Kavya Maran And Anirudh : అనిరుధ్‌తో డెస్టినేషన్ వెడ్డింగ్.. ఐపీఎల్ క్రష్ కావ్య మారన్ కళ్యాణంపై క్రేజీ న్యూస్..

Kavya Maran And Anirudh : రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ బాస్, కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్‌..అతి త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Kavya Maran And Anirudh

సౌత్ ఫిలిం ఇండస్ట్రీతో పాటు ఐపీఎల్ వర్గాల్లో కూడా చాలా కాలంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న హాట్ టాపిక్‌కి ఫైనల్‌గా మైండ్ బ్లాకింగ్ ఆన్సర్ దొరికేసినట్లు అయింది. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్(Kavya Maran And Anirudh), సన్‌రైజర్స్ హైదరాబాద్ బాస్, కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్‌..అతి త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటివరకూ రెండు కుటుంబాలు సైలెంట్‌గా ఉన్నా ..తాజాగా గట్టు దాటిన ఒక వార్త ఈ పెళ్లి వ్యవహారాన్ని కన్ఫర్మ్ చేసేసింది.

సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్, ఆయన భార్య కావేరి మారన్‌లు అక్టోబర్ 16 వ తేదీన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి.. సీఎంను మర్యాదపూర్వకంగా కలిసారు. తమ కుమార్తె కావ్య మారన్, సంగీత దర్శకుడు అనిరుధ్‌ల వివాహ రిసెప్షన్ కార్డ్‌ను సీఎం రేవంత్ రెడ్డి దంపతుల చేతుల్లో పెట్టారు ఈ బిగ్ షాట్స్. నవంబర్ 21వ తేదీన చెన్నైలో జరగబోయే రాయల్ రిసెప్షన్‌కు తప్పనిసరిగా హాజరు కావాలని ఆత్మీయంగా ఆహ్వానించారు.

ఈ ఒక్క పిలుపుతో ఇప్పటివరకు వినిపించిన గుసగుసలన్నింటికి కూడా అధికారికంగా చెక్ పడినట్లయింది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్ ప్రకారం చూస్తే.. నవంబర్ 11వ తేదీన విదేశాల్లో.. ముఖ్యంగా గ్రీస్‌లోని అద్భుతమైన లొకేషన్‌లో వీళ్ల డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది.మొత్తంగా టాప్ మోస్ట్ సెలబ్రెటీలతో కావ్య మారన్-అనిరుధ్‌ల(Kavya Maran And Anirudh) డెస్టినేషన్ వెడ్డింగ్ సౌత్ ఇండియాలోనే అతిపెద్ద సెలబ్రిటీలతో కళ్యాణంగా నిలిచేలా కనిపిస్తుంది.

Slow Dating : డేటింగ్ యాప్‌ల కల్చర్‌కు చెక్.. ట్రెండ్‌లో స్లో డేటింగ్

↑
Exit mobile version