Family Time : బిగ్ బాస్ హౌస్‌లో ఎమోషనల్ అటాక్స్..త్రిగున్, నటరాజ్ ఫ్యామిలీ ఎంట్రీతో మారిన ఈక్వేషన్స్..

Family Time : బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగుతున్న ఫ్యామిలీ వీక్ హైలైట్స్ ఏంటి? త్రిగుణ్, నటరాజ్ మాస్టర్ భార్యాపిల్లల ఎంట్రీ, ఎమోషనల్ మూమెంట్స్ ,కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఏంటి?

Family Time

బిగ్ బాస్ హౌస్‌లో ఫ్యామిలీ వీక్ సందడి పీక్స్‌కు చేరింది. ఇంట్లోకి కుటుంబ సభ్యుల రాకతో ఒకవైపు ఎమోషనల్ మూమెంట్స్ నడుస్తుంటే, మరోవైపు గేమ్‌లో పోటీ రసవత్తరంగా సాగుతోంది. ఫ్యామిలీ వీక్‌లో(Family Time) భాగంగా బిగ్ బాస్ హౌస్‌లోకి ఫస్ట్ త్రిగుణ్ భార్య , కూతురు ఎంట్రీ ఇచ్చారు. భర్తను చూసి త్రిగుణ్‌ భార్య కన్నీరు పెట్టుకోగా..ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు. ఎలాగైనా ట్రోఫీ ఇంటికి తీసుకురావాలని త్రిగుణ్‌కు ఆమె గట్టిగా ధైర్యం చెప్పగా.. వర్షిణి వల్ల తాను చాలా హర్ట్ అయ్యానని భార్యతో చెప్పుకున్నాడు త్రిగుణ్. త్రిగుణ్ కూతురితో హౌస్‌లోని అందరూ సరదాగా ఆడుకున్న తర్వాత అందరికీ బై చెప్పి వాళ్లిద్దరూ ఎమోషనల్‌గానే హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు.

ఆ తర్వాత నీతూ మాస్టర్ భర్త నటరాజ్ మాస్టర్, కూతురు హౌస్‌లోకి వచ్చారు. నీతూ, నటరాజ్ ఇద్దరూ ఎమోషనల్ అయిపోయారు. లోపల నీ గేమ్ ఆడితే బయటన నేను ఆడుతానని.. కంగారు పడకు, ఏడవకు అంటూ నీతూకు నటరాజ్ భరోసా ఇచ్చారు. గత నామినేషన్స్‌లో నీతూ సింపతీ గేమ్ ఆడుతుందంటూ ఫైర్ అయిన వంశీ దగ్గరకు నటరాజ్ మాస్టర్ వెళ్లారు.

వంశీని చూసిగొడవ పడదామని అనుకున్నానని, కానీ వాళ్ల పాపని చూసి మనసు మారిపోయిందని నటరాజ్ చెప్పారు. అయితే, త్రిగుణ్‌తో మాట్లాడుతూ రియాల్టీ షోలో రెండు సార్లు వచ్చిన దానికంటే కూడా నువ్వు పదిసార్లకు సరిపడా కంటెంట్ ఇస్తున్నావంటూ నవ్వులు పూయించారు. అందరితోనూ మాట్లాడు బట్..వంశీ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని వైఫ్‌కు సూచించారు. నటరాజ్ మాస్టర్ హౌస్‌లోకి వచ్చినప్పుడు, వెళ్లేటప్పుడు కూడా డ్యాన్సులు వేసి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు.

మరోవైపు ముకేష్, నీతూ జోకులు వేసుకుంటూనే సీరియస్‌గా గొడవ పడ్డారు. తర్వాత ముకేష్‌, వర్షిణితో జాగ్రత్తగా ఉండాలని నీతూ, శివ్ డిస్కషన్స్ పెట్టుకున్నారు. శివ్ అయితే రామ్ ప్రసాద్‌తో మాట్లాడుతూ వంశీ వల్లే త్రిగుణ్ హౌస్‌లో ఉన్నాడంటూ అందరి దగ్గరకు వెళ్లి త్రిగుణ్‌పై నెగిటివిటీ స్ప్రెడ్ చేసే పనిలో పడ్డాడు. వర్షిణి, త్రిగుణ్, ముకేష్ గ్రూపులుగా విడిపోయి ఎవరి గేమ్ వారు ప్లాన్ చేసుకున్నారు.

స్కూల్ టాస్క్‌లో బాగా ఆడిన వారందరికీ కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యే గోల్డెన్ ఛాన్స్‌ను ఇచ్చాడు బిగ్ బాస్. దీనిలో భాగంగా హౌస్ అంతటా చిన్న చిన్న నెంబర్ షీట్స్ పరిచి పెట్టాడు. బిగ్ బాస్ ఒక నెంబర్ చెప్పగానే కంటెస్టెంట్స్ అంతా ఆ షీట్ మీద నిలబడాలి. ఎవరు నిలబడలేకపోయినా ఆ నెంబర్‌పై లేకపోయినా వారు ఎలిమినేట్ అవుతారు. చివరి వరకు నిలబడిన నలుగురు మాత్రం నెక్స్ట్ లెవెల్ కెప్టెన్సీ రేస్‌కు వెళ్తారు.

మొదట బిగ్ బాస్ ఒక నెంబర్ చెప్పగా, ఆ చిన్న షీట్ మీద అంతా ఇరుక్కుపోవడానికి ప్రయత్నించడంతో.. ఎవరున్నారో ఎవల్లేరో తేల్చుకునేసరికి పెద్ద గొడవలే జరిగాయి. ఈ గేమ్‌లో సుధీర్ మొదట అవుట్ అవడంతో.. సంచాలక్‌గా మారాడు. ఆ తర్వాత వర్షిణి, రామ్ ప్రసాద్ వరుసగా అవుట్ అయ్యారు. ముకేష్‌కు హెల్ప్ చేసినందుకు వర్షిణితో సుధీర్ గొడవ పడ్డాడు. ఆ తర్వాత వర్షిణి సంచాలక్‌గా మారింది.

Family Time

తర్వాత నీతూ మాస్టర్, దేబ్జానీ, శ్వేతా అవుట్ అయ్యారు. షీట్ మీద ప్లేస్ కోసం త్రిగుణ్, శివ ఇద్దరూ ఒకరినొకరు తోసుకుంటూ బయటకు వెళ్లిపోయారు. దీంతో ఆ ఇద్దరూ అవుట్ అయ్యారు. ఆ షీట్ల మీద నిలబడటానికి కంటెస్టెంట్స్ కొట్టుకోవడం వరకూ వెళ్లడం చూసి ఆడియన్స్ ఇదెక్కడి కెప్టెన్సీ టాస్క్‌రా బాబు అనుకునేలా సాగింది.

చివరగా హోరాహోరీగా సాగిన ఈ గేమ్‌లో వంశీ, నరేష్, అమన్, రామకృష్ణ నెక్స్ట్ లెవెల్ కెప్టెన్సీ రేస్‌కు అర్హత సాధించారు. ఇక గేమ్ అంతా అయిపోయాక ముకేష్ పేరు చెప్పిందని వర్షిణితో ముకేష్ గట్టిగానే గొడవ పెట్టుకున్నాడు. నవంబర్ 14న జరిగే ఫైనల్ కెప్టెన్సీ గేమ్‌లో ఈ నలుగురిలో ఎవరు కొత్త కెప్టెన్ అవుతారనేది చూడాలి.

Women Midlife Crisis : 45 ప్లస్ మహిళలు అటెన్షన్ ఎందుకు కోరుకుంటారు? మిడ్ లైఫ్ క్రైసిస్, ఫ్రీడమ్ ఆలోచనల మధ్య వారి లైఫ్ స్టైల్..

↑
Exit mobile version