OTT
మూవీ లవర్స్ కోసం మరో క్రేజీ వీకెండ్ వచ్చేసింది. ఈ వారం అటు థియేటర్లలోనూ, ఇటు ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్‌లోనూ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆడియన్స్‌ను అలరించడానికి రెడీ అయింది. థియేటర్ల విషయానికి వస్తే సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి హనుమాన్ త్రీడీ రాబోతుండగా.. యూత్‌ను టార్గెట్ చేస్తూ ..పెళ్లైంది కానీ నో కహానీ వంటి స్ట్రెయిట్ తెలుగు సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.
వీటితో పాటు కాన్ సిటీ, సూపర్ గర్ల్ వంటి ఆసక్తికరమైన డబ్బింగ్ సినిమాలు కూడా వెండితెరపై తమ లక్‌ను పరీక్షించుకోబోతున్నాయి. ఇక డిజిటల్ స్క్రీన్లపై ఇంటిల్లపాదిని అలరించడానికి ఏకంగా 21 కి పైగా మూవీలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ(OTT) బాట పట్టాయి.
వాటిలో మోస్ట్ అవేటెడ్ అవతార్ 3, బ్లాస్ట్ మూవీలతో పాటు లింగం అనే సరికొత్త డబ్బింగ్ సిరీస్‌పై డిజిటల్ ఆడియన్స్‌లో బాగానే అంచనాలున్నాయి. అలాగే బాహుబలి ది టార్చ్ బేరర్ రానుండగా, హౌస్ ఆఫ్ ద డ్రాగన్ వంటి సెన్సేషనల్ సిరీస్ ఈ వీక్ ఆడియన్స్‌నను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ముందుగా ఓటీటీ(OTT) దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ విషయానికి వస్తే, నేటి నుంచి అంటే జూన్ 24 నుంచే ఇంగ్లీష్ సిరీస్ అంటే ప్రాణాలిచ్చే వారి కోసం అనదర్ లైఫ్ సీజన్ 3 తో పాటు ఇన్ ది హ్యాండ్ ఆఫ్ డంటే అనే హాలీవుడ్ మూవీ సందడి చేస్తుంది.
ఇక యాక్షన్ ఎంటర్టైనర్లను బాగా ఇష్టపడే తెలుగు ఆడియన్స్ కోసం జూన్ 25న బ్లాస్ట్ అనే డబ్బింగ్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. జూన్ 26న హాలీవుడ్ మూవీస్ క్రిస్ & మార్టినా, లిటిల్ బ్రదర్‌తో పాటు తెలుగు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాహుబలి ది టార్చ్ బేరర్ అనే స్పెషల్ డాక్యుమెంటరీ రిలీజ్ కాబోతోంది. వీటితో పాటు బాలీవుడ్ కంటెంట్ ఇష్టపడే వారి కోసం జూన్ 27 నుంచి లాక్ అప్ సీజన్ 2 హిందీ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కాబోతోంది.
మరోవైపు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కూడా ఈ వీక్ అదిరిపోయే లైనప్‌తో రెడీ అయిపోయింది. ఇప్పటికే జూన్ 22 నుంచి ది ఏజెన్సీ సీజన్ 2 ఇంగ్లీష్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుండగా, గ్లోబల్ విజువల్ వండర్ అవతార్ 3 తెలుగు డబ్బింగ్ వెర్షన్ జూన్ 24 నుంచి అందుబాటులోకి వచ్చేసింది. ఇక సస్పెన్స్, క్రైమ్ ఎలిమెంట్స్‌తో ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తున్న లింగం.. తెలుగు డబ్బింగ్ సిరీస్ జూన్ 26 నుంచి డిజిటల్ ఆడియన్స్‌ను పలకరించబోతోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో విషయానికి వస్తే, వరల్డ్ వైడ్ ఫేమస్ సిరీస్ హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 3.. తెలుగు డబ్బింగ్ వెర్షన్ జూన్ 22 నుంచే స్ట్రీమింగ్ అవుతూ టాప్ ట్రెండింగ్‌లో కంటిన్యూ అవుతుంది. దీంతో పాటు జూన్ 23 వ తేదీ నుంచి గ్రామ చికిత్సాలయ్ సీజన్ 2 తెలుగు డబ్బింగ్ సిరీస్ అందుబాటులోకి రాగా.. జూన్ 26 వ తారీఖు నుంచి అలియన్స్ అనే హిందీ సిరీస్ రిలీజ్ అవబోతోంది.
ఇక రీజినల్ కంటెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే జీ5 ప్లాట్‌ఫారమ్‌లో జూన్ 26న లోకల్ లాంగ్వేజ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. మరాఠీలో ప్రేమలా కండీషన్స్ అప్లై, తమిళంలో మంబట్టియన్ స్టార్స్ , మలయాళంలో ముతస్సీ అనే 3 ఇంట్రెస్టింగ్ సిరీస్‌లు ఒకే రోజు సందడి చేయబోతున్నాయి.
వీటితో పాటు సోనీ లివ్ ఓటీటీ(OTT)లో జూన్ 26 నుంచి ఫెర్ఫెక్ట్ ఫ్యామిలీ అనే హిందీ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. అలాగే లయన్స్ గేట్ ప్లేలో హాలీవుడ్ సినిమాలు, సిరీస్‌ల లవర్స్ కోసం జూన్ 26న ‘బ్లూ జాస్మిన్’, ‘ద యెతి’ సినిమాలతో పాటు దిస్ ఈజ్ నాట్ ఏ మర్డర్ మిస్టరీ అనే క్రేజీ ఇంగ్లీష్ సిరీస్ రిలీజ్ అవుతున్నాయి.
చివరిగా మలయాళ కంటెంట్‌ను ఇష్టపడే వాళ్ల కోసం మనోరమ మ్యాక్స్ ఓటీటీలో జూన్ 25 కప్ అనే మలయాళ మూవీ అందుబాటులోకి రాబోతోంది. కాబట్టి ఈ వీకెండ్‌లో థియేటర్లలో పెద్ద స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునే వాళ్లకు, ఇంట్లోనే కూల్‌గా ఓటీటీ కంటెంట్ చూడాలనుకునే వారికి కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ రెడీగా ఉంది.
Glamping Tourism : గ్లాంపింగ్ టూరిజం.. ప్రకృతి ప్రేమికులను పిచ్చెక్కిస్తున్న ట్రావెల్ ట్రెండ్..
