Tirumala : తిరుమలలో కోడ్ ఎఫెక్ట్.. ఆ సేవలు బంద్ చేసిన టీటీడీ

Tirumala : ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో టీటీడీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల ప్రజాప్రతినిధులు, అధికారుల వీఐపీ సిఫార్సు లెటర్స్ ఆధారంగా ఇచ్చే శ్రీవారి దర్శనాలు, వసతి సౌకర్యాలను టెంపరరీగా నిలిపివేసింది.

Tirumala

ఏపీ పాలిటిక్స్‌లో స్థానిక సంస్థల ఎన్నికల హీట్ మొదలవ్వడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తుల సౌకర్యం కోసం ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct) వెంటనే అమలులోకి రావడంతో, శ్రీవారి దర్శనంతో పాటు కాటేజీల కేటాయింపుల్లో ఇచ్చే వీఐపీ సిఫార్సు లెటర్స్ విధానాన్ని టెంపరరీగా పక్కన పెడుతున్నట్లు వెల్లడించింది.

లోకల్ బాడీ ఎలక్షన్స్ ముగిసే వరకు ప్రజాప్రతినిధులు , ఉన్నతాధికారులు ఇచ్చే ఎలాంటి రికమండేషన్ లెటర్లను కూడా టీటీడీ బోర్డు అంగీకరించదు. ఎన్నికల కోడ్ సమయంలో పారదర్శకతను కాపాడటం అలాగే భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడం కోసం ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని టీటీడీ అధికారులు తెలిపారు.

కాకపోతే ప్రొటోకాల్ పరిధిలోకి వచ్చే హై ర్యాంకిగ్ ఉన్న ప్రముఖులు స్వయంగా తిరుమల క్షేత్రానికి విచ్చేస్తే మాత్రం, అధికారిక నిబంధనలన్నిటికి లోబడి వారికి దర్శన, వసతి సౌకర్యాలను కల్పిస్తారు. అయితే వారి పేర్లను వాడుకుని ఇతరులు లెటర్స్ తెస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తేల్చి చెప్పారు.

టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య భక్తులకు మాత్రం పెద్ద ఊరటగా మారనుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు వీఐపీ సిఫార్సుల కోటా కింద వారికి కేటాయించే దర్శన స్లాట్లు అలాగే గదులు కూడా ఇప్పుడు డైరెక్టుగా సాధారణ భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే సామాన్యులకు చాలా త్వరగా స్వామివారి దర్శనం లభించడంతో పాటు తిరుమలలో వసతి లభించే అవకాశాలు మెరుగవుతాయని అధికారులు చెబుతున్నారు.

ఏపీలో స్థానిక ఎన్నికల ప్రాసెస్ పూర్తయి, ఎన్నికల కోడ్ ఎత్తివేసే వరకు కూడా ఈ ఆంక్షలు నిరంతరాయంగా అమలులో ఉంటాయని టీటీడీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. కాబట్టి శ్రీవారి దర్శనం కోసం తిరుమల(Tirumala)కు ప్రయాణమయ్యే భక్తులు.. ఈ మార్పులను ముందే గమనించాలని, సిఫార్సు లెటర్స్ నమ్ముకుని వచ్చి తిరుమల(Tirumala)లో ఇబ్బందులు పడొద్దని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Hormonal Effect : హార్మోన్ల ఎఫెక్ట్ స్త్రీలకు మాత్రమేనా? ..ఏజ్‌తో పాటే ఎమోషనల్ హార్మోన్లు అందరిలోనూ మారతాయని తెలుసా?

↑
Exit mobile version