Jailer 2 : జైలర్ 2 తో బాక్సాఫీస్ మాస్ ఫీస్ట్ దొరికిందా? క్లైమాక్స్ ట్విస్ట్ అండ్ రజనీ స్వాగ్‌తో పూనకాలేనా?

Jailer 2 : ఎప్పటిలాగే రజినీకాంత్ ఈ మూవీలో తన వింటేజ్ మేనరిజమ్‌తో వన్ మ్యాన్ షో చేయగా, అనిరుధ్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నార్మల్ సీన్స్‌ను కూడా పీక్స్‌కు తీసుకెళ్లి ప్రాణం పోసింది.

Jailer 2

సరిగ్గా మూడేళ్ల కిందట దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ క్రియేట్ చేసిన రజినీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబో మరోసారి రచ్చ చేయడానికి థియేటర్లలోకి ఈరోజు ఎంట్రీ ఇచ్చేసింది. అప్పట్లో రజినీలోని స్వాగ్‌ను నెల్సన్ ఏ రేంజ్‌లో వాడాడో చూసిన రజినీ అభిమానులు, ఇప్పుడు వచ్చిన ఈ(Jailer 2) సీక్వెల్ కూడా అదే రేంజ్‌లో థ్రిల్‌ను అందిస్తుందా లేదా అనే క్యూరియాసిటీతో థియేటర్లకు క్యూ కట్టారు.

ఇక మూవీ(Jailer 2) ప్లాట్‌లోకి తొంగి చూస్తే, కొడుకును కోల్పోయిన బాధ నుంచి బయటపడి ఒక సాధారణ సూపర్ మార్కెట్‌లో సైలెంట్‌గా పని చేసుకుంటున్న ముత్తువేల్ పాండియన్ (రజినీకాంత్) జీవితంలోకి మరోసారి ఊహించని గ్యాంగ్ వార్ తుపానులా విరుచుకుపడుతుంది.

ఫస్ట్ పార్ట్‌లో చనిపోయిన వర్మ వెనుక ఉన్న ఆంతరంగిక సిండికేట్ నెట్‌వర్క్.. అసలు హంతకుడి కోసం జల్లెడ పడుతూ డైరెక్టుగా జైలర్‌నే టార్గెట్ చేస్తుంది. గోవా నేర సామ్రాజ్యానికి అధిపతులైన బోధి కల్పక్ (ఎస్‌జే సూర్య), కాంతా కల్పక్ (విద్యాబాలన్) గ్రూపుల నుంచి జైలర్ తనతో పాటు తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు, వాళ్ల నెట్‌వర్క్‌ను ఎలా నిర్వీర్వం చేశాడనేదే ఈ కథ.

డైరెక్టర్ నెల్సన్ స్క్రీన్‌ప్లే డిజైనింగ్ మ్యాటర్‌కు వస్తే.. తన హోమ్ గ్రౌండ్ అయిన డార్క్ కామెడీ అండ్ మాస్ ఎలివేషన్‌ను ఈసారి కూడా నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాడు. మెయిన్‌గా ఫస్ట్ హాఫ్‌లో ప్రతీ 10 – 15 నిమిషాలకు ఒక అదిరిపోయే పీక్ మూమెంట్ ఇస్తూ ఆడియన్స్ విజిల్స్ వేసేలా రైటింగ్ కుదిరింది.

డాన్ మూర్తిగా నమో నారాయణ పండించిన నవ్వులు థియేటర్లో పొట్టలు చెక్కలయ్యేలా నవ్విస్తే, ఇంటర్వెల్ బాంగ్ మాత్రం థియేటర్‌లో గూస్‌బంప్స్ తెప్పించే రేంజ్‌లో సెట్ అయింది. అయితే సెకండ్ హాఫ్‌లో డ్రామా అండ్ ఎమోషన్స్ కాస్త ఎక్కువ కావడంతో స్టోరీ కాస్త స్లో అయిందన్న ఫీలింగ్ కలిగినా, వెంటనే ప్లాన్ చేసిన భారీ యాక్షన్ బ్లాక్ ద్వారా డైరెక్టర్ గ్రాఫ్‌ను మళ్లీ ఒక్కసారిగా పైకి లేపడంతో ఆడియన్స్ డిజప్పాయింట్ అవలేదు.

మూడు గంటలకు దగ్గరగా ఉన్న రన్‌టైమ్ వల్ల సెకండాఫ్‌లో కొన్ని సీన్లు కొంచెం సాగదీసినట్టు అనిపించినా, క్లైమాక్స్‌లో బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్‌ రోషన్ ఇచ్చే సర్‌ప్రైజ్ ఎంట్రీ అండ్ పార్ట్ 3 పై ఇచ్చిన క్లూస్ ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీని పెంచేశాయి.

ఎప్పటిలాగే రజినీకాంత్ ఈ మూవీలో తన వింటేజ్ మేనరిజమ్‌తో వన్ మ్యాన్ షో చేయగా, అనిరుధ్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నార్మల్ సీన్స్‌ను కూడా పీక్స్‌కు తీసుకెళ్లి ప్రాణం పోసింది. మొత్తానికి సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఈ సీక్వెల్ ఒక పర్ఫెక్ట్ మాస్ విందు అనే చెప్పాలి.మొత్తంగా రజినీ కోసమే కాకుండా ఓవరాల్ స్టోరీ, స్క్రీన్ ప్లే కోసం కూడా చూడాల్సిన సినిమాగా జైలర్ 2(Jailer 2) టాక్ తెచ్చుకుంది.

Gas Pipe : మీ ఇంట్లోని గ్యాస్ పైప్ మార్చి ఎన్ని ఏళ్లయ్యింది? ఈ రూల్ తెలుసుకోకపోతే చాలా డేంజర్..

↑
Exit mobile version