Sushmitha Konidela
అటు పాలిటిక్స్‌లోనూ, ఇటు సినీ ఇండస్ట్రీలోనూ లైమ్‌లైట్‌లో ఉండే మెగా కాంపౌండ్‌లోకి మరో అనుకోని గుడ్ న్యూస్ వచ్చి చేరింది. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె, ట్యాలెంటెడ్ ప్రొడ్యూసర్ కొణిదెల సుస్మితకు ఏపీ ప్రభుత్వం గౌరవప్రదమైన పొజిషన్‌ను కేటాయించింది. బెజవాడలో కొలువైన ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలిగా (Special Invitee) సుస్మితను నియమిస్తూ ఏపీ స్టేట్ ఎండోమెంట్స్ సెక్రటరీ కన్నబాబు జీవో రిలీజ్ చేశారు. ఈ లేటెస్ట్ న్యూస్‌తో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయంపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ షురూ అయింది.
ఈ పవర్‌ఫుల్ బాధ్యత ద్వారా సుస్మిత.. దుర్గమ్మ గుడి డెవలప్‌మెంట్ ప్రాజెక్టులలో డైరెక్ట్‌గా భాగస్వామి కాబోతున్నారు. విజయవాడకు వచ్చే భక్తుల వసతుల ఏర్పాట్లతో పాటు, ఇంద్రకీలాద్రిపై జరిగే కొత్త ప్రాజెక్టులు, ముఖ్యంగా గ్రాండ్‌గా జరిగే దసరా నవరాత్రి ఉత్సవాల ఆర్గనైజింగ్‌లో సుస్మిత.. శ్రీ కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డుకు వాల్యుబుల్ సూచనలు అందించనున్నారు.
ఇప్పటి వరకూ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై క్వాలిటీ కంటెంట్ మూవీలను, వెబ్ సిరీస్‌లను నిర్మిస్తూ, రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవితో తీసిన మన శంకర వర ప్రసాద్ గారు సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సుస్మిత, ఇప్పుడు డివోషనల్ అడ్మినిస్ట్రేషన్‌లో తనదైన మార్క్ చూపించడానికి రెడీ అయ్యారు.
మరోవైపు ఇటు మెగాస్టార్ సతీమణి కొణిదెల సురేఖ ఆల్రెడీ తెలంగాణలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పాలకమండలి మెంబర్‌గా.. తన సర్వీసును అందిస్తున్నారు. ఇప్పుడు చిరు కూతురు సుస్మిత ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కనకదుర్గమ్మ బోర్డులోకి ఎంట్రీ ఇవ్వడంతో మెగా కుటుంబానికి రెండు రాష్ట్రాలలోని ల్యాండ్‌మార్క్ టెంపుల్స్ మేనేజ్‌మెంట్‌లో ప్లేస్ దక్కినట్లయింది. అసలు ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా మెగా ఫ్యామిలీకి ఇంతగా ప్రయారిటీ ఇవ్వడం వెనుక రీజన్స్ ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.
ఏపీ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవర్‌ఫుల్ పొజిషన్‌లో ఉన్నారు. గవర్నమెంట్‌తో మెగా కాంపౌండ్‌కు ఉన్న డైరెక్ట్ బాండింగ్, అలాగే చిరంజీవికున్న క్లీన్ ఇమేజ్, హ్యూజ్ పాపులారిటీ వల్ల కూటమి ప్రభుత్వం వారికి సరైన గౌరవాన్ని అందిస్తోంది.
మరోవైపు తెలంగాణ సర్కార్ కూడా సినీ ఇండస్ట్రీతో రిలేషన్ కాపాడుకోవడానికి, చిరంజీవి ఫ్యామిలీకి ఉన్న కల్చరల్ అండ్ సోషల్ ఇన్‌ఫ్లుయెన్స్‌ను గౌరవిస్తోంది. దీంతో అటు సినీ ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్లు కొడుతూ, ఇటు డివోషనల్ అండ్ సోషల్ యాక్టివిటీస్‌లో మెయిన్ రోల్ తీసుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మెగా కుటుంబం తమ ఆధిపత్యాన్ని, ప్రజాదరణను మరోసారి ప్రూవ్ చేసుకున్నట్లు అయింది.
Gold : మళ్లీ పసిడి పరుగులు..మళ్లీ రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధర
