Nithin :సక్సెస్ కోసం నితిన్ మాస్టర్ ప్లాన్.. వరుస సినిమాలతో బాక్సాఫీస్‌పై దండయాత్ర

Nithin : 23 ఏళ్ల క్రితం జయం సినిమాతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన నితిన్, ఆ తర్వాత దిల్ , సై మూవీలతో మాస్ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు.

Nithin

హీరో నితిన్ తన కెరీర్‌లో క్రూషియల్ స్టేజ్‌లో ఉన్నాడనే చెప్పొచ్చు. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకుపోయిన నితిన్, కొంతకాలంగా సరైన హిట్ పడక ఇబ్బంది పడుతున్నాడు. చెక్ మూవీ నుంచి మొదలుపెడితే ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ వరకు బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాలను ఇవ్వలేకపోయాయి.

గతేడాది భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన తమ్ముడు, రాబిన్ హుడ్ మూవీ కూడా డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. దీంతో నితిన్ మార్కెట్ కాస్త డల్ అయింది. ఇలాంటి టైమ్‌లో ఎలాగైనా ఒక సాలిడ్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్‌లోకి రావడానికి నితిన్ గట్టి పట్టుదలతో ఉన్నాడు. అందుకే తన నెక్స్ట్ ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. కేవలం స్టోరీల మీద మాత్రమే కాకుండా, టాలెంటెడ్ డైరెక్టర్ల సెలెక్షన్ లో కూడా తన మార్క్ చూపిస్తున్నాడు.

ప్రస్తుతం నితిన్ (Nithin) ఒక ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీలో నటిస్తున్నాడు. విభిన్నమైన కాన్సెప్టులతో సినిమాలు తీసే టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ ఈ మూవీకి డైరెక్షన్ చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ న్యూ వెర్షన్ నితిన్ కెరీర్‌కు కచ్చితంగా ఒక బూస్ట్ ఇస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఒకవైపు జరుగుతుండగానే, నితిన్ మరో రెండు క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అందులో ఒక ప్రాజెక్ట్‌లో రీసెంట్‌గా ఆయ్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న అంజి డైరెక్షన్‌లో ఉండబోతోంది. ఈ మూవీని నితిన్ తన సొంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌లోనే నిర్మిస్తున్నాడు. జూలై నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో నిలపాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది కాకుండా మరో కొత్త డైరెక్టర్‌తో కూడా మూవీ చేయడానికి నితిన్ రెడీ అయ్యాడు. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతోంది.

Nithin

నితిన్ కెరీర్ చూస్తే స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడూ ఒడిదుడుకులతోనే సాగుతోంది. 23 ఏళ్ల క్రితం జయం సినిమాతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన నితిన్, ఆ తర్వాత దిల్ , సై మూవీలతో మాస్ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ఆ తర్వాత వరుసగా ఫ్లాపులు పడటంతో కెరీర్ క్లోజ్ అనుకున్న టైమ్‌లో ఇష్క్ సినిమాతో గ్రాండ్‌గా కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత గుండె జారి గల్లంతయ్యిందే, అ ఆ, భీష్మ వంటి మూవీలతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు.

కానీ ఇప్పుడు మళ్లీ అరడజను ఫ్లాపులు పడటంతో నితిన్ కెరీర్ కష్టాల్లో పడింది. బలగం వేణు డైరెక్షన్‌లో రావాల్సిన ఎలమ్మ మూవీ నుంచి కూడా నితిన్ (Nithin)తప్పుకోవడంతో ఇప్పుడు చేయబోయే సినిమాలే నితిన్‌కు చాలా కీలకం కాబోతున్నాయి. మరి ఈ సైన్స్ ఫిక్షన్ మూవీతో పాటు ఆయ్ డైరెక్టర్‌తో చేసే ప్రాజెక్టులు.. నితిన్‌కు మళ్లీ హిట్ ఇచ్చి బాక్సాఫీస్ దగ్గర తన పవర్ చూపిస్తాయేమో చూడాలి.

Body Heat:సమ్మర్ డ్రింక్స్.. ఒంటి వేడిని తగ్గించే అద్భుతమైన పానీయాలు

Exit mobile version