకుంటున్న టూరిస్టులు.. ప్రస్తుతానికి తమ ప్లాన్స్‌ను వాయిదా వేసుకోవడమే చాలా మంచిది. లేదంటే అక్కడికి వెళ్లాక బోట్లు లేక డిజప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది.

Mysterious Village : అక్కడకు వెళ్తే నో రిటర్న్.. ప్రపంచంలోని మోస్ట్ మిస్టీరియస్ గ్రామం..

Exit mobile version