Bigg Boss First Captain : బిగ్ బాస్ 10 ఫస్ట్ కెప్టెన్‌గా ఝాన్సీ మాస్ విన్..ఛత్రపతి రీ క్రియేషన్‌తో నవ్వులు..

Bigg Boss First Captain : బిగ్ బాస్ ఝాన్సీకి స్పెషల్‌గా కెప్టెన్ రూమ్‌ను కేటాయించగా, హౌస్‌మేట్స్ అందరూ ఆమెను విష్ చేశారు.

Bigg Boss First Captain

డ్రామాలు, గొడవలు, గ్రూప్ రాజకీయాలు, లాస్ట్ మినిట్ వరకూ ఉత్కంఠతో.. బిగ్ బాస్ హౌస్‌లో అసలైన కంటెస్ట్ ఇప్పుడు హీటెక్కింది. రోజు రోజుకూ కంటెస్టెంట్స్ అసలు ఫేస్‌లు రివీల్ అవుతుండగా.. సీజన్ 10 మొదటి కెప్టెన్(Bigg Boss First Captain) పీఠాన్ని దక్కించుకోవడానికి హౌస్‌మేట్స్ మధ్య రణరంగమే నడిచింది.

ఒకవైపు పదునైన వ్యూహాలు, మరోవైపు పగలు, ప్రతీకారాలతో చిక్కకు-దొరకకు టాస్క్ రచ్చ రేపింది. అంతా అనుకున్నట్లుగా ఒక బ్యాచ్ వేసిన ప్లాన్స్ అన్నీ రివర్స్ అయ్యి, ఆఖరి బాల్‌కి సిక్స్ కొట్టినట్లుగా ఝాన్సీ అందరికీ బిగ్ షాక్ ఇచ్చి బిగ్ బాస్ హౌస్ ఫస్ట్ కెప్టెన్‌గా నిలిచింది.

ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ముందురోజు జరిగిన టాస్క్ గురించి త్రిగుణ్, వంశీ, కృష్ణుడు చర్చల్లో మునిగిపోయారు. మరోవైపు రోహిత్ తన అలవాటు ప్రకారం బట్టలు ఉతికే పని నుంచి ఎస్కేప్ అవ్వడానికి చరణ్ సాయం కోరాడు. ఆ తర్వాత వంశీ, నరేష్, రోహిత్, త్రిగుణ్, అమన్, రామ్ ప్రసాద్ కలసి ప్రభాస్ ఛత్రపతి మూవీలోని ఐకానిక్ సీన్‌ను రీ క్రియేట్ చేసి కామెడీ పండించడంతో.. హౌస్‌లో కాస్త సరదా వాతావరణం నెలకొంది. వీరి టైమింగ్‌కి మెచ్చిన బిగ్ బాస్ కూడా వారిని అభినందించాడు.

ఇక అసలైన కెప్టెన్సీ రేసు మొదలవ్వగానే హౌస్ లోని సీన్ మొత్తం రివర్స్ అయింది. రేసులో నిలిచిన త్రిగుణ్, రామ్ ప్రసాద్, ముకేశ్, ఝాన్సీ, షాలినికి ‘చిక్కకు – దొరకకు’ అనే డిఫరెంట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.

ఈ టాస్క్ రూల్స్ ప్రకారం.. కెప్టెన్సీ పోటీదారులను ఒక జైలులో ఉంచి, మిగిలిన హౌస్‌మేట్స్‌ను వారికి గార్డ్స్‌గా బయట నిలబెట్టారు. గార్డ్స్‌ని దాటుకుని గోడ అవతలి ఉన్న సేఫ్ జోన్‌కు వెళ్లాలి. గార్డ్స్ ఎవరినైనా అడ్డుకోవచ్చు, లాస్ట్ వరకు సేఫ్ జోన్‌కి వెళ్లని వారు ఎలిమినేట్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు.

ఈ గేమ్‌కి వంశీ, రోహిత్‌ సంచాలకులుగా వ్యవహరించారు. అయితే ఎప్పట్లాగే అగ్నిపరీక్ష బ్యాచ్ షాలినిని ఎలాగైనా కాపాడాలని సీక్రెట్ ప్లాన్స్ వేసింది. కానీ మిగిలిన హౌస్‌మేట్స్ దానిని వ్యతిరేకించడంతో మొదటి రౌండ్‌లోనే షాలిని అవుట్ అయిపోయింది. దీంతో అగ్నిపరీక్ష బ్యాచ్ మిగతా వారితో గొడవకు దిగగా, అందరూ తననే టార్గెట్ చేశారని చరణ్ దగ్గర షాలిని ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు ఈ విషయంలో రోహిత, సుధీర్‌ మధ్య కూడా పెద్ద రచ్చే జరిగింది.

తర్వాత రౌండ్‌లో సంచాలకులు రోహిత్, వంశీకి ఇద్దరు గార్డ్స్‌ని తప్పించే ఛాన్స్ రాగా, వారు కృష్ణుడు, సుధీర్‌ను పక్కకు పెట్టారు. అలాగే అవుట్ అయిన షాలిని కొత్త గార్డ్‌గా లోపలికి వచ్చింది. ఈ రౌండ్‌లో ముకేశ్ ఎలిమినేట్ అవ్వడంతో ముకేశ్ , షాలిని మధ్య పెద్ద మాటల యుద్ధం జరిగింది.

నెక్స్ట్ రౌండ్‌లో నరేష్, దేబ్జానీని తప్పించి, ముకేశ్ కొత్త గార్డ్‌గా వచ్చాడు. అంతేకాకుండా సంచాలక్ వంశీ కూడా గార్డ్‌గా మారాడు. ఇక ఆఖరి రౌండ్‌లో హౌస్‌మేట్స్ అంతా ఏకమై త్రిగున్‌ పక్కాగా టార్గెట్ చేసి గేమ్ నుంచి అవుట్ చేశారు. చివరికి ఫైనల్ రేసులో రామ్ ప్రసాద్ అండ్ ఝాన్సీ మాత్రమే మిగిలారు.

Bigg Boss First Captain

ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ ఒక కష్టమైన ఫిజికల్ గేమ్‌ను డిజైన్ చేశాడు. బాక్స్‌లో ఉన్న కట్టర్‌ని తీసుకుని, ఒక కాలితో గీసిన డబ్బాల్లో గెంతుతూ వెళ్లి కంచెని కట్ చేయాలి. ఆపై లోపలికి వెళ్లి తాళాలతో బాక్స్ ఓపెన్ చేసి, అందులోని వెయిట్స్‌ను తీసుకువచ్చి కెప్టెన్సీ జెండాని పైకి లేపాలి.

చాలా టెన్షన్‌గా సాగిన ఈ పోటీలో రామ్ ప్రసాద్ చిన్న తడబాటు గురికావడంతో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఝాన్సీ విజయం సాధించింది. అలా బిగ్ బాస్ సీజన్ 10 ఫస్ట్ కెప్టెన్ పీఠాన్ని ఝాన్సీ సొంతం చేసుకుంది.

బిగ్ బాస్ ఝాన్సీకి స్పెషల్‌గా కెప్టెన్(Bigg Boss First Captain) రూమ్‌ను కేటాయించగా, హౌస్‌మేట్స్ అందరూ ఆమెను విష్ చేశారు. ఇక అసలైన వీకెండ్ ఎపిసోడ్ రాబోతుండటంతో, కింగ్ నాగార్జున ఎవరికి క్లాస్ పీకుతారు? ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లే ఆ ఒక్కరు ఎవరు? అనే క్యూరియాసిటీ బిగ్ బాస్ ఫ్యాన్స్‌లో పెరిగిపోయింది.

Petrol Bunks Cash Rule : పెట్రోల్ బంకుల్లో పాతకాలం నాటి క్యాష్ రూల్.. డిజిటల్ ఇండియాకు రివర్స్ గేర్ పడుతుందా?

Exit mobile version