Bigg Boss 10 : అట్టహాసంగా బిగ్ బాస్ 10 హంగామా.. దెయ్యం డ్రామాలు, కన్నీళ్ల కష్టాలు, లవ్ కబుర్లు..

Bigg Boss 10 : అనుకున్నట్లుగానే సెప్టెంబర్ 6వ తేదీ రాత్రి 7 గంటలకు హోస్ట్ కింగ్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీతో..బిగ్ బాస్ షో అఫీషియల్‌గా షురూ అయ్యింది.

Bigg Boss 10

బుల్లితెర చరిత్రలోనే ఎక్కువమంద ఎదురుచూసే రియాలిటీ షో..బిగ్ బాస్ సీజన్ 10 సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొమ్మిది సీజన్లను బాగా ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్‌కు, పదో ల్యాండ్‌మార్క్ సీజన్ మరింత కిక్ ఇవ్వడానికి ఫుల్ జోష్‌తో రెడీ అయిపోయింది. అనుకున్నట్లుగానే సెప్టెంబర్ 6వ తేదీ రాత్రి 7 గంటలకు హోస్ట్ కింగ్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీతో.. షో అఫీషియల్‌గా షురూ అయ్యింది. అగ్నిపరీక్ష సీజన్ 2 నుంచి గెలిచి వచ్చిన కంటెస్టెంట్లతో పాటు క్రేజీ అండ్ ఫుల్ డిమాండ్ ఉన్న సెలబ్రిటీలను మిక్స్ చేసి.. బిగ్ హౌస్‌లోకి పంపించారు మేకర్స్.

ముందుగా ఫస్ట్ కంటెస్టెంట్‌గా ఎన్నెన్నో జన్మల బంధం, సత్యభామ వంటి సీరియల్స్‌తో తెలుగు వాళ్ల మనసు దోచుకున్న కన్నడ బ్యూటీ దేబ్జానీ ఎంట్రీ ఇచ్చింది. నాగ్ కోసం రొమాంటిక్ పాట పాడుతూ ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేసిన ఈ భామ.. గౌన్ వేసుకుని తెల్ల గుర్రం మీద వచ్చే రాజకుమారుడి డ్రీమ్స్ గురించి క్యూట్ ముచ్చట్లు చెప్పి మరింత ఇంప్రెస్ చేసేసింది. లాస్ట్ సీజన్ విన్నర్ కళ్యాణ్ పడాల కూడా ఫస్ట్ కంటెస్టెంటే కావడంతో ఈ బ్యూటీ లక్ ఎలా ఉంటుందో చూడాలి.

Debjani Modak

ఆ తర్వాత సెకెండ్ కంటెస్టెంట్‌గా చెన్నై లవ్ స్టోరీ, పీఎస్వీ గురుడ వేగ, డియర్ మేఘ మూవీ యాక్టర్ త్రిగుణ్ ఎంట్రీ ఇచ్చాడు. నాగార్జునతో త్రిగుణ్ అందరిలో ఒకడిలా ఉంటానని చెప్పగా, సాటర్డే లోపు హౌస్‌లో దెయ్యం ఉందంటూ హౌస్‌మేట్స్‌ను భయపెట్టాలనే ఒక సీక్రెట్ మిషన్‌ను నాగ్ అతనికి అప్పగించారు.

Thrigun

థర్డ్ కంటెస్టెంట్‌గా సింగర్ ఝాన్సీ హౌస్‌లోకి అడుగుపెట్టింది. బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2లో ఆడియన్స్ ఓట్లతో పాటు గోల్డెన్ టికెట్ కూడా సాధించి డైరెక్ట్ ఎంట్రీ కొట్టేసింది. థర్డ్ క్లాస్ నుంచే సాంగ్స్ మొదలుపెట్టిన తనకు తగినన్ని ఛాన్స్‌లు రాలేదని, ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా అందరికీ దగ్గరవ్వాలని ఆశిస్తున్నట్లు చెప్పింది.

singer jhansi

ఫోర్త్ కంటెస్టెంట్‌గా యూట్యూబర్ సుధీర్ టాక్స్.. సుధీర్ వచ్చాడు. యూట్యూబర్ కాకముందు జాబ్ కోసం సింగపూర్ వెళ్తే సొంత ఫ్రెండ్సే తనను మోసం చేశారని, ఆ టైమ్‌ల పడ్డ కష్టాలను గుర్తుచేసుకుని స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ ఎమోషనల్ చేసింది.

Sudheer Reddy

ఇక ఫిప్త్‌ కంటెస్టెంట్‌గా అగ్నిపరీక్ష సీజన్ 2లో ఎక్కువ ఓట్లు సాధించిన కామనర్ అమన్ ఎంట్రీ ఇచ్చాడు. అమన్‌కు నాగార్జున.. టీషర్ట్‌కి ఉన్న హోల్స్ లెక్కపెట్టమని ఒకటి, రెడ్ డాట్‌ను తర్వాత వచ్చే ముగ్గురిలో ఒకరికి ఎవరికీ తెలియకుండా అతికించడమనే రెండు క్రేజీ టాస్కులు ఇచ్చారు.

Aman Masud

ఆరో కంటెస్టెంట్‌గా బుల్లి తెర నటి చైత్ర రాయ్ ఎంట్రీ ఇచ్చింది. తన వెయిట్ విషయంలో ఒక వ్యక్తి చేసిన కామెంట్స్ సీరియస్‌గా తీసుకుని 80 కేజీల నుంచి 60 కేజీలకు తగ్గినట్లు చెప్పిన ఈ బ్యూటీ, బిగ్ బాస్‌ను తన సెకండ్ ఇన్నింగ్స్‌గా చెప్పుకొచ్చింది.

chaitra rai

ఇక సెవెన్త్‌ కంటెస్టెంట్‌గా జబర్దస్త్ ఆటో రాం ప్రసాద్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. సుధీర్, శ్రీను కాంబోలో కామెడీతో పొట్ట పగిలేలా నవ్వించిన రాం ప్రసాద్ హౌస్‌లో తన పంచ్‌లతో ఏ రేంజ్‌లో అలరిస్తాడో చూడాలి.

Auto Ram Prasad

అలాగే ఎనిమిదో కంటెస్టెంట్‌గా షాలినీ వచ్చింది. అగ్నిపరీక్ష 2 లో చలాకీగా ఆడిన షాలినీ, హౌస్‌లో అంతకుమించి స్ట్రాటజీలతో ఆడుతానంటూ కింగ్ నాగార్జునతో కాన్ఫిడెంట్‌గా చెప్పింది.

Shalini Patel

నైన్త్‌ కంటెస్టెంట్‌గా టెంపర్ మూవీతో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న విలన్ వంశీ ఎంట్రీ ఇచ్చాడు. విలన్ ఇమేజ్ దాటి ప్రేక్షకులకు దగ్గరవ్వడమే తన టార్గెట్ అని నాగ్‌తో చెప్పాడు.

Temper Vamsi

మరో అగ్ని పరీక్ష విన్నర్‌గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది సృష్టి అలియాస్ శివ సృష్టి వ్యాకరణం. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన సృష్టి.. విదేశాల్లో ఉంటూనే బిగ్ బాస్‌పై ఇంట్రెస్ట్‌తో అగ్ని పరీక్షకు అప్లై చేసింది. అగ్నిపరీక్షలో డేరింగ్ టాస్క్‌లు చేసి అందర్నీ మెప్పించి.. ఇప్పుడు బిగ్ బాస్ 10 హౌస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

Shiva Srishti Vyakaranam

ఇక జబర్దస్త్ నరేష్ తన దైన స్టైల్‌తో బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చాడు. గూగుల్‌లో నరేష్ అని టైప్ చేస్తే బిగ్ బాస్ సీజన్ 10 విన్నర్ అని రావాలనేదే తన బిగ్ టార్గెట్ అని ఫుల్ కాన్ఫిడెన్స్‌తో చెప్పుకొచ్చాడు.

Jabardasth Naresh

మరో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన సీనియర్ నటుడు కృష్ణుడు..కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయి లావయ్యానంటూ ఎమోషనల్ అయ్యాడు. స్వీట్స్ అంటే తనకు చాలా ఇష్టమని తను బిగ్ బాస్ కోసం వాటిని కూడా త్యాగం చేశానని చెప్పాడు.

krishnudu

పద్నాలుగో కంటెస్టెంట్‌గా నటి, యాంకర్ వర్షిణి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. పెద్ద ప్లాట్‌ఫామ్‌లో ఇమడలేననే ఫీలింగ్ దాటి తనేంటో ప్రూవ్ చేసుకోవడానికి వచ్చానంటూ కింగ్ నాగార్జున తెలిపింది.

Varshini Sounderajan

పదిహేనో కంటెస్టెంట్‌గా అగ్నిపరీక్ష రోహిత్ నాయుడు ఎంట్రీ ఇవ్వగా.. రోహిత్‌ను బిందుమాధవి స్టేజీపైకి తీసుకెళ్లి అతడు రొమాంటిక్ అండ్ పవర్‌ఫుల్ ప్లేయర్ అని ఇంట్రడ్యూస్ చేసింది.

Rohit Naidu Patnam

ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్‌ అనేలా రిషి సార్ అలియాస్ ముకేశ్ గౌడ మాస్ ఎంట్రీ ఇచ్చాడు. తనలోని ఎంటర్‌టైన్మెంట్ యాంగిల్‌ను చూపిస్తానని, హౌస్‌లో ప్రేమలో పడే ఛాన్స్ అస్సలు లేదని క్లారిటీ ఇచ్చాడు.

Nihar Mukesh Gowda

మొత్తంగా ఈసారి ఫేస్ తెలియని కంటెస్టెంట్లతో కాకుండా.. ఆచి తూచి, ఆడియన్స్‌కు తెలిసిన పాపులర్ ఫేస్‌లు, మంచి గేమర్స్‌ని ఎంపిక చేయడమే బిగ్ బాస్ లవర్స్‌కి అసలైన గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ 16 మంది కంటెస్టెంట్లకు టాస్కులు ఇచ్చిన నాగార్జున, హౌస్‌కి తాళం వేయడంతో మొదలైన ఈ హై-వోల్టేజ్ డ్రామా.. రానున్న రోజుల్లో ఏ రేంజ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుందో వేచి చూడాలి.

Romance In Relationship : రిలేషన్‌షిప్‌లో లవ్ కనిపించడం లేదా? ఎక్కడో ఆ స్పార్క్ మిస్ అవుతుందా?

Exit mobile version