Bigg Boss Nominations : గొడ్డలి గేమ్‌తో హీటెక్కిన నామినేషన్స్..11 మంది డేంజర్ జోన్‌లోకి..

Bigg Boss Nominations : మొదటి వారం అంతా అగ్నిపరీక్ష టీమ్ వర్సెస్ సెలబ్రిటీ అన్నట్లుగా హౌస్ సభ్యులు నడవగా.. దశావతారాల కాన్సెప్ట్‌లో భాగంగా సెకండ్ వీక్ పవర్ ఆఫ్ పీపుల్ అనే కొత్త సెగ్మెంట్‌తో మరింత హీట్‌ను పెంచేశారు.

Bigg Boss Nominations

ఫస్ట్ వీక్‌లోనే బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్‌తో ఊహించని షాకివ్వగా .. వీకెండ్‌లో నాగార్జున క్లాస్‌తో హౌస్‌మేట్స్‌లో మరింత భయాన్ని పెంచారు. మొదటి వారం అంతా అగ్నిపరీక్ష టీమ్ వర్సెస్ సెలబ్రిటీ అన్నట్లుగా హౌస్ సభ్యులు నడవగా..,దశావతారాల కాన్సెప్ట్‌లో భాగంగా సెకండ్ వీక్ పవర్ ఆఫ్ పీపుల్ అనే కొత్త సెగ్మెంట్‌తో మరింత హీట్‌ను పెంచేశారు.

8 వరోజు ఎపిసోడ్ స్టార్టింగ్ చాలా కూల్‌గా మొదలైంది. సుధీర్, సృష్టి కాసేపు మాట్లాడుకోగా, ముందు రోజు దేబ్జానీ అడగడంతో బిగ్ బాస్ ఆమెకు కాఫీ పంపించగా.. ఆమె దాన్ని ముకేశ్‌తో షేర్ చేసుకుంది. ఈలోగా వాషింగ్ విషయంలో రోహిత్, త్రిగుణ్‌ల మధ్య డిస్కషన్ స్టార్ట్ అయింది. నిన్న నాగార్జున ఇచ్చిన పనిష్మెంట్‌తో రోహిత్ ఇష్టం లేకుండానే కప్పులు కడుగుతుంటే, షాలిని పక్కనే ఉండి తానే దగ్గరుండి చేయించానంటూ ఓవర్ యాక్షన్ చేయడంతో గొడవకు పునాది పడింది.

ఇక ఆ ముందురోజు సుధీర్ గెలుచుకున్న పవర్ బాక్స్‌ను ఓపెన్ చేయగా, దానిలో ఎప్పుడైనా, ఎవరినైనా నామినేట్ చేసే అద్భుతమైన పవర్ ఉన్నట్లు బయటపడింది. దాని తర్వాత బిగ్ బాస్ నామినేషన్స్ ప్రాసెస్ కోసం అందరినీ గార్డెన్ ఏరియాకి రమ్మని ఆర్డర్ వేశాడు. అయితే బిగ్ బాస్ పిలిచినా కూడా షాలిని మాత్రం ఇంకా రెడీ అవుతూనే ఉండటంతో బిగ్ బాస్ సీరియస్ అయ్యాడు. దీంతో నెక్స్ట్ టైమ్ లేట్ చేస్తే డైరెక్ట్‌గా నామినేట్ చేసేస్తానని బిగ్ బాస్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు.

అలాగే నామినేషన్స్ కోసం ..ఇద్దరిద్దరినీ పిలిచి, స్తంభానికి కట్టిన తాళ్లు తీసి ఎదురుగా ఉన్న బంగారం, వెండి గొడ్డలిని అందుకోవాలని చెప్పాడు. వెండి గొడ్డలి తెచ్చినవాళ్లు ఒకరిని, బంగారం గొడ్డలి తెచ్చినవాళ్లు ఇద్దరిని నామినేట్ చేయవచ్చు. అలాగే ఈ రేస్‌లో ఓడిపోయినవాళ్లు ఆటోమేటిక్‌గా నామినేట్ అయిపోతారని ట్విస్ట్ ఇచ్చాడు.

ఫస్ట్ రౌండ్‌లో ఝాన్సీ, సుధీర్‌ పోటీపడగా సుధీర్ గెలిచి గోల్డ్ గొడ్డలిని తీసుకున్నాడు. సుధీర్ మొదట త్రిగుణుని నామినేట్ చేస్తూ.. అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చెబుతూ మైండ్ గేమ్ ఆడుతున్నాడని రీజన్ చెప్పాడు.

ఆ తర్వాత పవర్‌ని మిస్ యూజ్ చేసుకుందన్న రీజన్‌తో షాలినిని నామినేట్ చేశాడు. దీంతో నా పవర్ నా ఇష్టమని షాలిని చెప్పగా ఆమెకు సపోర్ట్‌గా రోహిత్ .. సుధీర్‌తో గొడవకు దిగారు. రెండో రౌండ్‌లో దేబ్జానీ, కృష్ణుడులో దేబ్జానీ గెలిచి వెండి గొడ్డలితో త్రిగుణ్‌ని నామినేట్ చేసింది.

మూడో రౌండ్‌లో వర్షిణి, రోహిత్‌లో రోహిత్ గెలిచి బంగారం గొడ్డలితో త్రిగుణ్‌ని, ఆ తర్వాత ఝాన్సీని నామినేట్ చేశాడు. తన గ్రూప్‌లో ఉండట్లేదనే కక్షతోనే తనను నామినేట్ చేస్తున్నావంటూ ఝాన్సీ రోహిత్‌పై ఫైర్ అయింది. ఈ గొడవలో ఝాన్సీకి సపోర్ట్‌గా త్రిగుణ్ ఎంటర్ అయ్యాడు.

నాలుగో రౌండ్‌లో నరేష్, షాలినిలో నరేష్ గెలిచి వెండి గొడ్డలితో షాలినిని నామినేట్ చేశాడు. షాలిని డిఫెండ్ చేసుకుంటూ ఆపకుండా మాట్లాడుతుండటంతో నరేష్ వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

ఐదో రౌండ్‌లో త్రిగుణ్, సృష్టి పోటీపడగా త్రిగుణ్ గెలిచి బంగారం గొడ్డలి తీసుకున్నాడు. త్రిగుణ్ మొదట సుధీర్‌ని కట్టప్ప అని పిలుస్తూ నామినేట్ చేశాడు. సృష్టి దగ్గర మార్కులు పొందడం కోసం అగ్నిపరీక్ష టీమ్‌కి సపోర్ట్ చేస్తూ సుధీర్ కట్టప్పలా మారాడని త్రిగుణ్ అనడంతో ఇద్దరి మధ్య పెద్ద వార్ నడిచింది. ఆ తర్వాత కిచెన్ పనులు సరిగ్గా చేయట్లేదనే రీజన్‌తో రోహిత్‌ని నామినేట్ చేశాడు. ఈ గొడవలో షాలిని, వర్షిణి, సుధీర్ కూడా దూరడంతో రచ్చ రచ్చ అయింది.

Bigg Boss Nominations

ఆరో రౌండ్‌లో అమన్, ముకేశ్‌లో అమన్ గెలిచి బంగారం గొడ్డలితో రామ్ ప్రసాద్, ఝాన్సీని నామినేట్ చేశాడు. ఝాన్సీ మాత్రం తానెవరి గ్రూప్‌లో ఉండనని, తన ఆట నేనే ఆడతానని తెగేసి చెప్పింది. ఆఖరి రౌండ్‌లో వంశీ గెలిచి సిల్లీ రీజన్స్‌తో దేబ్జానీ, ముకేశ్‌ను నామినేట్ చేశాడు.

మొత్తానికి నామినేషన్ల ప్రాసెస్ కంప్లీట్ అయ్యేసరికి ఈ వీక్ ఏకంగా 11 మంది డేంజర్ జోన్‌లో నిలిచారు. షాలిని, త్రిగుణ్, ఝాన్సీ, ముకేశ్, దేబ్జానీ, రామ్ ప్రసాద్, వర్షిణి, కృష్ణుడు, సుధీర్, సృష్టి, రోహిత్‌ ఈ వీక్ ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉన్నారు. వీరిలో మెయిన్‌గా త్రిగుణ్‌కే ఎక్కువ నామినేషన్లు పడి అందిరిలోనూ టార్గెట్ అయ్యాడు. హౌస్‌లో ఈ 11 మందిలో బిగ్ బాస్ డోర్ తెరుచుకుని బయటకు వెళ్లే ఆ ఒక్క కంటెస్టెంట్ ఎవరో ఈ వీకెండ్‌లో చూడాలి.

Hair Loss : దువ్వుతుంటే గుప్పెడు జుట్టు చేతికి వస్తోందా? అయితే డాక్టర్‌ను ఎప్పుడు కలవాలో తెలుసుకోండి..

Exit mobile version