Bigg Boss Voting : బిగ్ బాస్ 10 నామినేషన్లలో ఓటింగ్ వార్..త్రిగుణ్‌ను బీట్ చేసిన ముకేష్..

Bigg Boss Voting : బిగ్ బాస్ 11వ వారం నామినేషన్ల ఓటింగ్‌లో ముకేష్, త్రిగుణ్‌ మధ్య మైండ్ బ్లాకింగ్ ఫైట్‌ సాగుతోంది. 11 మంది బరిలో ఉన్న ఈ వారం లో కంప్లీట్ అన్ ఆఫీషియల్ ఓటింగ్ పర్సంటేజ్‌లు మరియు ఎలిమినేషన్ అనాలిసిస్ వివరాలు ఇక్కడ చూడండి.

Bigg Boss Voting

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో టెన్త్ వీక్ దాటిందంటే చాలు ఆడియెన్స్‌కి విన్నర్ ఎవరో ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంటుంది. ఇక 11వ వారానికి వచ్చేసరికి గ్రాండ్ ఫినాలేకి కౌంట్‌డౌన్ మొదలవువుతుంది కాబట్టి, ఎవరు టైటిల్ కొడతారనేది ఆల్మోస్ట్ లాక్ అయిపోతుంది. దీనిలో భాగంగానే ఇటీవల ముగిసిన ఫ్యామిలీ వీక్‌లో స్టేజ్ పైకి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన రేటింగ్స్, వారి హింట్స్ బేస్ చేసుకున్ని త్రిగుణ్ విన్నర్ కావడం గ్యారంటీ అని, అతనే నెంబర్ 1 ప్లేస్‌లో నిలుస్తాడని అభిమానులంతా ఫిక్స్ అయిపోయారు.

త్రిగుణ్ కూడా తనకు తిరుగులేదని హౌస్‌లో ఓవర్ కాన్ఫిడెన్స్‌తో తిరిగాడు. కానీ బిగ్ బాస్ అంటేనే అంచనాలను తలకిందులు చేసే గేమ్‌ అన్నది తెలిసిందే. ఫ్యామిలీ వీక్ తర్వాత మొదలైన 11వ వారంలో నామినేషన్లు, బయట నడుస్తున్న అన్‌అఫీషియల్ ఓటింగ్(Bigg Boss Voting) గ్రాఫ్‌లు చూస్తుంటే ఇప్పుడు విన్నర్ రేసు కంప్లీట్‌గా యూ-టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ 11వ వీక్ నామినేషన్లలో కెప్టెన్ నరేష్ తప్ప హౌస్‌లోని 11 మంది కంటెస్టెంట్లు అంటే త్రిగుణ్, ముకేష్‌, వర్షిణి, అమన్, దేబ్జానీ, రాం ప్రసాద్, వంశీ, సుధీర్, నీతూ మాస్టర్, శివ్, రామకృష్ణ నామినేషన్స్‌ బరిలో నిలిచారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మొత్తం 11 మంది నామినేషన్లలో ఉన్నా కూడా , బయట జరుగుతున్న మొత్తం ఓటింగ్‌లో ఏకంగా 60 శాతానికి పైగా ఓట్లను కేవలం ఇద్దరే షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. విన్నర్ రేసులో దూసుకుపోతున్న త్రిగుణ్‌కు సీరియల్ ఫ్యాన్స్ సపోర్ట్‌తో నటుడు ముకేష్ గౌడ మబ్బులిడిపోయేలా గట్టి పోటీ ఇస్తూ ఓటింగ్‌లో టాప్‌లో కూర్చొన్నాడు.

తాజా అనధికారిక ఓటింగ్(Bigg Boss Voting) పోల్స్‌ని పరిశీలిస్తే.. ఆ 60 శాతం ఓటింగ్‌ను ఈ ఇద్దరూ సుమారు చెరో ముప్పై శాతం చొప్పున పంచుకుంటూ నువ్వా-నేనా అన్నట్లు ఉన్నారు. కొన్ని పోల్స్‌లో ముకేష్ 33% కాగా మరికొన్నింటిలో 30.86% ఓటింగ్‌తో ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా, త్రిగుణ్ 32% కొన్నింటిలో 30.56% ఓట్లతో సపోర్ట్ అందుకని ఊపిరిసలపని పోటీని ఇస్తున్నాడు. ఫ్యామిలీ రేటింగ్స్, తెలుగు ఆడియన్స్ త్రిగుణ్‌కు అనుకూలంగా ఉన్నా, ఓవరాల్ జనాల ఓటింగ్‌లో మాత్రం ముకేష్ ఏమాత్రం తగ్గకుండా టాప్ ప్లేస్‌ను రీచ్ అవుతుండటంతో హౌస్‌లో అసలైన విన్నర్ పోరు ఈ ఇద్దరి మధ్యే రౌండ్లు కొడుతుంది.

అయితే ముకేష్, త్రిగుణ్‌ కలిసి 60 శాతం ఓట్లను కొల్లగొట్టగా, నామినేషన్‌లో ఉన్న మిగిలిన 9 మంది కంటిస్టెంట్స్‌లో ఏ ఒక్కరు కూడా సింగిల్ డిజిట్ దాటి డబుల్ డిజిట్ (10%) ఓటింగ్‌ను సాధించలేకపోవడం షాకింగ్‌గా ఉంది. మీడియంగా ఉన్న అమన్ (8%), దేబ్జానీ (8%), వంశీ (6%), రాం ప్రసాద్ (5%), వర్షిణి (4%), సుధీర్ (4%) కొద్దిపాటి మార్జిన్‌తో సేఫ్ జోన్ వైపు అడుగులు వేస్తున్నారు.

ఇక అడుగున ఉన్న ముగ్గురు కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లో ఉండంతో ఎలిమినేషన్ ముప్పు పొంచి ఉంది. శివ్ కేవలం 3 శాతం, రామకృష్ణ 2 శాతం ఓట్లతో ఊగిసలాడుతున్నారు. వీళ్లందరికంటే ఘోరంగా కేవలం ఒకే ఒక శాతం ఓటింగ్‌ సాధించిన నటరాజ్ మాస్టర్ భార్య నీతూ మాస్టర్ చివరి స్థానంలో పడిపోయి ఈ వీక్ ఎలిమినేషన్ తనే అని ఫిక్స్ అయ్యే పరిస్థితిలో ఉంది. ఒకవేళ చివరి క్షణాల్లో బిగ్ బాస్ ఏమైనా అన్-ఎక్స్‌పెక్టెడ్ డబుల్ ఎలిమినేషన్ లేదంటే ట్విస్ట్ ప్లాన్ చేస్తే తప్ప నీతూ, రామకృష్ణ, శివ్‌లో ఒకరు గ్యారంటీగా లగేజ్‌ సద్దుకోవడం పక్కాగా కనిపిస్తోంది.

Text Message Fights : గొడవలొస్తే వాట్సాప్‌లో పారాగ్రాఫ్‌లు రాస్తున్నారా? ఆ తప్పుతోనే బంధాలు తెగిపోతాయి జాగ్రత్త..

↑
Exit mobile version