Jayammu Nischayammu Raa with Jagapathi : జీ తెలుగు టాక్ షో సీజన్ 2 కిక్.. జగపతిబాబు షోలో సాయి పల్లవి హంగామా

Jayammu Nischayammu Raa with Jagapathi : నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తొలి ఎపిసోడ్‌కు ..స్పెషల్ గెస్ట్‌గా వచ్చి హోస్ట్ జగపతిబాబుతో కలిసి సందడి చేయబోతుండటంతో ఈ షోపై అంచనాలు ఒక్కసారిగా పీక్స్‌కు చేరాయి.

Jayammu Nischayammu Raa With Jagapathi

తెర వెనుక నటించే సినిమా తారలు తామంటే ప్రాణమిచ్చే అభిమానుల కోసం తెర ముందుకు వచ్చి మనసు విప్పి మాట్లాడితే ఆ ముచ్చట్లకు ఉండే కిక్కు, క్రేజ్ వేరే లెవల్ ఉంటుంది. అలా మనసుకు హత్తుకునే సంభాషణలతో సెలబ్రిటీల్లో ఉండే అసలైన మనుషులను ప్రేక్షకులకు పరిచయం చేసే క్రేజీ టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి(Jayammu Nischayammu Raa with Jagapathi) టాప్ టీఆర్పీతో దూసుకుపోయింది .

ఫస్ట్ తొలి సీజన్‌లో అక్కినేని నాగార్జున, శ్రీలీల లాంటి టాలీవుడ్ స్టార్లతో అప్పుడు సందడి చేసిన ఈ పాపులర్ షో.. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా సీజన్ 2తో గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. అయితే ఈ కొత్త సీజన్‌లో సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తొలి ఎపిసోడ్‌కు ..స్పెషల్ గెస్ట్‌గా వచ్చి హోస్ట్ జగపతిబాబుతో కలిసి సందడి చేయబోతుండటంతో ఈ షోపై అంచనాలు ఒక్కసారిగా పీక్స్‌కు చేరాయి.

నిజానికి సాయి పల్లవిని గ్లామర్ హీరోయిన్ అని ఎవరూ అనుకోరు. తన నేచురల్ నటనతో ప్రతీ ఒక్కరి ఇంట్లో వారి అమ్మాయిలాగే అనుకుంటారు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ‘రామాయణ’ మూవీలో ఆమె సీతాదేవిగా రానుండటంతో.. ఆడియన్స్ ఇప్పటికే ఆమెను మా సీత అని ప్రేమగా పిలుచుకుంటున్నారు.

అయితే ఈ భారీ ప్రాజెక్ట్ (Jayammu Nischayammu Raa with Jagapathi)అనౌన్స్ చేసిన తర్వాత సాయి పల్లవి ఇస్తున్న అఫీషియల్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇదే కావడం ఈ ఎపిసోడ్‌కు మరింత హైప్ తీసుకొచ్చింది. చాలా సింపుల్‌గా, మనిషికి, మనసుకు కూడా ఎలాంటి మేకప్ అండ్ ఫిల్టర్లు లేకుండా మనసులోని భావాలను బయటకు చెప్పే సాయి పల్లవి.. జగపతిబాబు మార్క్ ప్రశ్నలకు ఎలా రియాక్టవుతుందోనన్న క్యూరియాసిటీ నార్మల్ ఆడియన్స్‌తో పాటు ఇండస్ట్రీ సర్కిల్స్‌లోనూ పెరిగిపోయింది.

Jayammu Nischayammu Raa With Jagapathi

ఈ ఎపిసోడ్ అక్టోబర్ 16వ తేదీ నుంచి ఓటీటీ వేదిక జీ5లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుండగా.. ఆ తర్వాత అక్టోబర్ 18వ తేదీ, ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు జీ తెలుగు ఛానెల్‌లో గ్రాండ్‌గా టెలివిజన్ ప్రసారం కాబోతోంది. ఓవైపు రామాయణంలో సీతగా ఆమె లుక్ అండ్ వైబ్స్ తెలుసుకోవాలనే ఇంట్రస్ట్, మరోవైపు జగపతిబాబు హోస్టింగ్‌తో వచ్చే ఫన్.. ఈ రెండూ కలిపి టెలివిజన్ చరిత్రలోనే సీజన్ 2 గ్రాండ్ ఓపెనింగ్‌కు పెద్ద మార్క్ వేయబోతున్నాయనడంలో నో డౌట్.

One-Sided Warnings : రిలేషన్‌షిప్‌లో ఒకరే అడ్జస్ట్ అవుతున్నారా..బంధాన్ని బర్నౌట్ చేసే 5 వన్ సైడెడ్ వార్నింగ్స్..

↑
Exit mobile version