Vijay
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ ఇప్పుడు తన పర్సనల్ లైఫ్‌లో అత్యంత క్లిష్ట దశను ఎదుర్కొంటున్నారనే చెప్పొచ్చు. ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూ ఎలక్షన్స్‌కు రెడీ అవుతుంటే.. మరోవైపు వ్యక్తిగత జీవితంలో విజయ్ భార్య సంగీత డైవోర్స్ కోసం కోర్టు మెట్లెక్కడం గురించి అందరికీ తెలిసిందే. అంతేకాదు ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉన్న విజయ్ ఫ్యామిలీ ఇప్పుడు నలుగురూ నాలుగు దిక్కుల్లో ఉండటం అభిమానులను కలచివేస్తోంది.
విజయ్(Vijay)కు ఒక నటితో ఉన్న వివాహేతర సంబంధమే ఈ విడాకులకు కారణమని సంగీత ఆరోపిస్తూ..విడాకుల పిటిషన్‌తో పాటు ఆమె మరో మధ్యంతర పిటిషన్ కూడా వేయడం కూడా ఫ్యాన్స్‌కు షాకే. ప్రస్తుతం తనకు చెన్నైలో ఇల్లు లేదని, విడాకుల కేసు తేలే వరకు చెన్నై నీలాంకరైలోని విజయ్ ఇంట్లోనే ఉండడానికి అనుమతి ఇవ్వాలని కోరడం.. విజయ్ తరపు లాయర్ల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని సంగీత చెప్పడం విజయ్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేని అంశాలుగానే మిగిలిపోతున్నాయి.
కాగా దీనిపై ఏప్రిల్ 20న జరగబోయే విచారణకు విజయ్ హాజరుకావాల్సి ఉండటంతో ఆరోజు ఏమవుతుందోనని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో నటి త్రిషతో విజయ్ సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకు రావడంతో నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు లండన్‌లోని తన తల్లిదండ్రుల వద్ద సంగీత ఉంటుండగా,విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ తండ్రి దగ్గర ఉండకుండా చెన్నైలో అద్దె ఫ్లాట్‌లో ఉంటున్నాడట. ఇక విజయ్ కుమార్తె దివ్య సాషా హాస్టల్‌లో ఉంటోందట.
అయితే తండ్రి రాజకీయాల్లోనూ, తల్లి కోర్టు గొడవల్లో బిజీగా ఉండటంతో ఈ ఇద్దరు పిల్లలు ఇలా ఒంటరిగా ఉండటం చర్చకు దారితీసింది. అయితే ఈ వార్తలపై స్పందించిన విజయ్(Vijay) మాత్రం.. తన వ్యక్తిగత విషయాల గురించి ఫ్యాన్స్ ఆందోళన చెందొద్దని, ప్రజా సమస్యలపై పోరాడటమే తన లక్ష్యమని ఇటీవల స్టేట్‌మెంట్ ఇచ్చారు.
