Bigg Boss 10
బుల్లితెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ హంగామాకు కౌంట్ డౌన్ మొదలయింది. ఎంటర్‌టైన్మెంట్ ఫీస్ట్‌ను, ఊహించని ట్విస్టులను ఒకే వేదికపైకి తెచ్చే బిగ్ బాస్ పదో సీజన్ మరికొద్ది గంటల్లోనే మనందరి ముంగిట వాలిపోతోంది.
నాగార్జున మార్క్ హోస్టింగ్, దశావతారం అనే న్యూ కాన్సెప్ట్, మైండ్ బ్లోయింగ్ థీమ్‌తో రాబోతున్న 10వ సీజన్ కోసం బిగ్ బాస్ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ గ్రాండ్ సెలబ్రేషన్ స్టార్ మా ఛానల్ అలాగే డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ ఫ్యాన్స్‌ను అలరించడానికి సిద్ధమైంది. అయితే ఈ సీజన్‌లో షో ఆర్గనైజర్స్ తీసుకున్న క్రేజీ నిర్ణయం ఫ్యాన్స్ అందరినీ ఖుషీ చేస్తోంది.
ఈరోజు అంటే సెప్టెంబర్ 6 వతేదీ రాత్రి 7 గంటలకు గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌తో ఈ షో షురూ కానుంది. ఇక ప్రతీ రోజు సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకు ప్రసారం అవుతాయి. కింగ్ నాగార్జున వీకెండ్‌లో ఇచ్చే వీక్లీ పంచ్‌ల కోసం వెయిట్ వీకెండ్స్ శని, ఆదివారాల స్పెషల్ ఎపిసోడ్లు మాత్రం రాత్రి 9:00 గంటలకే టెలికాస్ట్ కానున్నాయి.
ఇప్పటి వరకూ రాత్రి 10:00 గంటలకు ప్రారంభమైన షో.. 11గంటలు దాటాకే ముగిసేది. దీనివల్ల జాబ్ చేసేవాళ్లు, ఫ్యామిలీ ఆడియెన్స్ నైట్ లేట్‌గా పడుకోవాల్సి వస్తుందని షోను మిస్ అయ్యేవారు. ఇప్పుడు దానికి చెక్ పెడుతూ 9:30 ప్రైమ్ టైమ్‌కు బిగ్ బాస్‌ను మార్చడంతో ఈ సీజన్ టీఆర్‌పీ (TRP) రికార్డులు తిరగరాయడం గ్యారంటీ అని విశ్లేషకులు చెబుతున్నారు.
తెలుగులో ఒకసారి బిగ్ బాస్ జర్నీని రివైండ్ చేసుకుంటే.. 2017లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ .. రాత్రి 9:30 గంటలకే టెలికాస్ట్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 2018లో నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా చేసిన సెకండ్ సీజన్ కూడా సేమ్ టైమింగ్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఆ తర్వాత కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చాక ఫోర్త్ సీజన్ నుంచి షో టైమింగ్‌ను రాత్రి 10:00 గంటలకు మార్చినా అదే జోష్‌ను కంటిన్యూ చేసింది. కాకపోతే తర్వాత సీజన్ల టీఆర్‌పీ అప్ అండ్ డౌన్ అవుతూ ఆర్గనైజర్స్‌ను ఆలోచనలో పడేసింది. దీనికోసమే మళ్లీ ఇప్పుడు 10వ సీజన్ కోసం ఓల్డ్ ప్రైమ్ టైమ్ 9:30ని రీ-ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.
కాగా వరుసగా ఎనిమిది సార్లు బిగ్ బాస్ రథసారధిగా బాధ్యతలు చేపట్టిన కింగ్ నాగార్జున ఈసారి రియాలటీ షో హౌస్‌ను మరిన్ని సర్‌ప్రైజ్‌లతో నింపేశారు. అగ్నిపరీక్ష కాన్సెప్ట్ ద్వారా సెలెక్ట్ అయిన ఆరుగురు కామనర్లతో పాటు, 10 మంది సెలబ్రిటీలతో మొత్తం 16 మంది కంటెస్టెంట్లతో హౌస్‌ను కలర్‌ఫుల్‌గా మారుస్తున్నారు. కొత్త టైమింగ్, కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఈసారి తెలుగు బుల్లితెరపై ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి మరి.
Chicken Pickle : నెలల తరబడి పాడవని చికెన్ పచ్చడి.. ఈ 2 సీక్రెట్ టిప్స్ పాటిస్తే టేస్ట్ అదుర్స్..
