Pawan Kalyan Strategy : స్థానిక సంస్థల పోరుకు జనసేనాని స్పెషల్ వ్యూహం..క్షేత్రస్థాయిలో హీట్‌ పెంచేసిన జనసేన..

Pawan Kalyan Strategy : ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేసరికి పార్టీ యంత్రాంగాన్ని పక్కా మిషన్ లాగా రెడీ చేయడానికి పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్న స్ట్రాటజీ పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద చర్చకు దారితీస్తుంది.

Pawan Kalyan Strategy

ఏపీలో రాబోయే లోకల్ బాడీ ఎన్నికల వేడి అప్పుడే పీక్స్‌కి చేరిపోయింది. క్షేత్రస్థాయి నుంచి తమ పార్టీని రాకెట్‌లా దూసుకెళ్లేలా చేయడానికి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఫుల్ ప్లాన్‌తో(Pawan Kalyan Strategy) రంగంలోకి దిగారు. కేవలం క్షేత్రస్థాయిలో ఇన్ఫర్మేషన్‌ను సేకరించడమే కాదు, గల్లీ స్థాయి నుంచి వచ్చే ప్రతి చిన్న విషయాన్ని క్రోడీకరించి డైరెక్టుగా తన టేబుల్ మీదికి తెప్పించుకునేలా ఒక స్పెషల్ కమాండ్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.

సెప్టెంబర్ 25 శుక్రవారం సాయంత్రం సరికొత్తగా ఏర్పాటు చేసిన ఆ ఐదుగురు సభ్యుల పవర్ టీమ్‌తో.. తాజాగా పవన్ కళ్యాణ్ గంటల తరబడి జరిపిన హై వోల్టేజ్ సమావేశం ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఐదుగురు సభ్యుల ప్రత్యేక కమిటీకి పవన్ కొన్ని బాధ్యతలను అప్పగించారు.

గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రతి నియోజకవర్గ ఇన్ఫర్మేషన్‌ను సేకరించి, పక్కా నివేదికలు తయారు చేసి తనకు ఎప్పటికప్పుడు తనకు అందించాలని పవన్ దిశానిర్దేశం చేశారు. దీని కోసం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి అన్ని రకాల వనరులు, పూర్తి స్థాయిలో సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతేకాదు నెక్స్ట్ లెవెల్ యాక్షన్ ప్లాన్‌ను ఫిక్స్ చేయడానికి సోమవారం మరొక కీలక భేటీకి రెడీ కావాలని ఆదేశించారు.

ఈ సమన్వయ కమిటీలో ఏపీఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అలాగే విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్‌తో పాటు భీమవరం నియోజకవర్గానికి చెందిన పులపర్తి ప్రశాంత్, రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన యనమల భాస్కర్ సభ్యులుగా బాధ్యతలు తీసుకున్నారు.

అయితే ఇక్కడే పవన్ అసలైన మైండ్ గేమ్(Pawan Kalyan Strategy) ఆడినట్లు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే లోకల్ ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షించడానికి 14 మంది సభ్యులతో ఒక మెయిన్ సమన్వయ కమిటీ పనిచేస్తోంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ స్పెషల్ కోర్ టీమ్… ఆ 14 మంది కమిటీతో కలిసి కంటిన్యూగా క్షేత్రస్థాయి డేటాను ట్రాక్ చేస్తుంది.

Pawan Kalyan Strategy

ప్రతిరోజూ అందిన రిపోర్టుల ఆధారంగా పవన్ స్వయంగా ప్రతిరోజూ రివ్యూ మీటింగ్స్ నిర్వహించనున్నారు. ఏ గ్రామంలో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలి, కేడర్‌కు ఎలాంటి రూట్ మ్యాప్ ఇవ్వాలనే విషయాలపై ఈ డైలీ సమీక్షల్లోనే ఫైనల్ డెసిషన్ నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా, ముందు ఏర్పాటు చేసిన 14 మంది సభ్యుల కమిటీలో కూడా కొన్ని కీలకమైన మార్పులు చేయాలని పవన్ సూచించినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.

అంటే ఒకవైపు కొత్త బ్లడ్‌ను నింపుతూనే, మరోవైపు పాత కమిటీని మరింత షార్ప్‌గా మారుస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఓవరాల్‌గా చూస్తే, ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేసరికి పార్టీ యంత్రాంగాన్ని పక్కా మిషన్ లాగా రెడీ చేయడానికి పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్న స్ట్రాటజీ పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద చర్చకు దారితీస్తుంది. గ్రౌండ్ రియాలిటీని బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ వేస్తున్న ఈ ఎలక్షన్ గేమ్ ప్లాన్ ఎలా సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.

Relationship Secrets : ప్రేమ ఉంటే సరిపోదా? గోల్స్ డిఫరెంట్‌గా ఉంటే రిలేషన్‌షిప్ సక్సెస్ అవడం కష్టమా?

↑
Exit mobile version