Ram Charan
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ పెద్ది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి స్టేజ్ కు వచ్చేసింది. తాజాగా రామచరణ్(Ram Charan) పుట్టినరోజు సందర్భంగా పెద్ది మూవీ టీమ్ అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఇన్నాళ్లూ పెద్ది మూవీలో చెర్రీ క్రికెటర్ రోల్ లో కనిస్తున్నాడని అంతా అనుకున్నారు.
అయితే ఊహించని విధంగా రామ్ చరణ్(Ram Charan) అసలు రోల్ ఏంటనేది తెలిసింది. ఈ మూవీలో చెర్రీ కుస్తీ వీరునిగా కనిపించబోతున్నాడు. పెద్ది పహిల్వాన్ గ్లింప్స్ పేరుతో మేకర్స్ వీడియో రిలీజ్ చేశారు. దీనిలో మల్లయోధుడిలా రామ్ చరణ్ గెటప్ అదిరిపోతోంది. కుస్తీ కోసం తీసుకుంటున్న శిక్షణ, ప్రత్యర్థితో మల్లయుద్ధం కోసం చెర్రి బరిలోకి దిగే తీరు గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
కుస్తీ అంటే బంతితో బ్యాట్ కు ఎదురెళ్లే ఆట కాదురా… పాణంతో సావుకు ఎదురెళ్లే ఆట అంటూ డైలాగ్ వినిపిస్తుండగా గ్లింప్స్ లో రామ్ చరణ్ ఎంట్రీ అదిరిపోయింది. ఈ పాత్ర కోసం చరణ్ తన బాడీని ఏ విధంగా మార్చుకున్నాడనేది స్పష్టంగా తెలుస్తోంది. కండలు తిరిగిన దేహంతో రామ్ చరణ్ లుక్ మరో లెవల్ లో ఉంది.
గదతో చరణ్ చేసిన విన్యాసాలు వారెవ్వా అనిపిస్తున్నాయి. చూడమ్మి ఆటే నా పొగరు అంటూ చివర్లో చెర్రీ చెప్పిన డైలాగ్ ఈ గ్లింప్స్ కే హైలైట్ గా నిలిచింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో పెద్ది సినిమా గ్లింప్స్ ను విడుదల చేశారు.
ఇప్పటివరకూ విడుదల చేసిన గ్లింప్స్, వీడియోలు, ఫొటోల్లో రామ్ చరణ్ బ్యాట్ తోనే కనిపించాడు. దీంతో క్రికెటర్ గా కనిపిస్తున్నాడేమోనని అందరూ అనుకోగా.. ఇప్పుడు కుస్తీ యోధుడిగా ఊహించని ట్విస్ట్ ఇచ్చింది మూవీ యూనిట్. ఈ మూవీ అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచీ భారీ అంచనాలు వచ్చేశాయి.
దానికి తగ్గట్టే ఒక్కొక్క వీడియో , గ్లింప్స్ వంటివి వాటిని మరింతగా పెంచేశాయి. ఈ క్యారెక్టర్ కోసం రామ్ చరణ్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తన బాడీని మార్చుకున్న చరణ్ అభిమానులకు అదిరిపోయే లుక్ ఇచ్చాడంటున్నారు.జాన్వీ కపూర్ హీరోయిన్ గా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న పెద్ది మూవీ ఏప్రిల్ 30, 2026న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Happy Sri Rama Navami 🏹✨
Here is the #PeddiPehelwanGlimpse
▶️ https://t.co/ykcGvYuFHj#Peddi pic.twitter.com/QhXvhOJDPA— Ram Charan (@AlwaysRamCharan) March 27, 2026
Dhurandhar 2 : పాక్ ను వణికిస్తున్న ధురంధర్…బట్టలిప్పి తనిఖీలు చేస్తున్న వైనం
