Bigg Boss 10 Telugu Day 22 : బిగ్ బాస్ హౌస్‌లో కత్తుల యుద్ధం..రణరంగంలో గెలిచిందెవరు?

Bigg Boss 10 Telugu Day 22 : మిథిలేష్ ఎలిమినేషన్ చుట్టూ తిరిగిన హౌస్ వాతావరణం, తర్వాత రణరంగంగా మారిపోయింది.

Bigg Boss 10 Telugu Day 22

డ్రామాలు, ఈగో ఫైట్స్, వ్యూహాలు, అరుపులతో బిగ్ బాస్ హౌస్‌లో రోజు రోజుకూ వేడి నెక్స్ట్ లెవెల్‌కి చేరిపోతోంది. మిథిలేష్ ఎలిమినేషన్ చుట్టూ తిరిగిన హౌస్ వాతావరణం, తర్వాత రణరంగంగా మారిపోయింది. సెప్టెంబర్ 28 రోజు ఎపిసోడ్(Bigg Boss 10 Telugu Day 22) స్టార్టింగ్ నుంచే హౌస్‌లో గొడవల హీట్ రాజుకుంది. మిథిలేష్ ఎగ్జిట్ అయ్యాక అగ్నిపరీక్ష టీమ్‌లో తను లేకపోవడంపై చర్చ నడిచింది. మరోవైపు అపూర్వ, ముకేష్‌ మధ్య వర్క్ అసైన్‌మెంట్ విషయంలో పెద్ద గొడవ జరిగింది.

నువ్వు చెప్తే నేను వినేది ఏంటని.. ముందు కెప్టెన్ మీటింగ్ పెట్టాలని, ఆ తర్వాతే వర్క్స్ ఇవ్వు అంటూ ముకేశ్ చెప్పడంతో అపూర్వ వెంటనే హౌస్ మీటింగ్ కాల్ ఫర్ చేసింది. అయితే మీటింగ్‌లోనూ సీన్ మారలేదు. ముకేశ్, త్రిగుణ్ ఇద్దరూ తనకు ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వట్లేదని, తనను కెప్టెన్ అని పిలవాల్సిందేనని అపూర్వ రూల్ పాస్ చేసినా, త్రిగుణ్ మాత్రం తనను కెప్టెన్ అని పిలవను గాక పిలవనని మొండికేసాడు.

ఇదిలా ఉంటే, రోహిత్ – షాలిని మధ్య అపూర్వ ఎంట్రీతో పొసెసివ్ గొడవ స్టార్ట్ అయింది. అపూర్వ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి షాలినికి ఎక్కడో ఇన్ సెక్యూరిటీ, భయం పట్టుకున్నట్లు కనిపిస్తుంది. మరోవైపు దేబ్జానీ.. త్రిగున్, రామ్ ప్రసాద్‌తో ముచ్చట్లు పెడుతూ అగ్నిపరీక్ష గ్రూప్‌లోని అసలు గ్రూపిజాన్ని , మిథిలేష్‌ను బయటకు పంపడానికి వెనుకున్న స్ట్రాటజీని బయటపెట్టింది.

ఇక హౌస్‌లో టోటల్ డామినేషన్ టాస్క్ అనౌన్స్ చేసిన బిగ్ బాస్.. ఈసారి సభ్యులే టీమ్స్ చేసుకోవడం కాదు, బిగ్ బాసే అందరినీ రెండు జట్లుగా విడగొట్టేసాడు. వర్షిణి, ఝాన్సీ, రోహిత్, అపూర్వ, రామ్ ప్రసాద్, అమన్, వంశీ, సుధీర్ ఒక టీమ్‌గా ఏర్పడి తమ జట్టుకి ‘భైరవ’ అని పేరు పెట్టుకున్నారు. ఇక షాలిని, సృష్టి, చరణ్, నరేష్, త్రిగుణ్, ముకేష్, దేబ్జానీ కలిసి సప్త శక్తి పేరుతో రంగంలోకి దిగారు.

ఈ వార్‌లో గెలిచిన జట్టుకు ఆరో వారంలో స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పిన బిగ్ బాస్.. కొన్ని కత్తులను హౌస్‌లోకి పంపాడు. ప్రతీ ఒక్కరూ కనీసం 2 లేదా అంతకంటే ఎక్కువ కత్తులను సొంతం చేసుకోవాలని చెప్పడంతో ఒక టీమ్ కత్తులను ఇంకో టీమ్ లాక్కోడానికి చిన్నపాటి యుద్ధమే చేసింది. ఝాన్సీ, వర్షిణి, అపూర్వ తమ కత్తులను సేఫ్‌గా దాచుకోగా, వర్షిణి దగ్గరున్న కత్తిని లాక్కోవడానికి ముకేష్ బాగా క్లోజ్ అయ్యాడు. ఇక విడివిడి గ్రూపుల్లో ఉన్న నరేష్, రామ్ ప్రసాద్‌ మధ్య కూడా కత్తుల గొడవ తీవ్ర స్థాయికి చేరింది.

ఆ తర్వాత బిగ్ బాస్ రణరంగంలో రథ నిర్మాణం అనే ఫిజికల్ టాస్క్ ఇవ్వగా.. బిగ్ బాస్ రిలీజ్ చేసే బార్లను రెండు ప్లేసుల నుంచి నలుగురు చొప్పున కంటెస్టెంట్లు కలెక్ట్ చేసి తమ టీమ్‌కి అందించాలి. రోహిత్, షాలిని సంచాలక్‌లుగా ఉంటూ గేమ్ ఆడాల్సి ఉంది. టాస్క్ మధ్యలో రోహిత్, షాలిని మాట్లాడుకుంటున్నప్పుడు అపూర్వ అక్కడికి రాగా మేము మాట్లాడుకుంటున్నాం పక్కకు పో అన్నట్లు షాలిని అరిచేసింది. అపూర్వ సైలెంట్‌గా వెళ్లిపోయినా కూడా షాలిని ఓవరాక్షన్ చేసింది.

Bigg Boss 10 Telugu Day 22

గేమ్ స్టార్ట్ కాగానే రెండు సైడ్‌లా బార్లు రావడం, రెండు టీమ్స్ ఒకరిపై ఒకరు పడిపోయి మరీ లాక్కుంటూ వీర లెవెల్లో పోరాడారు. అయితే చిన్న బ్రేక్‌లో అపూర్వ తన టీమ్‌ని పిలిచి షాలిని దగ్గరున్న సృష్టి కత్తిని లాక్కోండని ఐడియా ఇచ్చింది. దీంతో భైరవ టీమ్ మెంబర్స్ అంతా షాలినిపై పడ్డారు. కాకపోతే షాలిని ఆ కత్తిని అప్పటికే సృష్టికి ఇచ్చేసినా కూడా ఆ విషయం చెప్పకుండా గొడవను పెద్దది చేసి.. అపూర్వ కావాలనే తనను టార్గెట్ చేసిందని అరిచింది. త్రిగుణ్ మధ్యలోకి వచ్చి షాలినికి సపోర్ట్ చేయడంతో రోహిత్‌కి విపరీతంగా కోపం వచ్చి ఫైరవ్వడంతో.. త్రిగున్ , రోహిత్‌ ఫైట్ చేసుకునే వరకూ వెళ్లిపోయారు.

ఇలా మొదటి రౌండ్ పోరు కంప్లీట్ అయ్యేసరికి భైరవ టీమ్ ఏకంగా 32 బార్లు సాధించి టాప్‌లో నిలబడగా, సప్త శక్తి టీమ్ కేవలం 19 బార్లతో వెనుకబడింది. మొదటి రౌండ్ విక్టరీ భైరవ టీమ్‌దే అయినా, నెక్స్ట్ వచ్చే నామినేషన్ల వేడి, ఈ రథ నిర్మాణం టాస్క్ ఎలాంటి ఊహించని టర్న్‌లు తిరుగుతుందో చూడాలి మరి(Bigg Boss 10 Telugu Day 22).

October 1 New Rules : అక్టోబర్ 1వ తేదీ నుంచి మారనున్న కొత్త నిబంధనలు..

↑
Exit mobile version