Bhartha Mahasayulaku Vignyapthi
సంక్రాంతి సమయంలో థియేటర్లలో రచ్చ చేసిన మాస్ మహారాజ్ రవితేజ.. ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైపోయారు. పక్కా కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే రవితేజ, ప్రేక్షకులను భర్త మహాశయులకు విజ్ఞప్తి(Bhartha Mahasayulaku Vignyapthi)తో బాగా ఎంటర్టైన్ చేశారు .
సంక్రాంతి కానుకగా జనవరి 13న అన్ని థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ, ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా బాగా ఆకట్టుకుంది. ఇద్దరు అందాలభామల మధ్య నలిగిపోయే భర్తగా ..రవితేజ పండించిన కామెడీ ఈ మూవీకి మెయిన్ హైలెట్‌గా నిలిచింది.
అయితే థియేటర్లో రిలీజైన నెల రోజులకే చాలా సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేస్తున్న సమయంలో, ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి(Bhartha Mahasayulaku Vignyapthi) మూవీ స్ట్రీమింగ్ ఆలస్యం అవ్వడంపై ఫ్యాన్స్ కొంత అయోమయంలో ఉన్నారు.
మరిన్ని సినిమాల కంటే ముందే రావాల్సిన ఈ మూవీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఓటీటీలో స్ట్రీమింగ్‌కు నోచుకోలేదు. చాలాసార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. రవితేజ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ..జీ5 (ZEE5) దక్కించుకోవడంతో.. అధికారిక ప్రకటన వెలువడింది.
ఈ కామెడీ ఎంటర్‌టైనర్ మార్చి 13 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. కేవలం తెలుగులోనే కాకుండా, తమిళ్, మలయాళం, కన్నడ లాంగ్వేజ్‌లలో కూడా ఈ మూవీ అందుబాటులోకి రానుంది. కిశోర్ తిరుమల డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీలో రవితేజతో పాటు ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించగా, సత్య, వెన్నెల కిషోర్, సునీల్ వంటి.. స్టార్ కమెడియన్స్ తమ కామెడీతో సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లారు.
ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మించారు. థియేటర్లలో మిస్ అయిన వారు, లేదంటే మళ్లీ చూడాలనుకునే వారు.. ఈ వీకెండ్‌లో రవితేజ మార్కు కామెడీని ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు.
