Bigg Boss Nominations : లెటర్ కాల్చేసి దేబ్జానీని ఏడిపించిన ముకేశ్.. నామినేషన్లలో ఉన్న హౌస్ మేట్స్ ఎవరు?

Bigg Boss Nominations : నామినేషన్లు కంప్లీట్ అయ్యాక వర్షిణి దగ్గర సుధీర్ ఎమోషనల్ అయి ఏడ్చాడు. సృష్టి కేవలం స్క్రీన్ స్పేస్ కోసం, మైలేజ్ కోసమే తనపై అనవసరంగా అరిచిందని బాధపడ్డాడు.

Bigg Boss Nominations

బిగ్ బాస్ హౌస్ అంటేనే గొడవలు, డ్రామాలు, ఎమోషన్స్‌కి కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. ముందు రోజు నామినేషన్ల వేడి చల్లారకముందే సెప్టెంబర్ 22 వ తేదీన హౌస్‌లో గొడవలు, కన్నీళ్లు మరింత పీక్స్‌కి చేరాయి. ఒకవైపు ఇంటి సభ్యుల మధ్య మాటల వార్ జరుగుతుంటే.. మరోవైపు నాగార్జున కనపడట్లేదు అంటూ వచ్చిన కామెంట్లు, గ్రూపిజం చర్చలు బిగ్ బాస్ హౌస్‌ను షేక్ చేశాయి. పగలు నామినేషన్ల(Bigg Boss Nominations) రచ్చ నడవగా .. రాత్రికి ఎమోషనల్ టాస్క్‌లో హౌస్ మేట్స్ మైండ్ గేమ్‌ని బయట పడింది.

ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ముందు రోజు సుధీర్, సృష్టి గొడవ రచ్చగా మారింది. వర్షిణి, సుధీర్ కలసి ఇదే ఇష్యూపై మాట్లాడుకోగా.. వర్షిణి కోపంతో సుధీర్‌పైన ఫైర్ అయింది. ఇంకోవైపు తన మార్క్ మైండ్ గేమ్ స్టార్ట్ చేసిన రామ్ ప్రసాద్.. సుధీర్‌ని సృష్టి పిచ్చి తిట్లు తిట్టినందుకు నరేష్‌తో సృష్టిని నామినేట్ చేయించడానికి ట్రై చేశాడు. ఒకవేళ డబల్ నామినేషన్ అవకాశం వస్తే నరేష్‌కే ఇవ్వమని అందరికీ చెప్పాడు.

దీనిపై సుధీర్ ప్రశ్నించగా.. హోస్ట్ నాగార్జున గారే సరిగ్గా కనపడట్లేదని సృష్టి కామెంట్ చేసింది కాబట్టే తను నచ్చలేదని, అందుకే అలా చేశానని రామ్ ప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు. ఇటు సృష్టి తన అగ్నిపరీక్ష టీమ్‌తో చర్చలు పెట్టింది. ఝాన్సీ .. సుధీర్ తరఫున మాట్లాడుతోందని సృష్టి అనగానే.. రోహిత్ వెంటనే ఝాన్సీపై చిరాకు పడుతూ వాళ్ల అన్నలకు భజనలు చేసుకుంటోందని అన్నాడు. ఆ తర్వాత సృష్టి వంశీ, త్రిగుణ్‌తో కలిసి డిస్కషన్ కంటిన్యూ చేయగా.. రోహిత్ మాత్రం త్రిగుణ్‌ను శకునితో పోలుస్తూ అందరి దగ్గరా ఆ మాటను స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టాడు.

ఇక ముందు రోజు మధ్యలో ఆగిపోయిన ఎన్వలప్ నామినేషన్ల రౌండ్ మళ్లీ స్టార్టయింది. ఫస్ట్ అవకాశాన్ని సాధించిన ముకేశ్.. చరణ్‌ను నామినేట్ చేసి..రీ ఎంట్రీ ఇచ్చినా కూడా అలాగే సైలెంట్‌గా ఉంటున్నాడని, సీరియస్‌గా ఆడట్లేదని రీజన్ చెప్పాడు. దానికి చరణ్ ముకేశ్ అసలు స్టార్ ప్లేయర్ ట్యాగ్‌కి డిజర్వ్ కాడని ఎదురుదాడి చేశాడు. కెప్టెన్సీ రైటింగ్ టాస్క్‌లో ముకేశ్ తప్పు చేశాడని అనడంతో.. చరణ్ హౌస్‌లో లేనప్పుడు జరిగిన దాని గురించి ఎలా మాట్లాడుతున్నాడని ముకేశ్ ఫైర్ అయ్యాడు. మధ్యలో వంశీ ఎంటర్ అయి ముకేశ్‌తో గొడవకి దిగాడు. ఇదే గ్యాప్‌లో షాలిని, వర్షిణీ మధ్య కూడా పెద్ద వార్ నడిచింది.

నెక్స్ట్ ఛాన్స్‌లో షాలిని.. వర్షిణిని నామినేట్ చేసింది. వెనుక ఉండి ఇద్దరినీ నడిపిస్తుందని, కావాలనే గొడవలు పెడుతుందని షాలిని అనడంతో మళ్లీ వర్షిణి ,షాలిని మధ్య యుద్ధం నడిచింది. ఇక రెండో నామినేషన్ ఛాన్స్ తీసుకున్న సృష్టి.. సుధీర్‌ను నామినేట్ చేసింది. ముందురోజు గొడవను మళ్లీ తెరపైకి తెచ్చి సుధీర్‌పై గట్టిగా అరిచినా కూడా సుధీర్ మాత్రం చాలా కూల్‌గా హ్యాండిల్ చేశాడు. మొత్తానికి ఈ వీక్ నామినేషన్లలో వంశీ, సుధీర్, షాలిని, అమన్, ఝాన్సీ, త్రిగుణ్, చరణ్, వర్షిణి డేంజర్ జోన్‌లో నిలిచారు.

నామినేషన్లు(Bigg Boss Nominations) కంప్లీట్ అయ్యాక వర్షిణి దగ్గర సుధీర్ ఎమోషనల్ అయి ఏడ్చాడు. సృష్టి కేవలం స్క్రీన్ స్పేస్ కోసం, మైలేజ్ కోసమే తనపై అనవసరంగా అరిచిందని బాధపడ్డాడు. ఆ తర్వాత వర్షిణి, సుధీర్ కలిసి త్రిగుణ్‌పై కోపాన్ని వెళ్లగక్కారు.

ఇదంతా అయ్యాక బిగ్ బాస్ ..టెంప్టేషన్ -టెన్షన్ అనే కొత్త కాన్సెప్ట్ టాస్క్ అనౌన్స్ చేశాడు.సైరన్ మోగగానే లివింగ్, గార్డెన్ ఏరియాల్లో ఉన్న బజర్లను ఎవరు ముందు ప్రెస్ చేస్తే వాళ్ల మధ్య పోటీ ఉంటుంది. గెలిచిన వాళ్లకు నెక్స్ట్ వీక్ కెప్టెన్సీ కంటెండర్ షిప్‌తో పాటు ఒక టెంప్టేషన్ ఛాన్స్ వస్తుంది. కాకపోతే వేరొకరికి టెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ బజర్ రేస్‌లో ముకేశ్, రోహిత్ గెలిచి టాస్క్‌కి సెలెక్టయ్యారు. బిగ్ బాస్ వీళ్లకు దేవర మూవీలో ఎన్టీఆర్ లాగా బాక్స్‌లను తోసే ఫిజికల్ టాస్క్ ఇచ్చాడు. ఒకే బాక్స్‌ను ఇద్దరూ రెండు వైపులా తోయాలి, ఎవరు ఇంకొకరిని బయటకు నెట్టేస్తే వాళ్లు గెలిచినట్లు. అమన్ సంచాలక్‌గా వ్యవహరించిన ఈ టాస్క్‌లో ముకేశ్ పవర్ చూపి గెలవడంతో.. ముకేశ్ నెక్స్ట్ వీక్ కెప్టెన్సీ డైరెక్ట్ కంటెండర్ అయ్యాడు.

గెలిచిన ముకేశ్‌కి కన్ఫెషన్ రూమ్‌లో ఫోన్ చేసి మాట్లాడిన బిగ్ బాస్.. తండ్రితో ఉన్న అటాచ్‌మెంట్ గురించి అడగ్గా ముకేశ్ ఎమోషనల్ అయ్యాడు. అయితే ముకేశ్ నాన్నతో ఉన్న ఫోటోను అతనికి టెంప్టేషన్‌గా ఇస్తానని .. కానీ అది కావాలంటే వేరొకరికి టెన్షన్ ఇవ్వాలని అంటాడు. దేబ్జానీకి వాళ్ల పేరెంట్స్ రాసిన లెటర్ కాల్చడం లేదా వర్షిణికి వాళ్ల అమ్మ, అక్క ఫోటో ఇవ్వకుండా చేయడం అలాగే ఆ గిఫ్ట్‌ను ధ్వంసం చేయాలని వాళ్లకు కెప్టెన్సీ ఛాన్స్ పోతుందని చెప్పారు.

Bigg Boss Nominations

దీంతో కొంచెం ఆలోచించి దేబ్జానీకి టెన్షన్ ఇస్తానని సెలెక్ట్ చేసుకున్న ముకేశ్.. బయటకొచ్చి దేబ్జానీకి మాత్రమే విషయం చెప్పినా.. బిగ్ బాస్ మాత్రం హౌస్‌లో అందరికీ వర్షిణి ఆప్షన్ కూడా ఉందనే నిజాన్ని కూడా చెప్పేశాడు. చివరికి బిగ్ బాస్ ఆదేశాలతో దేబ్జానీ పేరెంట్స్ రాసిన లెటర్‌ను ముకేశ్ తన చేతులతోనే కాల్చేశాడు. దీంతో దేబ్జానీ తట్టుకోలేక వాష్‌రూమ్‌కి వెళ్లి బాగా ఏడ్చింది.

నామినేషన్ల గొడవలతో పాటు ఎమోషనల్ డ్రామాలతో ఎపిసోడ్ ముగిసింది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో హౌస్‌లో కెప్టెన్సీ రేస్ మొదలుకాబోతోంది. ఈ లెటర్ ఇన్సిడెంట్ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లో సమీకరణాలు ఎలా మారతాయోనన్నది చూడాలి మరి.

Nani : ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ప్యారడైజ్ ప్రీమియర్ చూస్తానన్న నాని..పుష్ప 2 తొక్కిసలాట పాఠం వెంటాడుతుందా?

Exit mobile version