The Paradise Review : ది ప్యారడైజ్ రివ్యూ.. నాని మాస్ విధ్వంసం వర్కవుట్ అయిందా?

The Paradise Review : ప్రీమియర్ షోల నుంచే సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్న ది ప్యారడైజ్ మూవీ ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో మెప్పించింది? నాని అకౌంట్‌లో మరో ఊరమాస్ బ్లాక్‌బస్టర్ పడిందా లేదా?

The Paradise Review

దసరా మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబో నుంచి మరో మూవీ వస్తోందంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో అందరికీ తెలిసిందే. అదే అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా రో రస్టిక్ యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్ గ్రాండ్‌గా రిలీజైంది . ప్రీమియర్ షోల నుంచే సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్న ఈ మూవీ అసలు ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో మెప్పించింది? నాని అకౌంట్‌లో మరో ఊరమాస్ బ్లాక్‌బస్టర్ పడిందా లేదా అనేది ఈ రివ్యూ(The Paradise Review)లో చూద్దాం.

స్టోరీ లైన్ విషయానికి వస్తే.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా కూడా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే సవారి అనే తెగకు మాత్రం ఆ ఫ్రీడమ్ దక్కదు. షికింజా మాలిక్ (మోహన్ బాబు) అనే వ్యక్తి డామినేషన్ కింద ఈ తెగ ప్రజలు తమ గుర్తింపును కూడా కోల్పోయి బానిసలుగానే బతుకుతుంటారు.

ఇదే సమయంలో తమ జాతి హక్కులు, గుర్తింపు కోసం సమ్మక్క (సోనాలి కులకర్ణి) అక్కడ పోరాటం చేస్తూ ఉంటుంది. అయితే ఒక హత్య కేసు వల్ల సమ్మక్క కొడుకు జడల్ (నాని) 14 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవిస్తాడు. తన తల్లి తప్పు చేసిందని అనుకుంటూ ఆమెపై కోపంతో దూరంగా ఉంటాడు జడల్. కానీ జైలు నుంచి జడల్ బయటకు వచ్చాక, తన జాతి కోసం తల్లి చేసిన అసలైన త్యాగం ఏంటో అర్థమవుతుంది.

ఇదే టైమ్‌లో మాలిక్ కొడుకు విక్రమ్ మాలిక్ (రాఘవ్ జుయల్) తో జడల్‌కు గొడవ జరిగి..చివరకు ఆ రచ్చ ముదిరి పెద్ద మాలిక్ వరకు వెళ్తుంది. ఆ తర్వాత సవారీల సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం జరిగిన పోరాటం ఎలాంటి టర్న్ తిరిగింది? ఈ వార్‌లో జడల్ తన తెగకు గుర్తింపు తెచ్చాడా లేదా అనేది స్టోరీ.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెలను తన టీమ్ ముద్దుగా మెంటలోడు అని ఎందుకు పిలుచుకుంటారో ఫస్టాఫ్ చూస్తే కచ్చితంగా అర్థమవుతుంది. ఫస్టాఫ్‌లో మేకింగ్, షాట్ టేకింగ్ వేరే లెవెల్‌లో ఉంటాయి. మొదటి 15 నిమిషాల నుంచే స్టోరీలోకి తీసుకెళ్లిన విధానం, నాని మాస్ ఎంట్రీ, విజువల్స్ అన్నీ కూడా నాని ఎంటైర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ ఇది అని అనిపించేలా సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతాయి. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అభిమానులలో పూనకాలు తెప్పిస్తుంది.

కానీ సెకండాఫ్‌కి వచ్చేసరికి డైరెక్టర్ కాస్త దారి తప్పాడనే చెప్పొచ్చు. ఫస్టాఫ్‌లో బిల్డ్ చేసిన రా ఎమోషన్‌ అంతా సెకండాఫ్‌లో కంటిన్యూ చేయలేకపోయారు. అవసరం లేని పొలిటికల్ యాంగిల్స్ జొప్పించడం, క్లైమాక్స్‌ను పూర్తిగా పొలిటికల్ చేసేయడంతో అసలైన సవారీల పోరాటంలో ఉండాల్సిన ఎమోషన్ మొత్తం మిస్ అయిపోయింది.

యాక్టర్స్ విషయానికి వస్తే నాని జడల్ రోల్‌లో ప్రాణం పెట్టేశాడనే చెప్పాలి. డైరెక్టర్ విజన్‌కి తగ్గట్లు కంప్లీట్ మేకోవర్‌తో యాక్షన్ ఇరగదీసాడు. కలెక్షన్లు రాబట్టుకోవడంలో తన వంతు హండ్రెడ్‌కు హండ్రెడ్ పర్సంట్‌ పూర్తి న్యాయం చేశాడు. ఇక వింటేజ్ మోహన్ బాబుని స్క్రీన్ మీద చూడటం ఈ మూవీకి బిగ్గెస్ట్ అసెట్ అనే అనొచ్చు. రాఘవ్ జుయల్ విలనిజంతో ఆకట్టుకోగా, తల్లి పాత్రలో సోనాలి కులకర్ణి జీవించేసింది. కయాదు లోహర్, బిరియాని పాత్రలో సంపూర్ణేష్ బాబు, తనికెళ్ల భరణి, ఈశ్వరి రావు తమ రోల్స్‌కు పూర్తి న్యాయం చేశారు.

The Paradise Review

టెక్నికల్ సైడ్ చూస్తే ఈ మూవీకి రియల్ హీరో అనిరుధ్ రవిచందర్ అనే అనాలి. తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్‌తో మూవీని వేరే లెవెల్‌కి తీసుకెళ్లాడు. ముఖ్యంగా ‘ఆయా షేర్’ సాంగ్ వచ్చేటప్పుడు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. చాలాచోట్ల పడిపోతున్న సీన్లను తన మ్యూజిక్‌తోనే అనిరుధ్ కాపాడాడని చెప్పొచ్చు.

టోటల్‌గా చెప్పాలంటే ది ప్యారడైజ్ ఆత్మగౌరవ గుర్తింపు కోసం సాగే ఒక పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ డ్రామా. సెకండాఫ్‌లో పేసింగ్ తగ్గినా, గ్రాండ్ ఫస్టాఫ్, నాని,మోహన్ బాబు యాక్షన్, అనిరుధ్ మ్యూజిక్ కోసం మాస్ ఆడియన్స్ తప్పక చూడాల్సిన మూవీ ఇది. శ్రీకాంత్ ఓదెల సెకండాఫ్‌పై మరికొంచెం కాన్‌సన్‌ట్రేట్ చేసి ఉంటే ఇది దసరాను మించిన సంచలనం అయ్యేదన్న(The Paradise Review) టాక్ నడుస్తోంది.

https://twitter.com/UnanimousCut/status/2102811118351847767

 

 

Re-Connect Old Bonds : కట్ అయిన పాత బంధాలను రీ-కనెక్ట్ చేసుకోవాలా? ఈ 5 బెస్ట్ రూట్స్ ఫాలో అవ్వండి..

 

Exit mobile version