Mega Heros : ముగ్గురు మెగా హీరోలు..రూ.900 కోట్ల వసూళ్లు

Mega Heros : మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్ వరుసగా ఓజీ, శంకర వరప్రసాద్, పెద్ది చిత్రాలతో భారీ హిట్లు అందుకుని కలెక్షన్ల వర్షం కురిపించారు.

Mega Heros

టాలీవుడ్ లో కొంతకాలంగా బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధించిన చిత్రాలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. చిన్న సినిమాలే హిట్ కొడుతున్నాయి… భారీ బడ్జెట్ తో తీసిన పెద్ద హీరోల సినిమాలు అనుకున్న రీతిలో సక్సెస్ కావడం లేదన్నది విమర్శకుల వాదన. అయితే ఈసారి పెద్ద హీరోలు కూడా మళ్లీ హిట్ బాటలోకి వచ్చారు.

అది కూడా టాలీవుడ్ మెగా ఫ్యామిలీ నుంచే ముగ్గురు టాప్ హీరోలు(Mega Heros) సూపర్ హిట్స్ తో కలెక్షన్ల వర్షం కురిపించారు. గత ఏడాది ఓజీ మూవీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారుతో మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు పెద్ది చిత్రంతో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హిట్టు కొట్టారు. కేవలం హిట్లు కొట్టడమే కాదు కలెక్షన్స్ తోనూ రికార్డులు సృష్టించారు.

ఈ మూడు చిత్రాలూ రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో అంటే రూ.900 కోట్లు రాబట్టాయి. దీంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సంబరాలకు నాంది పలికింది మాత్రం పవన్ కళ్యాణే. చాలా కాలంగా రాజకీయాలు ఒకవైపు, సినిమాలు ఒకవైపు చేస్తూ బిజీగా ఉంటున్న పవర్ స్టార్ నుంచి మంచి హిట్ వచ్చి చాలారోజులైంది. అలాంటి టైం లో స్టైలిష్ డైరెక్టర్ సుజీత్ ‘ ఓజీ’ ని తెరకెక్కించి పవన్ అభిమానుల ఆకలి తీర్చేశాడు. పవన్ హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేస్తూ తీసిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్లు వసూలు చేసింది.

తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి సందడి చేశారు. సంక్రాంతినే తన సక్సెస్ కు చిరునామాగా మార్చుకున్న క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకరవరప్రాద్ గారు మూవీతో అభిమానులను అలరించారు. ఈ చిత్రంలో వింటేజ్ చిరుని చూసి అభిమానులు సంక్రాంతిని మరింత ఉత్సాహంతో సెలబ్రేట్ చేసుకున్నారు.

Mega Heros

ఈ మూవీ కూడా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు మెగాస్టార్ వారసుడిగా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ తేజ్ అదే జోష్ ను కంటిన్యూ చేశాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తెరకెక్కించిన పెద్ది మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది.

స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన పెద్ది మూవీలో రామ్ చరణ్ నటనకు మరోసారి అందరూ ఫిదా అయ్యారు. ఈ చిత్రం విడుదలకు ముందే చెర్రీ చెప్పినట్టు రామ్ చరణ్ లైబ్రరీలో ఇదే బెస్ట్ మూవీగా మిగిలిపోయింది. తొలిరోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న పెద్ది కేవలం వారం రోజుల్లోనే రూ.315 కోట్లు వసూలు చేసింది. దీంతో ముగ్గురు మెగా హీరోల(Mega Heros) మూవీస్ రూ.300 కోట్ల క్లబ్ లో చేరినట్టయింది. దీంతో ఇదీ మెగా ఫ్యామిలీ సత్తా అంటూ మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.

Director Bharathiraja : భారతీయ సినీపరిశ్రమలో విషాదం..దర్శకుడు భారతీరాజా కన్నుమూత

Exit mobile version