Double Elimination : బిగ్ బాస్ హౌస్‌లో డబుల్ ఎలిమినేషన్.. ఆడియన్స్ ఓట్లతో ఝాన్సీ, ఇంటి సభ్యుల దెబ్బకు రోహిత్ ఔట్..

Double Elimination : బిగ్ బాస్ తెలుగు లేటెస్ట్ సండే ఎపిసోడ్‌లో డబుల్ ఎలిమినేషన్ వల్ల ఝాన్సీ, రోహిత్‌ బయటకు వెళ్లారు. రోహిత్ ఎలిమినేషన్ వెనుక అసలేం జరిగింది?

Double Elimination

బిగ్ బాస్ హౌస్‌లో ఎనిమిదో వారం గేమ్ ఎవరూ ఏమాత్రం ఊహించని మలుపులు తిరిగింది. ఒకే ఎపిసోడ్‌లో ఈ వీక్ కూడా డబుల్ ఎలిమినేషన్(Double Elimination) జరగడంతో హౌస్‌మేట్స్‌ కంటే ఆడియన్స్ ఇంకా ఎక్కువ షాక్‌కి గురయ్యారు. ఆదివారం రోజు ఎపిసోడ్‌లో నాగార్జున సరదా ఆటలతో పాటు సీరియస్ ట్విస్టులతో ఎపిసోడ్‌ను ఫుల్ ఎంటర్టైన్ చేశారు. అయితే ఆడియన్స్ ఓట్ల ద్వారా ఝాన్సీ ఎలిమినేట్ కాగా, హౌస్‌మేట్స్ అందరి మెజార్టీ ఓట్లతో రోహిత్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది.

ముందుగా స్టేజ్ మీదకు వచ్చిన ఝాన్సీ తన బిగ్ బాస్ జర్నీని చూసుకుని కాస్త ఎమోషనల్ అయింది. ఆ తర్వాత ఎప్పటిలాగే నాగార్జున ఇచ్చిన టాస్క్‌లో హౌస్‌మేట్స్‌కు కొన్ని సామెతలను అప్లై చేస్తూ వారి గురించి చెప్పుకొచ్చింది. రోహిత్‌కి.. కుక్క తోక వంకర, దేబ్జానీకి ..ఎవరి తీసిన గోతిలో వాళ్లే పడతారు, త్రిగుణ్‌కి ..గోరంత దాన్ని కొండంత చేస్తాడు, ముకేష్‌కి ..మెరిసేదంతా బంగారం కాదు, నరేష్‌కి ..ఇంట్లో పులి వీధిలో పిల్లి అంటూ కరెక్ట్ పంచ్‌లు వేసింది.

ఇక ఆ తర్వాత హౌస్‌లో పెట్టిన చేదు నిజాలు లడ్డూ టాస్క్ నవ్వులు పూయించింది. ఇంటి సభ్యులంతా ఒకరి గురించి ఒకరు రాసుకున్న ఒపీనియన్స్ గెస్ చేయడంలో త్రిగుణ్ బాగా తడబడ్డాడు. తన గురించి రాసింది సుధీర్ అనుకుని బోల్తా పడి లడ్డూ తింటాడు. ఆ తర్వాత వర్షిణి తనపై అలిగే సీన్.. హౌస్‌లో నవ్వులు పూయించింది.

కేవలం ముకేష్, దేబ్జానీ మాత్రమే ఒకరి గురించి మరొకరు రాసిన నిజాలను పర్ఫెక్ట్‌గా గెస్ చేయగలిగారు. శ్వేత గురించి మాత్రం ఆ టాస్క్‌లో ఎవరూ ఎలాంటి ఒపీనియన్ చెప్పకపోవడంతో, నీ గేమ్ ఎలా ఉందో ఇకనైనా అర్థం చేసుకో అంటూ నాగ్ పరోక్షంగా పెద్ద హింటే ఇచ్చారు. సైగలతో సాంగ్‌ను పసిగట్టే టాస్క్‌లో సుధీర్ హుక్ స్టెప్ వేయడంతో.. ముకేష్ టీమ్‌కు మైనస్ పాయింట్లు పడి, నరేష్ టీమ్ విజయం సాధించింది.

ఆ తర్వాత అసలు అసలైన డ్రామా అంతా మొదలైంది. రెడ్ జోన్‌లో ఉన్న శ్వేత, ఆర్కే, రోహిత్‌లో ఒకరు సడెన్ ఎలిమినేషన్(Double Elimination) ఎదుర్కోవాలని నాగార్జున చెప్పడంతో హౌస్‌లో టెన్షన్ పీక్స్‌కు చేరింది. అయితే ఈ ఎలిమినేషన్‌(Double Elimination)లో కంటెస్టెంట్ల ఓట్లే ఇంపార్టెంట్ అని తేలాయి. కన్ఫెక్షన్ రూమ్‌లో త్రిగుణ్ చూసిన ఒక సీక్రెట్ వీడియో ఈ గేమ్‌ను పూర్తిగా మార్చేసింది. రోహిత్ తన గురించి, కెప్టెన్ రూమ్ గురించి మిగిలిన కొంతమందితో కలిసి బూతులు మాట్లాడుతూ దారుణంగా మాట్లాడంతో ఆ విషయాన్ని త్రిగుణ్.. నరేష్, రాంప్రసాద్, అమన్‌ వద్ద చెప్పాడు. దీంతో ఆ ముగ్గురి మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది.

చివరకు జరిగిన ఓటింగ్‌లో శ్వేతకు అసలు ఓట్లే రాలేదు. ముకేష్, వర్షిణి, సుధీర్, నీతూ వాళ్లు రోహిత్ ఉండాలని .. ఆర్కేను బయటికి పంపాలని ఓటేశారు. కానీ నరేష్, దేబ్జానీ, రాంప్రసాద్, శివ్, అమన్, వంశీ, త్రిగుణ్ అంతా ఏకమై రోహిత్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. దీంతో ఎక్కువ ఓట్లు వచ్చిన రోహిత్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. వెళ్లే ముందు ఏడుస్తున్న నీతూని ఓదారుస్తూ.. దుష్టులకు దూరంగా ఉండాలని, అన్నం మీద కోపాన్ని చూపించొద్దని రోహిత్ చెబుతాడు.

Double Elimination

స్టేజ్ మీదకు వచ్చిన రోహిత్‌కు తనకు బయటకు పంపడానికి వ్యతిరేకంగా ఓటేసిన ఆ ఏడుగురితో మాట్లాడే ఛాన్స్ వచ్చింది. నరేష్ ఎవరో ఒకరి ఎఫెక్ట్‌తోనే తనను వెనకేసుకొచ్చి చివరికి ఇలా మోసం చేశాడని రోహిత్ చెబుతాడు. దీనికి తాను ఆర్కేకు అవకాశం ఇవ్వాలనుకున్నానని, రోహిత్‌కు మాత్రం అలా ఎందుకు అనిపించిందో తెలీదని నరేష్ అంటాడు. ఎవరి మనసు నొప్పించకుండా అందరూ బాగా ఆడాలని చెప్పి రోహిత్ స్టేజ్ దిగి వెళ్లిపోయాడు. ఇక రానున్న వీక్‌లో.. రివార్డ్ అండ్ రివేంజ్ (Reward and Revenge) థీమ్‌తో గేమ్ మరింత రంజుగా సాగుతుందని చెప్పి నాగార్జున ఈ వీకెండ్ ఎపిసోడ్‌ను క్లోజ్ చేశారు.

Over-Interference : బంధాల్లో ఊపిరాడనివ్వని అతి జోక్యం.. ఓవర్ ఇంటర్‌ఫియరెన్స్‌తో ముంచుకొచ్చే ముప్పు ఇదే..

↑
Exit mobile version