Rupee strength:రూపాయి జోరు,క్రూడ్ ఆయిల్ పతనం.. మార్కెట్లలో సరికొత్త జోష్..

Rupee strength: అమెరికా మధ్యంతర ఎన్నికల రిజల్ట్ పుణ్యమా అని ఇంటర్నేషనల్ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోయాయి. దీని ఎఫెక్ట్‌తో భారత రూపాయి మారకం విలువ పుంజుకోవడం అలాగే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి.

Rupee strength

అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు భారత దేశ ఆర్థిక రంగానికి పెద్ద ఊరటనిచ్చాయి. అమెరికాలో జరిగిన మిడ్ టర్మ్ ఎలక్షన్ రిజల్ట్ ఫలితంగా భారత దేశ కరెన్సీ రూపాయి(Rupee strength) వరుసగా ఐదో సెషన్‌లోనూ లాభాల బాట పట్టడంతో పాటు, గ్లోబల్ వైడ్‌గా క్రూడ్ ఆయిల్ రేట్లు ఘోరంగా పడిపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ఆరంభంలో డాలర్‌తో పోలిస్తే మన కరెన్సీ విలువ 29 పైసలు బలపడి 94.35 కి పెరిగింది. నిన్నటి ట్రేడింగ్ ముగింపులో రూపాయి విలువ 94.64 వద్ద నిలిచిన సంగతి తెలిసిందే.

ఇక ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు రేట్లు అయితే వరుసగా నాలగవ రోజు కూడా కిందకి జారాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేటు 1.16 డాలర్లు క్షీణించి 93.46 డాలర్లకు పడిపోయింది. అలాగే అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) కాస్ట్ కూడా 1.47 డాలర్లు తగ్గి 86.65 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక్క వీక్‌లోనే క్రూడ్ ఆయిల్ ధరలు ఏకంగా 16 శాతం వరకూ కోల్పోవడం ప్రపంచ దేశాలకు భారీ రిలీఫ్‌ను కలిగించింది.

అమెరికా మధ్యంతర ఎలక్షన్స్‌లో సిట్టింగ్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్గానికి ఊహించని ఎదురుదెబ్బ తగలడమే ఈ మార్పులకు అసలు కారణమని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్‌లోని 2 సభల్లోనూ డెమోక్రాట్లు పాగా వేయడంతో, ఇరాన్ దేశంతో యుద్ధానికి దిగాలనే ట్రంప్ ఆలోచనలకు అడ్డం పడే అవకాశం ఉంది.

కేవలం అమెరికా సైనిక చర్యలకే పరిమితం కాకుండా, శాంతియుత చర్చల ద్వారా ఈ సమస్యను సెటిల్ చేసుకోవాలని ట్రంప్‌పై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు ఇరాన్‌పై ఇప్పట్లో ఎలాంటి దాడులను చేసే ప్లాన్ లేదని డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించడంతో ఇంటర్నేషనల్ మార్కెట్లలో నెలకొన్న ఉద్రిక్తతలు పూర్తిగా సద్దుమణిగాయి.

ఈ సానుకూల పరిణామాలన్నీ కలసి మన దేశీయ షేర్ మార్కెట్లకు మంచి కిక్‌ను ఇచ్చాయి. స్టార్టింగ్‌లోనే బీఎస్‌ఈ సెన్సెక్స్ ఏకంగా 1600 పాయింట్ల లాభంతో 78వేల910 వద్ద ప్రారంభం కాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 417 పాయింట్లు పైకి ఎగబాకి 24వేల378 వద్ద జోరుగా ట్రేడింగ్‌ను కొనసాగిస్తోంది. చమురు ధరల పతనం, రూపాయి(Rupee strength) బలపడటం వల్ల రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని ఆర్థిక నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Radhika Apte comments:టాలీవుడ్‌ను టార్గెట్ చేస్తున్న హీరోయిన్లు.. రాధికా ఆప్టే కామెంట్లతో మళ్లీ తెరపైకి వివాదాలు..

↑
Exit mobile version