No UPI Day : అక్టోబర్ 2న నో యూపీఐ డే..యూపీఐకి పడబోతున్న నల్లటి ముసుగుకు రీజనేంటి?

No UPI Day : 2026 ఆగస్టు నెల లెక్కల ప్రకారం చూస్తే.. వ్యాపారుల అకౌంట్లల్లోకి ఏకంగా రూ. 8,95,000 కోట్ల విలువైన సుమారు 1,551 కోట్ల లావాదేవీలు జరిగాయి.

No UPI Day

టీ బడ్డీ దగ్గర రూ.10 ఛాయ్ నుంచి మాల్స్‌లో వేల రూపాయల బిల్లు వరకు అన్నిటికి యూపీఐను నమ్ముకుంటున్నాం. చివరకు చేతిలో వంద నోటు లేకపోయినా చేతిలో స్మార్ట్ ఫోన్‌తో దర్జాగా బతికేస్తున్నాం. కానీ ఆన్ లైన్ పేమెంట్స్ విషయంలో దేశానికి హార్ట్ లాంటి యూపీఐ సిస్టమ్‌కు ఇప్పుడు పెద్ద గండం వచ్చి పడింది.

ఇన్ని రోజులు ఫ్రీగా సాగిన పేమెంట్స్ కథ ఇక ముగిసిపోతోంది. ఇకపై చార్జీలు వడ్డించడానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అవడంతో.. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపార వర్గాలన్నీ ఆందోళన బాట పట్టాయి. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు.. నో యూపీఐ డే(No UPI Day) అంటూ డిజిటల్ సర్వీసులను స్తంభింపజేయడానికి రెడీ అయ్యాయి.

వచ్చే అక్టోబర్ 15వ తారీఖు నుంచి కస్టమర్ల నుంచి వ్యాపారులు స్వీకరించే ప్రతి క్యూఆర్ కోడ్ పేమెంట్‌పై కొత్త రూల్స్‌ను అమలు చేయడానికి డిసైడ్ అయ్యారు. కొత్త నిబంధనల ప్రకారం చూస్తే.. మనం ఏదైనా షాపుకి వెళ్లి వ్యాపారి అకౌంట్‌కి రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ పేమెంట్ చేస్తే, ఆ అమౌంట్ పై 0.4 శాతం మర్చెంట్ డిస్కౌంట్ రేట్ (MDR) చార్జీ పడుతుంది. అయితే ఈ ఫీజుపై గరిష్ఠంగా రూ.300 వరకు లిమిట్ విధించారు.

సామాన్య ప్రజలు ఒకరికొకరు పంపుకొనే పర్సనల్ డిజిటల్ ట్రాన్జాక్షన్స్‌కు ఎలాంటి చార్జీలు వర్తించవు. అలాగే నెలకు రూ.లక్ష వరకు మాత్రమే డిజిటల్ పేమెంట్స్ అందుకునే చిరు వ్యాపారులకు కూడా ఈ వడ్డన నుంచి ల్యాండ్ ఫాల్ కుషన్ లభించింది.

2026 ఆగస్టు నెల లెక్కల ప్రకారం చూస్తే.. వ్యాపారుల అకౌంట్లల్లోకి ఏకంగా రూ. 8,95,000 కోట్ల విలువైన సుమారు 1,551 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటిలో రూ.2,000 కంటే ఎక్కువ విలువైన చెల్లింపుల వాటానే ఏకంగా 67 శాతం ఉండటమే ఇప్పుడు అసలు సమస్యగా మారింది.

ఇప్పటికే బిజినెస్‌లో మార్జిన్లు తగ్గిపోయి వర్తకులు అల్లాడిపోతుంటే, ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పై ఎక్స్‌ట్రాగా పన్ను వంటి ఇలాంటి ఫీజులు బాదితే తాము ఎలా బతకాలంటూ వారు వాపోతున్నారు. క్యాష్ లెస్ ఇండియాను ప్రోత్సహిస్తూ బిజినెస్ పారదర్శకంగా నడుపుతున్న తమను ఎంకరేజ్ చేయాల్సింది పోయి, ఇలా చార్జీల పేరుతో ఇంకా కింద పడేయడం ఏంటని నిలదీస్తున్నారు.

మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ (MACCIA), ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ (AICPDF) వంటి నేషనల్ స్థాయి సంఘాలు ఈ నిరసన సెగను మరింత రాజేశాయి. అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా షాపుల్లో ఉండే క్యూఆర్ కోడ్ స్కానర్లు, కౌంటర్లలో ఉండే సౌండ్ బాక్సులపై బ్లాక్ క్లాత్ కప్పి ప్రొటెస్ట్ తెలపాలని పిలుపునిచ్చాయి.

No UPI Day

ఈ న్యూ టారిఫ్‌ల సెగ కేవలం చిన్న వ్యాపారులతో పాటు పెట్రోల్ బంకుల యజమానులు, స్టాక్ బ్రోకర్లకు కూడా తగిలింది. పెట్రోలియం డీలర్లు తమకు ఎగ్జెంప్షన్ కావాలని కేంద్రంతో చర్చలు జరుపుతుండగా, క్యాపిటల్ మార్కెట్ బిజినెస్‌పై విధించిన 0.02 శాతం ఎండీఆర్ చార్జీలను రివ్యూ చేస్తామని సెబీ హామీ ఇచ్చింది.

ఒకవేళ అక్టోబర్ 15 వ తేదీలోగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే నిరసనను మరింతగా తెలియ చేసి వీధుల్లోకి వస్తామని బిజినెస్ అసోషియషన్స్ హెచ్చరిస్తున్నాయి. మొత్తంగా అక్టోబర్ 2వ తేదీన స్కాన్ చేయకుండా(No UPI Day) గూగుల్ పే, ఫోన్ పే వంటి డిజిటల్ పేమెంట్స్‌ పక్కన పెట్టి మళ్లీ పాతకాలం నాటి క్యాష్ పేమెంట్ వైపు జనాలు ఎలా వెళ్తారో చూడాలి మరి.

Sugar : పంచదారకు బై చెప్పేశారా? సైంటిస్టులు చెబుతున్న ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి..

↑
Exit mobile version