Madhuri Rathod : తనను మోసం చేశాడంటూ మాధురి కేసు..ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి పరారీ..

Madhuri Rathod : మాధురి రాథోడ్ .. ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయిపై స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ అడ్డం తిరిగింది.

Madhuri Rathod

యూట్యూబ్‌లో తెలుగు ఫోక్ సాంగ్స్‌ కోట్ల వ్యూస్‌తో దుమ్మురేపుతున్న సమయంలో..అదే ఇండస్ట్రీకి చెందిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ప్రైవేట్ లైఫ్ రచ్చకెక్కి సోషల్ మీడియాలో ఓ రేంజ్‌ డ్రామాకు తెరలేపిన విషయం తెలిసిందే.

కాగా ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రీసెంట్‌గా ఈ రచ్చ పీక్స్‌కి చేరింది. మాధురి రాథోడ్ .. ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయిపై స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ అడ్డం తిరిగింది. అయితే తనపై కేసు నమోదు కావడంతో ఈశ్వర్ సాయి పరారవ్వగా, అతడిని పట్టుకోవడానికి 2 ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

గత నెల ఆగస్టు 22న నార్సింగి పోలీస్ స్టేషన్‌లో మాధురి రాథోడ్ రిటెన్ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పెళ్లి చేసుకుంటానని తనను నమ్మించి శారీరకంగా వాడుకుని, ఇప్పుడు మోసం చేశాడని ఆమె ఆరోపిస్తూ కంప్లైంట్ చేసింది.

కాగా ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈశ్వర్ సాయి, మాధురి కలిసి ఒకే గదిలో ఉండగా.. ఈశ్వర్ సాయి భార్య శరణ్య అక్కడికి వెళ్లి హడావుడి చేయడం సంచలనం సృష్టించింది. ఈ తతంగం అంతా వీడియోలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో చాలా వైరల్ అయింది.

Madhuri Rathod

పెళ్లి అయి ఒక బాబు కూడా ఉన్న ఈశ్వర్ సాయి, తన సహనటితో ఉండగా.. శరణ్య వారిని నిలదీయడంపై కొంతమంది సపోర్ట్ చేయగా..మరి కొంతమంది మాత్రం ఇది కరెక్ట్ కాదంటూ మాధురి సైడ్ నిలబడ్డారు. అంతా కలిసి మాధురి జీవితంతో ఆడుకున్నారంటూ మద్దతు ఇచ్చారు. అలా అని మాధురి తప్పు కూడా ఉందని కాకపోతే పరిష్కరించుకునే విధానం ఇది కాదంటూ.. సోషల్ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వారు ఇంటర్వ్యూలు, కామెంట్లతో హడావుడి కూడా చేశారు.

అయితే తామిద్దరూ ఉన్న గదిలోని శరణ్య హఠాత్తుగా ఎంటర్ అవడంతో షాక్ అయినట్లు సైలెంట్‌గా ఉండిపోయిన మాధురి..ఆ తర్వాత ఈశ్వర్ తనను మోసం చేశాడని కేసు నమోదు చేసింది. దీంతో ఈ ఇష్యూ ఫోక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. భార్య శరణ్య ఆరోపణలు, మాధురి పెట్టిన లీగల్ కేసులతో తప్పించుకుని తిరుగుతున్న ఈశ్వర్ సాయి బయటకు వస్తే..ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి మరి.

Gold – Silver : తగ్గినట్లే తగ్గి మళ్లీ రివర్స్ గేర్ వేసిన గోల్డ్.. పాతాళానికి పడిపోతున్న వెండి..

Exit mobile version