Gold Price : మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం బంగారం ధర ఎంతుంది?

Gold Price : కొన్ని రోజులుగా పసిడి రేట్లు విపరీతంగా పెరుగుతూ వస్తుండటంతో కొనుగోలుదారులు పసిడి కొనాలంటే పదిసార్లు ఆలోచిస్తున్నారు

Gold Price

బంగారం కొనాలనుకునేవారికి బంగారం ధరలు(Gold Price) మరోసారి గట్టి షాకిచ్చాయి. కొన్ని రోజులుగా పసిడి రేట్లు విపరీతంగా పెరుగుతూ వస్తుండటంతో కొనుగోలుదారులు పసిడి కొనాలంటే పదిసార్లు ఆలోచిస్తున్నారు. మంగళవారం నుంచి మొదలైన ఈ ధరల పెరుగుదల గురువారం కూడా కొనసాగింది. మే 20న అంటే నిన్న ఏకంగా వెయ్యి రూపాయల వరకు పెరిగిన బంగారం ధర, ఈరోజు కూడా కొద్దిగా పైకి కదిలింది.

అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న కొన్ని అనిశ్చిత పరిస్థితులతో జరిగిన మార్పుల వల్ల రేట్లు ఈ రేంజ్‌లో పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ నెలలో రేట్లు కాస్త తగ్గినట్లు కనిపించినా, మే నెలకు వచ్చేసరికి మళ్లీ సీన్ రివర్స్ అయి ధరలు ఆకాశాన్ని తాకడంతో ..బంగారం కొనాలనుకునే వారికి పెద్ద నిరాశే ఎదురవుతోంది.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ. 1లక్ష59వేల930 వద్ద నడుస్తోంది. బుధవారం ఇది రూ. 1లక్ష59వేల 440 వద్ద ఉండగా, బుధవారంతో పోలిస్తే ఇవాళ ఒకేసారి రూ. 490 పెరిగింది. అలాగే సాధారణంగా అందరూ కొనే 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం రేటు పది గ్రాములు రూ. 1లక్ష46వేల600 గా ఉంది. నిన్న ఇది రూ. 1లక్ష46వేల150 వద్ద స్థిరపడగా, ఇవాళ రూ. 450 పెరిగింది. బెంగళూరులో కూడా 24 క్యారెట్లు రూ. 1లక్ష59వేల930 అలాగే 22 క్యారెట్లు రూ. 1లక్ష46వేల 600గానే కొనసాగుతున్నాయి.

ఇక దేశంలో అన్ని ప్రధాన నగరాల కంటే చెన్నైలో బంగారం ధరలు పెరిగాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూ. 760 పెరిగి ప్రస్తుతం రూ. 1లక్ష61వేల670 కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా బుధవారం కంటే రూ. 600 పెరిగి రూ. 1లక్ష48 వేల100 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 1లక్ష60వేల 230 గా ఉండగా, 22 క్యారెట్ల రేటు రూ. 1లక్ష46వేల750 వద్ద కొనసాగుతోంది.

Gold Price

బంగారంతో పాటే సిల్వర్ ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. బుధవారంతో పోలిస్తే గురువారం ఒక్కరోజే కిలో వెండిపై ఏకంగా రూ. 5,000 వరకు పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు చెన్నైలో కూడా కేజీ సిల్వర్ ధర రూ. 5 వేలు పెరిగి ప్రస్తుతం రూ. 2 లక్షల 90వేల మార్కు వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీ,బెంగళూరు నగరాలలో కేజీ సిల్వర్ రేటు బుధవారం కంటే రూ. 5 వేలు పెరిగి రూ. 2 లక్షల 85వేల వద్ద స్థిరపడింది. గోల్డ్, వెండి ధరలు ఇలా రోజూ పెరిగిపోతుండటంతో మధ్యతరగతి ప్రజలు షాపుల వైపు వెళ్లడానికే భయపడుతున్నారు.

Exit mobile version