Bigg Boss Captaincy : బిగ్ బాస్ హౌస్‌లో ఫస్ట్ కెప్టెన్ ఫైట్..దేబ్జానీ క్యూట్ లవ్ ట్రాక్

Bigg Boss Captaincy : రోహిత్, త్రిగుణ్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సమయంలో, కెప్టెన్సీ టాస్క్ హౌస్‌ని మరింత హీటెక్కించిందనే చెప్పొచ్చు.

Bigg Boss Captaincy

మండేరోజు బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్ల మంటలు చల్లారకముందే తొలి కెప్టెన్సీ కిరీటం కోసం కంటెస్టెంట్లు మరో యుద్ధానికి దిగారు. ఫస్ట వీక్‌లో కెప్టెన్ లేకపోవడంతో, ఈసారి ఫస్ట్ కెప్టెన్ అయి హౌస్‌పై డామినేషన్ సాధించాలని రెండు బ్యాచ్‌లు ప్లాన్ చేశాయి. మెయిన్‌గా రోహిత్, త్రిగుణ్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సమయంలో, కెప్టెన్సీ టాస్క్ హౌస్‌ని మరింత హీటెక్కించిందనే చెప్పొచ్చు.

ఈ వారం కెప్టెన్సీ కోసం త్రిగుణ్, రోహిత్, షాలిని, అమన్, దేబ్జానీ, ముకేష్, ఝాన్సీ, రామ్ ప్రసాద్‌ నిలబడ్డారు. అయితే దీనికోసం జరిగిన పోటీలో రోహిత్, రామ్ ప్రసాద్, త్రిగుణ్, షాలిని రేస్ నుంచి అవుటయ్యారు. ఈ టాస్క్ జరుగుతున్న సమయంలో రోహిత్, త్రిగుణ్‌ మధ్య మాటల తూటాలు పేలాయి.

రామ్ ప్రసాద్ దగ్గరకు స్ట్రెయిట్‌గా వచ్చిన రోహిత్ .. నువ్వు నాకంటే గట్టి కాంపిటీటర్ బ్రో, అందుకే నిన్ను పక్కన పెడుతున్నానని చెప్పడంతో రామ్ ప్రసాద్‌కి బాగా కాలింది. స్ట్రాంగ్ ఉన్నవాళ్లను ఉంచాలని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నావా అంటూ నిలదీయగా అవును ఇప్పుడు మార్చుకున్నా అని రోహిత్ ప్లేటు తిప్పినట్లు మాట్లాడాడు. రామ్ ప్రసాద్ మాత్రం నామినేట్ చేయడానికి తనకు ఇంతకన్నా మంచి పాయింట్ దొరకదని వార్నింగ్ ఇచ్చి పక్కకెళ్లాడు.

ఆ తర్వాత ఝాన్సీ వర్సెస్ రోహిత్ డ్రామా స్టార్ట్ అయింది. నాపై భజన అనే వర్డ్ వాడావు కదా.. నా గురించి నీకేం తెలుసు అని అలా అన్నావు?’ అంటూ ఝాన్సీ కౌంటర్ ఇవ్వగా, నీ ఆట చూసే అన్నానని రోహిత్ చెప్పాడు. దానికి ఝాన్సీ నీ భజన నువ్వు చేసుకో, నా భజన నేను చేసుకుంటానని వెక్కిరిస్తూ కౌంటర్ ఇచ్చింది. దీంతో త్రిగుణ్ మధ్యలోకి దూరి ఝాన్సీని సపోర్ట్ చేయబోయేసరికి.. నువ్వేమైనా డిఫెన్స్ లాయర్‌వా అని అతనిపై రోహిత్ తిరగబడ్డాడు. త్రిగుణ్ దీనికి అవును అని సమాధానమివ్వగా. ఓడిపోయినోడివి సైలెంట్‌గా కూర్చో అని రోహిత్ కౌంటర్ ఇచ్చాడు.

మరోవైపు షాలిని .. నాగార్జున టాస్క్‌లో దేబ్జానీకి ఎందుకు సపోర్ట్ చేశావంటూ రామ్ ప్రసాద్ బెలూన్ పేల్చి అతనిని రేస్ నుంచి తోసేసింది. ఈ గొడవలోకి దేబ్జానీ కూడా రావడం, తాను మాట్లాడాల్సింది మాట్లాడేసా, ఇక చెప్పేది లేదని వెళ్లిపోవడంతో.. ఇద్దరి మధ్య హీట్ మరింత పెంచేసింది.

ఇక ఈ హౌస్‌లో ఇప్పుడిప్పుడే బయటపడుతున్న లవ్ ట్రాక్ సంగతి చూస్తే.. వీకెండ్‌లో నాగ్ ముందే ముకేష్‌ గౌడపై తనకున్న ఇష్టాన్ని బయటపెట్టిన దేబ్జానీ, మంగళవారం ఎపిసోడ్‌లో ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసింది. ముకేష్, వర్షిణితో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేసి బయటకు రాగానే దేబ్జానీకి పొసెసివ్‌నెస్‌తో .. ఒక అమ్మాయితో బట్టల్లేకుండా పూల్‌లో ఉంటావా?’ అని అడిగింది.దీనికి ముకేష్ దొరికిపోయిన దొంగలా కవర్ చేసుకోవడానికి ట్రై చేయడం.. నేను నెక్స్ట్ వేరే వాళ్లతో పూల్‌లో దిగినప్పుడు నీకు తెలుస్తుందని దేబ్జానీ అన్న పంచ్‌లు ఫన్నీగా అనిపించాయి.

Bigg Boss Captaincy

మరోవైపు నామినేషన్ల గొడవల తర్వాత సృష్టి దగ్గరకు వెళ్లిన త్రిగుణ్.. గోడ మీద పిల్లి అని అన్న మాటను కవర్ చేసుకోవడానికి ప్యాచ్ వర్క్ స్టార్ట్ చేశాడు. సుధీర్ తన తప్పులు బయటపెట్టాడడంతో..ఇకపై అతని ముఖం కూడా చూడననని శపథం చేశాడు. కానీ రోహిత్ మాత్రం షాలిని దగ్గర అసలు ప్లాన్ లీక్ చేసేశాడు. త్రిగుణ్ బాగా హోమ్‌వర్క్ చేసి వచ్చాడని అందుకే అతను టాప్ 5లో ఉంటాడని అన్నాడు. తాను కూడా ప్రతి ఒక్కరి వీక్‌నెస్‌లు, మైల్‌స్టోన్స్ అన్నీ కూడా లెక్కేసుకుని డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసుకొని వచ్చానంటూ మైండ్ గేమ్‌ని బయటపెట్టాడు.

కెప్టెన్సీ బెర్త్ కోసం నడుస్తున్న ఈ ఫైట్‌లో ఈగోలు, లవ్ ట్రాక్‌లు, ఫ్రెండ్‌షిప్‌లు అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మరి రాబోయే ఎపిసోడ్‌లలో ఇవి ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.

Five Forms of Lord Venkateswara : తిరుమల శ్రీవారి గర్భగుడిలో ఉండే 5 విగ్రహాలు.. ఏ మూర్తిని పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తుంది?

Exit mobile version