Bellamkonda Srinivas : టాలీవుడ్ లో మ్యారేజ్ ట్రెండ్..పెళ్లి పీటలెక్కనున్న మరో యంగ్ హీరో

Bellamkonda Srinivas : పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్

Bellamkonda Srinivas

టాలీవుడ్ ప్రస్తుతం పెళ్లి సందడితో బిజీబిజీగా కనిపిస్తోంది. సినిమా షూటింగ్స్ కంటే కూడా సెలబ్రిటీల పెళ్లిళ్లతో కళకళలాడుతోంది. తెలుగు హీరోలు ఒక్కొక్కరుగా బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేసి , ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఇటీవలే విజయ్ దేవరకొండ-రష్మిక ఒక్కటవ్వగా, అల్లు శిరీష్ నయనికా రెడ్డితో ఏడడుగులు వేశాడు. ఇప్పుడు ఈ హీరోల బాటలోనే మరో యంగ్ హీరో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆ యంగ్ హీరో ఎవరో కాదు బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas).

నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయి శ్రీనివాస్ అల్లుడు శీను, రాక్షసుడు వంటి పలు సినిమాలతో హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. హిట్-ఫ్లాప్ తో సంబంధం లేకుండా మంచి కథలు ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. గత కొద్ది రోజులుగా సాయి శ్రీనివాస్ పెళ్లి గురించి కూడా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ యువ హీరోకు పెళ్లి కుదిరిందని, త్వరలోనే నిశ్చితార్థం జరగనుందని సమాచారం.

దీనిపై త్వరలోనే అధికారక ప్రకటన వెలువడనుంది. పెద్దలు కుదిర్చిన సంబంధమా.. పెళ్లి కూతురు బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. వంటి ప్రశ్నలతో అభిమానులు ఆరా తీస్తున్నారు. సాయి శ్రీనివాస్..తన తల్లిదండ్రులు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాడని టాక్. మార్చి 15లోగా ఎంగేజ్ మెంట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఆ తర్వాతే వధువుకు సంబంధించిన వివరాలు తెలిసే అవకాశముంది.

Bellamkonda Srinivas

2014లో అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తొలి మూవీతోనే ఆకట్టుకున్నాడు. మంచి ఎనర్జీతో డాన్సులు, ఫైట్లు చేసి అలరించాడు. ఉత్తమ నూతన నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డ్ అందుకున్నాడు. ఆ తర్వాత స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడుతో విభిన్న కథలు ఎంపిక చేసుకుని నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు.

హిందీలో డబ్ చేసిన సాయి శ్రీనివాస్(Bellamkonda Srinivas) యాక్షన్ మూవీస్ కి మంచి రియాక్షన్ వచ్చింది. ఈ క్రేజ్ తోనే ఛత్రపతి హిందీ రీమేక్ లో నటించినా అనుకున్న ఫలితం రాలేదు. గతేడాది వచ్చిన భైరవం ఆ తర్వాత వచ్చిన కిష్కింధపురి సినిమాలతో మరోసారి నటుడిగా మంచి మార్కులే సంపాదించుకున్నాడు. ప్రస్తుతం రామన్, టైసన్ నాయుడు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version