Kalki 2 : ప్రభాస్ పక్కన నటించే గోల్డెన్ ఛాన్స్..కల్కి 2 మేకర్స్ బిగ్ ఆఫర్

Kalki 2 : మూవీ లవర్స్‌కు, యాక్టర్స్ కావాలనుకుని కలలు కంటున్నవారికి కల్కి 2 మూవీ మేకర్స్.. ఒక మైండ్ బ్లోయింగ్ సర్ ప్రైజ్ న్యూస్ అందించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడానికి, ప్రతిభ ఉన్న కొత్త నటీనటుల కోసం మేకర్స్ అఫీషియల్‌గా క్యాస్టింగ్ కాల్ అనౌన్స్ చేశారు.

Kalki 2

మూవీలలో యాక్ట్ చేయాలని , సిల్వర్ స్క్రీన్‌పై మెరవాలని చాలామందికి కోరిక ఉంటుంది. ఇలాంటివారికి డార్లింగ్, పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ యాక్ట్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్‌లో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ ఉందన్న వార్త పెద్ద పండుగే అని చెప్పొచ్చు.

రెండేళ్ల క్రితం థియేటర్లలో బాక్సాఫీస్ సునామీ క్రియేట్ చేసిన విజువల్ వండర్ కల్కి 2898 ఏడీ ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో మనందరికీ తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై రూపుదిద్దుకున్న ఈ సైన్స్ ఫిక్షన్ పిక్చర్ గ్లోబల్ వైడ్‌గా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి రికార్డుల దుమ్ము దులిపింది. బాలీవుడ్ బాద్‌ షా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ వంటి దిగ్గజాలతో పాటు బడా స్టార్స్ క్యామియో రోల్స్‌తో ఆడియన్స్‌కు నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది.

Kalki 2

ఇప్పుడు ఈ ప్రెష్టీజియస్ మూవీకి సీక్వెల్‌గా కల్కి 2(Kalki 2) తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ చాలా వేగంగా సాగుతుండగా, మేకర్స్ మూవీ లవర్స్‌కు, యాక్టర్స్ కావాలనుకుని కలలు కంటున్నవారికి ఒక మైండ్ బ్లోయింగ్ సర్ ప్రైజ్ న్యూస్ అందించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడానికి, ప్రతిభ ఉన్న కొత్త నటీనటుల కోసం మేకర్స్ అఫీషియల్‌గా క్యాస్టింగ్ కాల్ అనౌన్స్ చేశారు.

మీలో కనుక మంచి యాక్టింగ్ స్కిల్స్, ఆకట్టుకునే ఎక్స్‌ప్రెషన్స్ ఉంటే ఎలాంటి కండీషన్లు కూడా లేకుండా డైరెక్టుగా కల్కి పార్ట్ 2(Kalki 2)లో నటించే ఛాన్స్ కల్పిస్తున్నారు. ఈ అద్భుతమైన ఆఫర్‌ని ఒడిసి పట్టుకోవడానికి ఆసక్తి ఉన్నవారు తమ యాక్టింగ్ వీడియోలు, ప్రొఫైల్ వివరాలతో పాటు పోర్ట్‌ఫోలియోలను kalkiuniversecasting@gmail.com అనే ఈమెయిల్ ఐడీకి పంపించాల్సి ఉంటుంది.

Astrology : జాతకం ఎప్పుడు పడితే అప్పుడు చూపించకూడదా.. ఈ 4 సందర్భాల్లోనే చూపించాలా?

Exit mobile version