Irumudi OTT : రవితేజ ఇరుముడి ఓటీటీ డేట్ ఫిక్స్.. 5 భాషల్లో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచో తెలుసా?

Irumudi OTT : రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఇరుముడి మూవీ, బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.225 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది.

Irumudi OTT

పక్కా మాస్ మూవీలతో ఇప్పటి వరకూ రచ్చ చేసిన మాస్ మహారాజా రవితేజ, ఈసారి కన్నీళ్లు పెట్టించే రేంజ్ ఎమోషన్‌ను సరిగ్గా పట్టుకుంటే బాక్సాఫీస్ లెక్కలెలా ఉంటాయో అందరికీ చూపించారు. డైరెక్టర్ శివ నిర్వాణ కాంబోలో వచ్చిన ఇరుముడి థియేటర్లను ఊపేసి, ట్రేడ్ పండితుల అంచనాలను కూడా పూర్తిగా తలకిందులు చేసింది.

ఆగస్టు 21వ తేదీన రిలీజైన పవర్ ఫుల్ ఎమోషనల్ డ్రామా ఇరుముడి.. కలెక్షన్ల సునామీ కురిపించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు థియేటర్లలో కలెక్షన్ల వేటను కంప్లీట్ చేసుకుని, డిజిటల్ వేదికపై ఎమోషనల్ డ్రామా పండించడానికి రెడీ అయిపోయింది.

కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఇరుముడి మూవీ, బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.225 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. అంటే ప్రొడ్యూసర్స్ పెట్టిన పెట్టుబడిపై నాలుగైదు రెట్లు లాభాలను రాబట్టడమే కాకుండా, ఏకంగా రూ.100 కోట్లకు పైగా నెట్ ప్రాఫిట్‌ (Net Profit)ను తెచ్చిపెట్టి హిస్టరీ క్రియేట్ చేసింది. ముఖ్యంగా నైజాం ఏరియా ఒక్క చోటే రూ.53 కోట్లకు పైగా షేర్ రాబట్టడం మాస్ మహారాజా కెరీర్‌లోనే ఒక బెంచ్‌మార్క్ రికార్డుగా నిలిచింది.

రవితేజలోని మాస్ యాంగిల్‌ను పక్కన పెట్టి, సెంటిమెంట్ యాడ్ చేసి కొత్త కోణంలో ఆవిష్కరించడంలో శివ నిర్వాణ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే బంధానికి శబరిమల అయ్యప్ప స్వామి దీక్ష బ్యాక్ డ్రాప్‌గా యాడ్ చేసి ఆయన స్టోరీని నడిపించిన తీరు థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్‌ చేత కర్చీఫ్‌లు తడిచిపోయేలా చేసింది. డ్రామా, యాక్షన్, భక్తి , ఫ్యామిలీ సెంటిమెంట్‌లను పర్ఫెక్ట్‌గా చూపించడంతో ఈ సినిమా అన్ని రకాల ఆడియన్స్‌ గుండెల్లోకి చొచ్చుకుపోయింది.

Irumudi OTT

ఇక థియేటర్లలో మిస్ అయిన వాళ్లు.. అలాగే ఈ ఎమోషనల్ రైడ్‌ను మళ్లీ ఓటీటీలో చూడటానికి ఎదురు చూస్తున్నారు. కాగా ఫేమస్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా, సెప్టెంబర్ 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు.

సెప్టెంబర్ 18వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ , హిందీ భాషల్లో కూడా ఒకేసారి ఇరుముడి స్ట్రీమింగ్ కాబోతోంది. బిగ్ స్క్రీన్‌పై రికార్డుల తుపాను క్రియేట్ చేసిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై కూడా ట్రెండింగ్‌లో నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు.

Khairatabad Ganesha : 7 దశాబ్దాల ఖైరతాబాద్ గణపయ్య.. 69 అడుగుల ఎకో ఫ్రెండ్లీ గణేషుడు ప్రత్యేకత ఇదే..

Exit mobile version