Bigg Boss Day – 3 : బిగ్ బాస్ హౌస్‌లో మూడో రోజే పనుల పంచాయితీ, షాకింగ్ ట్విస్టులు..బయటపడిన రోహిత్ మైండ్ గేమ్

Bigg Boss Day - 3 : బ్లూ టీమ్‌కి లీడర్‌గా రామ్ ప్రసాద్ దూరమవ్వడంతో, ఆ ప్లేస్‌లో దేబ్జానీని కొత్త లీడర్‌గా ఎన్నుకున్నారు.

Bigg Boss Day – 3

బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని మలుపులు, సరికొత్త డ్రామాలు థర్డ్ డే(Bigg Boss Day – 3) పీక్స్‌కి చేరాయి. హౌస్‌మేట్స్ మధ్య అసలు రంగులు బయటపడుతూ ఉండటంతో ఆడియన్స్‌కి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతోంది.

గన్ ఫైటింగ్ టాస్క్‌లో రెండు టీమ్స్ కూడా రూల్స్ బ్రేక్ చేయడంతో..ఏ టీమ్ కూడా గెలవలేదని బిగ్ బాస్ అనౌన్స్ చేసి పెద్ద షాకిచ్చారు. అంతేకాదు రెండు జట్ల నుంచి ఒక్కొక్కరిని హై రిస్క్ జోన్‌కి పంపాలంటూ చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చారు.

బ్లూ టీమ్ నుంచి టీమ్ లీడర్ రామ్ ప్రసాద్ ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా, త్రిగుణ్ వద్దంటున్నా వినకుండా కూడా తనే ముందుకొచ్చాడు. కానీ రెడ్ టీమ్‌లో మాత్రం ఆ టీమ్ లీడర్ రోహిత్ పక్కా స్కెచ్ వేశాడు. నైస్‌గా తాను తప్పుకుని చరణ్‌ను ఇరికించి.. సొంత టీమ్ మెంబర్స్ మధ్యే గొడవలు రాజేశాడు.

అలా రోహిత్ వల్ల చరణ్ హై రిస్క్‌లోకి వెళ్లాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. పైగా కాసేపు రోహిత్ కన్నీళ్లు పెట్టుకున్నట్లు యాక్షన్ చేస్తూ వర్షిణికి క్లోజ్ అవ్వడానికి ట్రై చేయడానికి చూడటం రోహిత్.. నెక్స్ట్ లెవెల్ మైండ్ గేమ్‌ ఆడుతున్నాడంటూ ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు.

దీని తర్వాత కింగ్ నాగార్జున ఇచ్చిన స్పెషల్ బ్యాడ్జీలను దేబ్జానీ కొంతమంది కంటెస్టెంట్లకు పంచింది. ఇక రామ్ ప్రసాద్, చరణ్ హై రిస్క్‌లో పడటంతో వారిద్దరూ కూడా ఇకపై టీమ్స్‌లో ఉండరని బిగ్ బాస్ చెప్పారు. బ్లూ టీమ్‌కి లీడర్‌గా రామ్ ప్రసాద్ దూరమవ్వడంతో, ఆ ప్లేస్‌లో దేబ్జానీని కొత్త లీడర్‌గా ఎన్నుకున్నారు.

ఇక బిగ్ బాస్ హౌస్ పనుల నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఎప్పట్లాగే రోహిత్ డ్రామాలు కూడా బాగానే స్టార్ట్ చేశాడు. దీంతో సుధీర్‌కి, రోహిత్‌కి మధ్య పెద్ద గొడవే జరిగింది. తాను మాటిమాటికీ గిన్నెలు తోమనని.. తన చేతులు పాడైపోతాయని, తన స్కిన్ మాయిశ్చరైజర్ పోతుందని రోహిత్ సిల్లీ రీజన్స్ చెప్పడంతో హౌస్‌లో రచ్చ మొదలైంది.

ఈ పని పంచాయితీ పెద్దదవడంతో బిగ్ బాస్ ఒక కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇకపై హౌస్‌లోని ఒక టీమ్ మాత్రమే అన్ని పనులను చేయాలని, ఇంకో టీమ్ మాత్రం వాటిని మానిటర్ చేయాలని, ఆ ఛాయిస్ మాత్రం వాళ్లే తేల్చుకోవాలని కండీషన్ పెట్టారు. దీంతో రెండు టీమ్స్ మధ్య మళ్లీ రచ్చ రంబోలా అయింది.

రోహిత్ పనులేమీ చేయకుండా బ్లూ టీమ్‌పై పడి గొడవలు పడ్డాడు. ఈ సమయంలో త్రిగుణ్ వర్సెస్ రోహిత్ మధ్య మాటల యుద్ధం కాస్త పెద్దగానే జరిగింది. ఆర్గ్యుమెంట్స్ అన్నీ పూర్తయ్యాక చివరకు బ్లూ టీమ్ మానిటరింగ్ బాధ్యతలను తీసుకోవడానికి, రెడ్ టీమ్ వర్క్ చేయడానికి డిసైడ్ అయ్యాయి. కొత్త లీడర్ దేబ్జానీ రెడ్ టీమ్ మెంబర్స్‌కు పనులను అప్పగించింది.

ఇక్కడే మరోసారి అసలైన పవర్ గేమ్ బయటపడింది. రెడ్ టీమ్‌లోని షాలినికి వాష్ రూమ్స్ క్లీన్ చేసే పని పడగా..తను తన దగ్గరున్న స్పెషల్ పవర్‌ను వాడుకుంటానని చెప్పి.. ఆ డ్యూటీని వర్షిణికి మార్చేసింది. దీంతో వర్షిణి బిగ్ బాస్ షోలో ఉన్నంతకాలం వాష్ రూమ్స్ క్లీన్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది.

Bigg Boss Day – 3

మరోవైపు రోహిత్ మాత్రం తన సేఫ్ గేమ్‌ను కంటిన్యూ చేస్తూ, తన టీమ్ దగ్గర త్రిగుణ్‌పై నెగిటివిటీని బాగా ప్రచారం చేశాడు. అయితే అగ్నిపరీక్ష బ్యాచ్‌ను కావాలని వాడుకుంటూ, ఏ పని చేయకుండా హౌస్‌లో తిరుగుతూ తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి రోహిత్ పన్నుతున్న వ్యూహాలు మాత్రం ఆడియన్స్‌కు క్లియర్‌గా కనిపిస్తున్నాయి.

మొత్తంగా మూడో రోజే బిగ్ బాస్ హౌస్‌(Bigg Boss Day – 3).. మైండ్ గేమ్‌లు, సేఫ్ గేమ్‌లతో హీటెక్కిపోయింది. తాను సేఫ్‌గా ఉండటానికే ఇంపార్టెన్స్ ఇస్తూ.. ఒకరిని ముంచడానికి మరొకరు వేస్తున్న ప్లాన్స్, స్కెచ్‌లతో ఈ బిగ్ బాస్ సీజన్ ముందు ముందు మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ను పంచుతుందనేది మాత్రం అర్థం అవుతోంది.

Hemoglobin : హిమోగ్లోబిన్ తగ్గితేనే కాదు పెరిగినా ప్రమాదమే.. ఈ లక్షణాలు ఉంటే అలర్ట్ అవ్వండి..

Exit mobile version