Anushka:బన్నీ-అట్లీ కాంబోలో బిగ్గెస్ట్ సర్ప్రైజ్.. ఎనిమిదేళ్ల తర్వాత వెండితెరపైకి అనుష్క

Anushka: ఐదో హీరోయిన్‌గా టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ స్టార్ నటి అనుష్క శర్మ నటించబోతున్నారనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Anushka

పుష్ప మూవీతో గ్లోబల్ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తన తర్వాత ప్రాజెక్టుల విషయంలో చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్‌లో రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ ‘AA22xA6’ గురించి ఒక రేంజ్‌లో చర్చ నడుస్తోంది.

ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచీ కూడా రకరకాల వార్తలు వినిపిస్తుండగా, తాజాగా బన్నీ ఫ్యాన్స్ అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీలో ఐదో హీరోయిన్‌గా టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ స్టార్ నటి అనుష్క శర్మ నటించబోతున్నారనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

2018లో వచ్చిన జీరో సినిమా తర్వాత అనుష్క శర్మ(Anushka) మళ్లీ ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించలేదు. పెళ్లి, పిల్లల బాధ్యతలతో లండన్‌లో స్థిరపడిన ఆమె, ఇప్పుడు ఎనిమిదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఈ మెగా ప్రాజెక్టుతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టడం విశేషం. నిజానికి ఈ మూవీలో దీపికా పదుకొనే, రష్మిక మందన్నా, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ వంటి స్టార్ హీరోయిన్లు ఫిక్స్ అయినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడు అనుష్క శర్మ కూడా యాడ్ అవడంతో ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా మారబోతోంది.

Anushka

అట్లీ ఈ సినిమాను ఒక హై-లెవల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా, దాదాపు 700 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఈ మూవీలో తాత, తండ్రి, ఇద్దరు కొడుకులుగా మొత్తం నాలుగు డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నారని, ఇది టైమ్ ట్రావెల్ లేదా పారలల్ యూనివర్స్‌గా సాగే సరికొత్త కాన్సెప్ట్ అని తెలుస్తోంది. ఇలాంటి భారీ కాస్టింగ్ ఉండటం వల్ల ప్రతి పాత్రకు సమానమైన ఇంపార్టెన్స్ ఉండటంతో.. అనుష్క శర్మ (Anushka)కూడా ఈ పవర్ ఫుల్ సబ్జెక్టుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

వచ్చే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఆ రోజే ఈ క్రేజీ కాస్టింగ్ పై మూవీ యూనిట్ ఒక క్లారిటీ ప్రకటన ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఒకవేళ అనుష్క శర్మ ఈ ప్రాజెక్టులోకి రావడం ఫిక్స్ అయితే, ఆమెకు ఇది ఒక గ్రాండ్ రీ-ఎంట్రీ అవడమే కాకుండా, డైరెక్టుగా తెలుగులో అనుష్క చేసే ఫస్ట్ సినిమా అవుతుంది.
బాలీవుడ్ స్టార్ ప్రియాంకా చోప్రా కూడా రాజమౌళి మూవీతో సౌత్ లోకి రీ-ఎంట్రీ ఇస్తున్న సమయంలో, అనుష్క శర్మ కూడా అదే బాటలో నడవడమే హాట్ టాపిక్ అవుతోంది.

Renu Desai:ధురంధర్ 2 మూవీపై రేణు దేశాయ్ క్రేజీ రివ్యూ.. మోదీపై హాట్ కామెంట్స్

Exit mobile version