Gold Rate : వరుసగా రెండోరోజు దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..రూ.1,800 తగ్గిన పసిడి ధర

Gold Rate : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయో చూస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1లక్ష40వేల130 కి చేరింది.

Gold Rate

పసిడి, వెండి కొనాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి అదిరిపోయే శుభవార్త వినిపిస్తోంది. వరుసగా రెండోరోజు కూడా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం రేట్లు దిగిరావడంతో, దేశీయంగా కూడా గోల్డ్, సిల్వర్ ధరలు ఒక్కసారిగా కిందకు దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 40 డాలర్లు తగ్గి 3,976 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్‌పై ఏకంగా రూ. 1,800 వరకు తగ్గింది. అలాగే జ్యువెలరీ తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారంపై కూడా రూ. 1,650 వరకూ కోత పడింది. పుత్తడితో పాటే సిల్వర్ కూడా భారీగా పతనమై కొనుగోలుదారులకు పెద్ద రిలీఫ్ ఇచ్చింది.

తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయో చూస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర(Gold Rate) రూ. 1లక్ష40వేల130 కి చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1లక్ష28వేల450 వద్ద కొనసాగుతోంది.సిల్వర్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో కేజీ సిల్వర్ ధర ప్రస్తుతం రూ. 2లక్షల49వేల 900 మార్కు వద్దకు చేరింది.

Gold Rate

దేశంలోని ఇతర మెట్రో సిటీలలో ఈ ధరలను గమనిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర(Gold Rate) రూ. 1 లక్ష40వేల280 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 1లక్ష28వేల600 గా ఉంది. ముంబై, కోల్‌కతా, చెన్నైలో 24 క్యారెట్ల పుత్తడి రేట్ రూ. 1లక్ష45వేల 080 వద్ద, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1 లక్ష32వేల990 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఇక ఇతర సిటీలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరులో కేజీ వెండి ధర రూ. 2లక్షల35వేలు పలుకుతుండగా.. చెన్నైలో మాత్రం కేజీ సిల్వర్ ధర రూ. 2లక్షల44వేల 900 వద్ద కొనసాగుతోంది.

Hair : జుట్టు విపరీతంగా ఊడుతోందా? స్కాల్ప్‌ను కాపాడుకునే సింపుల్ టిప్స్ ఈ రెండే..

Exit mobile version