Tirumala Navratri Brahmotsavam
కలియుగ వైకుంఠ నిలయమైన తిరుమల గిరులు ఆధ్యాత్మిక పారవశ్యంలో మునిగితేలడానికి మరోసారి సిద్ధమవుతున్నాయి. ఏడాదికి ఒకసారి కన్నులపండువగా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఈసారి భక్తులకు రెండుసార్లు దక్కనుండటంతో తిరుమలలో పండుగ వాతావరణం నెలకొంది.
ఇటీవలే తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా పూర్తి చేసిన టీటీడీ.. ఇప్పుడు దసరా నవ రాత్రులను పురస్కరించుకుని నిర్వహించనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలకు(Tirumala Navratri Brahmotsavam) కూడా ముహూర్తం ఖరారు చేసింది. అక్టోబరు 12వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలు కనుల పండువగా సాగనున్నాయి. ఈ వైభవానికి సంబంధించిన పూర్తి, వాహన సేవల షెడ్యూల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అధికారికంగా విడుదల చేశారు.
చాంద్రమానం పంచాంగ లెక్కల ప్రకారం చూస్తే ప్రతి మూడేళ్లకోసారి అధికమాసం వస్తుంటుంది. అలా అధికమాసం కలిసివచ్చిన సందర్భాల్లో మాత్రం స్వామివారికి ఒక ఏడాదే రెండు రకాల బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
దీనిలో భాగంగానే కన్యామాసంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలను పూర్తి చేసిన టీటీడీ బోర్డు.. ఆశ్వయుజ మాసంలో దసరా వైభవంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలను జరిపించడానికి కూడా సిద్ధం అవుతోంది. అయితే ఈ దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలలో(Tirumala Navratri Brahmotsavam) సాధారణ బ్రహ్మోత్సవాల్లో ఉండే ధ్వజారోహణం, పెద్ద రథోత్సవం, ధ్వజావరోహణం ఘట్టాలు ఉండవు.
ఉత్సవాల్లో భాగంగా శ్రీ వేంకటేశ్వరస్వామి మూలవిరాట్ ప్రతి రూపమైన మలయప్ప స్వామివారు ప్రతిరోజూ ఉదయం, రాత్రి సమయాల్లో దివ్య వాహనాలపై వేర్వేరు అలంకారాల్లో మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనభాగ్యాన్ని కల్పిస్తారు.
సాధారణంగా ప్రతిరోజూ ఉదయం పూట వాహన సేవలు 8 గంటల నుంచి 10 గంటల వరకు సాగితే.. రాత్రి సమయంలో జరిగే వాహన సేవలు 7 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతాయి. అయితే ఈ ఉత్సవాలన్నింటిలోనూ అత్యంత కీలకమైన, కోట్లాది మంది శ్రీవారి భక్తులు ఎంతగానో ఎదురుచూసే గరుడ వాహన సేవ మాత్రం అక్టోబరు 16వ తేదీన సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు ఐదు గంటల పాటు కన్నులపండువగా సాగబోతోంది.
నవరాత్రి బ్రహ్మోత్సవాల(Tirumala Navratri Brahmotsavam) 9 రోజుల వాహన సేవల వివరాలను ఒకసారి చూస్తే.. శ్రీవారి ఉత్సవాలకు శ్రీకారం చుడుతూ అక్టోబరు 11వ తేదీన రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్య వేద పండితులు అంకురార్పణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అక్టోబరు 12వ తేదీన ఉదయం 9 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవంతో ఈ ఉత్సవాలు మొదలవుతాయి.
అదే రోజు రాత్రి 7 గంటలకు తిరుమల వేంకటేశ్వరస్వామివారు పెద్ద శేష వాహనంపై విహరిస్తారు. అక్టోబరు 13వ తేదీన ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, రాత్రి 7 గంటలకు హంస వాహన సేవలు జరుగుతాయి. అక్టోబరు 14వ తేదీన ఉదయం 8 గంటలకు రాజసంతో కూడిన సింహ వాహనంపైన, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపైన స్వామివారు ఊరేగుతారు.
అక్టోబరు 15వ తేదీ ఉదయం 8 గంటలకు భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్ష వాహనం అలాగే అదే రోజు రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహన సేవ జరుగబోతోంది. ఇక అక్టోబరు 16వ తేదీన బ్రహ్మోత్సవాల్లోనే అత్యంత ప్రత్యేకం.
శుక్రవారం రోజు ఉదయం 8 గంటలకు స్వామివారు ముగ్ధ మనోహరమైన మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చి.. సాయంత్రం 6:30 గంటల నుంచి గరుడ వాహనంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతారు. అక్టోబరు 17వ తేదీ ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు అత్యంత వైభవంగా పుష్పక విమాన సేవ, రాత్రి 7 గంటలకు గజ వాహన సేవలను జరిపిస్తారు.
అక్టోబరు 18వ తేదీ ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంలో అదే రోజు రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామి కాంతులు చెందుతూ భక్తులకు ఆశీర్వచనాలు లభిస్తాయి. అక్టోబరు 19వ తేదీ ఉదయం 7 గంటలకు అత్యంత వైభవంగా స్వర్ణ రథోత్సవం సాగనుండగా.. అదే రోజు రాత్రి 7 గంటలకు అశ్వ వాహన సేవ ఉంటుంది.
ఇక ఆఖరి రోజు అయిన అక్టోబరు 20వ తేదీ ఉదయం 6 గంటలకే పవిత్ర చక్రస్నానంతో ఈ నవరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా భక్తి పారవశ్యాల మధ్య పరిసమాప్తం కానున్నాయి.
కాగా ఈ 9 రోజులూ తిరుమలకు పోటెత్తే లక్షలాది మంది భక్తులకు దర్శనాలతో పాటు, వసతి, అన్నప్రసాదాలు, భద్రత విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లతో సిద్ధమైంది.
ఈ నవరాత్రి(Tirumala Navratri Brahmotsavam) శోభను కనులారా వీక్షించి శ్రీవారి కృపకు పాత్రులవ్వాలనుకునే భక్తులు ఈ తేదీలను, టైమింగ్స్‌ను నోట్ చేసుకుని తిరుమల ప్రయాణానికి ఇప్పుడే ప్లాన్ చేసుకోండి.
Secretariat Employees Protest : రోడ్డెక్కిన సచివాలయ ఉద్యోగులు..విజయవాడ ధర్నా చౌక్‌లో రణరంగం..
