Week 7 Nominations : బిగ్ బాస్ వీక్ 7 నామినేషన్స్.. నామినేషన్‌లో ఏకంగా 12 మంది

Week 7 Nominations : బిగ్ బాస్ సీజన్ 10 సెవెన్త్ వీక్ నామినేషన్ల ప్రాసెస్‌లో ఇంటి సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. త్రిగుణ్, వర్షిణి, సుధీర్, శివ్, ఆర్కే మధ్య మాటల యుద్ధం జరగ్గా.. ఈ వీక్ ఏకంగా 12 మంది ఎలిమినేషన్ జోన్‌లోకి వెళ్లారు. బిగ్ బాస్ డే 44 ఎపిసోడ్ పూర్తి విశేషాలు ఇవే.

Week 7 Nominations

గెలవాలనే ఆరాటం, కసి ఉండటం తప్పు కాదు కానీ.. దానికి గేమ్ స్ట్రాటజీ, ప్లానింగ్ అంటూ పేర్లు పెట్టి తమ నెగిటివిటీని గర్వంగా ప్రదర్శించుకునే డిఫరెంట్ వాతావరణం బిగ్ బాస్ హౌస్‌లో కనిపిస్తోంది. రోజురోజుకు కొందరు సభ్యులు కనీస సభ్యతను కూడా పక్కనబెట్టి ప్రవర్తిస్తుండటం ఆడియన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రశాంతంగా మాట్లాడి పరిష్కరించుకోవాల్సిన చిన్నచిన్న విషయాల దగ్గర కూడా బూతులతో, ఆరోపణలతో రెచ్చిపోతున్నారు. సోమవారం మొదలైన నామినేషన్ల రచ్చ, మంగళవారం45వ ఎపిసోడ్‌లో మరింత హీటెక్కింది.

ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే త్రిగుణ్, వంశీ మైండ్ గేమ్‌కు తెరతీశారు. షాలిని ఇక్కడే ఉండి, వంశీ బయటకు వెళ్తాడని రోహిత్ అనుకున్నాడని, కానీ వంశీ సేవ్ కావడంతో ఫ్యూజులు ఎగిరిపోయాయని త్రిగుణ్ కామెంట్ చేయగా.. దీనికి రోహిత్ కంటే హౌస్‌లో కొనసాగే అర్హత తనకే ఎక్కువగా ఉందంటూ వంశీ ఆన్సర్ చెబుతాడు. మరోవైపు వర్షిణి కూడా నీతూ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. అసలు కథ రోహిత్ నామినేషన్ పత్రాలు మార్చడం వల్లే స్టార్టయిందని త్రిగుణ్ ఆరోపించాడు. ఇక సుధీర్ వచ్చి రోహిత్‌తో మాట్లాడగా.. షాలిని తన రీచార్జ్ పాయింట్ అని, తను వెళ్లిపోయింది కాబట్టి.. ఇకపై తనకు ఎలాంటి వీక్నెస్ లేదని..ఇకపై ఫుల్ ఎటాకింగ్ మోడ్‌లో ఆడతానని రోహిత్ చెబుతాడు.

ఆ తర్వాత నామినేషన్(Week 7 Nominations) ప్రాసెస్ ఊపందుకుంది. అమన్ మొదట శివ్‌ను నామినేట్ చేస్తూ.. బయటనుంచి గంట ఎపిసోడ్ చూసి వచ్చి గేమ్ ఆడుతున్నావని, వైల్డ్ ఫైర్ అనుకుంటే వైల్డ్ ఫూల్ అయ్యావని శివపై సెటైర్ వేశాడు. దానికి శివ్ కౌంటర్ ఇస్తూ.. జనమంతా ఓట్లు వేసేది కేవలం ఆ గంట ఎపిసోడ్ చూసే తప్ప, 24 గంటలు ఎపిసోడ్ చూసి కాదని, ఇక్కడ ఫూల్ తను కాదని బదులిచ్చాడు.

శ్వేత వచ్చి త్రిగుణ్‌ను నామినేట్ చేసింది. కప్పు గెలవాలనుకోవడం మంచిదే అయితే దానికోసం నమ్మకద్రోహం చేయడం, గేమ్‌లో ఛీటింగ్ చేసి కెప్టెన్సీ కంటెండర్ షిప్ నుంచి వేరే వారిని తప్పించడం కరెక్ట్ కాదని చెప్పింది. దీనిపై త్రిగుణ్ హౌస్‌లో తన ఇమేజ్ పోతోందన్న విషయం తనకు తెలుసని, విలన్ లేదంటే హీరో అవ్వడం తన ఉద్దేశం కాదని, కేవలం వినోదం పంచడమే తన స్ట్రాటజీ అని కవర్ చేసుకున్నాడు.

ఇక వర్షిణి, నీతూ మధ్య పెద్ద ఫైటే జరిగింది. ఎదుటివారికి రూల్స్ చెప్పే నీతూ, బిగ్ బాస్ వద్ద హెచ్చరికలను ఎదుర్కొంటున్నా కూడా తన గేమ్ తాను ఆడటం లేదని వర్షిణి నిలదీసింది. అలాగే సుధీర్, రామకృష్ణ నామినేషన్‌లో కూడా మాటల యుద్ధం పెద్దగానే జరిగింది.తర్వాత సుధీర్ ఫ్యామిలీపై ప్రమాణం చేసి మాట తప్పాడని త్రిగుణ్ అనడంతో.. హౌస్‌లో త్రిగుణ్‌ను నమ్మకూడదనే విషయాన్ని బిగ్ బాస్ ముందే చెప్పినట్లు సుధీర్ రివర్స్ కౌంటర్ ఇచ్చాడు.

ఆ తర్వాత ఆర్కే సింపతీ గేమ్ ఆడుతున్నాడని, ప్రతి దానికి ఏడుస్తూ కాళ్లు మొక్కుతున్నాడని ఝాన్సీ అతడిని నామినేట్ చేయగా.. త్రిగుణ్ చేసినన్ని తప్పులు హౌస్‌లో ఎవరూ చేయలేదని, తనే ఎవరి కాళ్లు మొక్కలేదు, కానీ నువ్వెందుకు మొక్కుతున్నావని అనడంతో హౌస్‌ ఒక్కసారిగా నవ్వులతో నిండిపోయింది. చివర్లో కెప్టెన్ రాం ప్రసాద్ తన స్పెషల్ పవర్ ఉపయోగించి అమన్‌ను డైరెక్టుగా నామినేట్ చేశాడు.

మొత్తంగా సెవన్త్ వీక్(Week 7 Nominations) ఎలిమినేషన్ రౌండ్‌లో దేబ్జానీ, నరేష్, ముకేష్, రాం ప్రసాద్ తప్ప మిగిలిన 12 మంది నామినేట్ అయ్యారు. వంశీ, దక్షి, వర్షిణి, రోహిత్, శివ్, సుధీర్, త్రిగుణ్, ఆర్కే,ఝాన్సీ,నీతూ, శ్వేతా, అమన్ ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఈ వీక్(Week 7 Nominations) ఈ 12 మందిలో నాగ్ ఎవరితో బిగ్ బాస్ ఇంటికి గుడ్ బై చెప్పిస్తారో చూడాలి.

Hair Spray : హెయిర్ జెల్స్, స్ప్రేలు తెగ వాడుతున్నారా? అయితే ఈ షాకింగ్ నిజాలు మీకోసమే..

↑
Exit mobile version