Gold :పసిడి ప్రియులకు శుభవార్త..ఈరోజు కూడా తగ్గిన బంగారం ధరలు

Gold :పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల వల్ల నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఒక దశలో2 లక్షల రూపాయలకు చేరువవుతుందన్న భయం కలిగించిన పసిడి ధర, ఇప్పుడు మెల్లగా దిగి రావడం కొనుగోలుదారులకు శుభవార్త అనే చెప్పొచ్చు.

Gold

పుత్తడి కొనాలనుకునే వారికి శుక్రవారం అంటే ఏప్రిల్ 24న గొప్ప ఊరట లభించింది. కొన్ని రోజులుగా దూసుకుపోతున్న పసిడి పరుగులకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఆర్థిక మార్పుల ఎఫెక్టుతో దేశీయ మార్కెట్‌లో వరుసగా ఈరోజు కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల వల్ల నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఒక దశలో2 లక్షల రూపాయలకు చేరువవుతుందన్న భయం కలిగించిన పసిడి ధర, ఇప్పుడు మెల్లగా దిగి రావడం కొనుగోలుదారులకు ఒక శుభవార్త అనే చెప్పొచ్చు.

ఏప్రిల్ 24న ధరల వివరాలను పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా మెయిన్ సిటీలలో బంగారం(Gold ) ధరల్లో చాలా మార్పు కనిపిస్తోంది. హైదరాబాద్ , విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర సుమారు 600 రూపాయలు తగ్గి, ప్రస్తుతం 1, 52 , 950 రూపాయల వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా జ్యువెలరీ తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర కూడా 550 రూపాయలు తగ్గి, 1, 40, 200 రూపాయలుగా కొనసాగుతుంది.

ముంబై, బెంగళూరు, కోల్‌కతా, కేరళ వంటి ప్రాంతాల్లో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. అయితే ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర ఒక లక్షా 53 వేల 100 రూపాయలుగా ఉండగా, చెన్నైలో మాత్రం మిగిలిన నగరాల కంటే కాస్త ఎక్కువగా 1, 53, 820 రూపాయల వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

Gold

వెండి ధరలు కూడా పసిడి(Gold ) బాటలోనే నడుస్తూ కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ఏప్రిల్ 23వ తేదీతో పోల్చుకుంటే కిలో వెండిపై సుమారు 100 రూపాయల వరకు తగ్గి, జాతీయ మార్కెట్‌లో 2,59, 900 రూపాయల వద్ద కొనసాగుతోంది. అయితే హైదరాబాద్, చెన్నై, కేరళ వంటి నగరాల్లో మాత్రం కిలో వెండి ధర 2,65,000 రూపాయల వద్ద కొనసాగుతుంది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న సమయంలో ఇలా వరుసగా రెండో రోజు కూడా ధరలు తగ్గడం పట్ల సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ విలువ పెరగడం, ప్రపంచ పరిస్థితుల్లో కొంత నిలకడ రావడంతో ఇన్వెస్టర్లు మళ్లీ లాభాల స్వీకరణకు మొగ్గు చూపిస్తున్నారు. దీనివల్ల సురక్షిత పెట్టుబడిగా భావించే పుత్తడిపై ఒత్తిడి తగ్గి ధరలు దిగివస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత తగ్గుతాయా లేదా అనేది అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిణామాలపైన ఆధారపడి ఉంటుంది.

Constipation:మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టండి.. అపాన ముద్రతో జీర్ణ వ్యవస్థను స్ట్రాంగ్ చేసుకోండి

Exit mobile version