Ram Charan : వారసత్వ విమర్శల నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి.. చెర్రీ పెర్ఫార్మెన్స్ గురించి వాళ్లేమంటారు?

Ram Charan : మెగాస్టార్ వారసుడు అనే ఒకే ఒక్క ట్యాగ్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అప్పటి రామ్ చరణ్ ఎక్కడ?

Ram Charan

బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేటను కొనసాగించడం వేరు..ఒక నటుడిగా ప్రేక్షకుల గుండెలు పిండేసి సాష్టాంగ నమస్కారం చేయించుకోవడం వేరు. ఇప్పుడు రామ్ చరణ్ విషయంలో ఇదే జరుగుతుంది.

ఒకప్పుడు మెగాస్టార్ వారసుడు అనే ఒకే ఒక్క ట్యాగ్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అప్పటి రామ్ చరణ్(Ram Charan) ఎక్కడ? ముఖంలో ఏ ఎక్స్ ప్రెషన్సూ పలకవు, అసలు యాక్షనే రాదంటూ విమర్శించిన వాళ్ల నోటితోనే ఈరోజు గ్లోబల్ మ్యాప్‌లో టాలీవుడ్ జెండాను పాతేసేలా చేసిన ఈనాటి గ్లోబల్ స్టార్ ఎక్కడ?

రంగస్థలంలో చిట్టిబాబుగా యాక్టింగ్ పవర్ చూపించి.. ఆర్‌ఆర్‌ఆర్‌లో అల్లూరిగా రౌద్ర రసం కురిపించిన రామ్ చరణ్(Ram Charan).. ఇప్పుడు పెద్ది సినిమాతో అసలు సిసలైన నట విశ్వరూపం అంటే ఏంటో ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేశాడు.

కోట్లాది మంది మాస్ ఫ్యాన్స్ ఇమేజ్‌ను, బాక్సాఫీస్ లెక్కలను పూర్తిగా పక్కన పెట్టేసి, కేవలం బుచ్చిబాబు సానా చెప్పిన కథను నమ్మి చరణ్(Ram Charan) చేసిన ఈ డేరింగ్ అటెంప్ట్ ఓ ఎత్తయితే.. పెద్దిగా చరణ్ యాక్షన్‌ను చూసిన వాళ్లంతా అబ్బబ్బా ఏం చేశాడురా అంటూ చెర్రీని ఆకాశానికి ఎత్తేయడం మరో ఎత్తుగా నిలుస్తుంది.

టాలీవుడ్ హీరోలంతా కేవలం రొటీన్ ఫైట్లు, కలర్‌ఫుల్ సాంగులకే పరిమితం అవుతారని, క్యారెక్టర్ కోసం మట్టిలో దొర్లే దమ్ము కేవలం పక్క రాష్ట్రాల హీరోలకే ఉంటుందని సోషల్ మీడియాలో లెక్చర్లు ఇచ్చే ప్రతి ఒక్క మేధావి మైండ్ బ్లాక్ అయిపోయే రేంజ్‌లో చెర్రీ పెర్ఫార్మెన్స్ సాగింది.

పెద్ది సినిమాలోని మూడు విభిన్నమైన పాత్రల కోసం రామ్ చరణ్ తన బాడీని మార్చుకోవడానికి పడ్డ కష్టం స్క్రీన్ మీద కనిపిస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఢిల్లీ వీధుల్లో ఒక సాధారణ చెరుకురసం బండి దగ్గర పనిచేసే సీన్లలో చెర్రీ కనిపించే సమయంలో.. అసలు చరణ్ ఒక గ్లోబల్ స్టార్ అనే విషయం కూడా గుర్తుకు రాదు.

కుస్తీ పోటీల కోసం బురదలో, మట్టిలో ప్రాణం పెట్టి చేసిన ఫైట్స్‌తో చెర్రీ థియేటర్లలో పూనకాలు తెప్పించాడు. హాస్పిటల్‌లో డాక్టర్ కాళ్లు పట్టుకునే అత్యంత ఎమోషనల్ సీన్ చూసి ఎలాంటివాళ్లకయినా కంట్లో నీళ్లు తిరగాల్సిందే .

ఇక ప్రీ క్లైమాక్స్‌లో కాలుకు సంబంధించిన సీన్స్ చూస్తుంటే థియేటర్లలో ప్రతీ ఒక్కరికీ నరాలు తెగేంత వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. కేవలం తన కళ్లలోని హావభావాలతోనే ఆడియన్స్ చేత కన్నీళ్లు పెట్టించాడంటే రామ్ చరణ్ యాక్షన్‌కు ఎవరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

ఒకప్పుడు వారసత్వంతోనే వచ్చాడన్నవాళ్ల నోళ్లతోనే.. ఈరోజు తెలుగు సినిమా గర్వించదగ్గ యాక్టర్ రామ్ చరణ్ అని అనిపించుకున్నాడు మెగా పవర్ స్టార్. అందుకే యాంటీ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు చెర్రీ యాక్టింగ్ పవర్‌కు దాసోహం అంటున్నారు.

Ram Charan

ఈ సినిమాలో ఐటెం సాంగ్, మరికొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్, జాన్వీ కపూర్ యాక్షన్ వంటి చిన్నచిన్న మైనస్‌లు ఉన్నా.. చరణ్ చేసిన ఈ మైండ్ బ్లోయింగ్ ప్రయత్నాన్ని నెగిటివ్ ప్రచారాలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాల్సిందే.

ఎందుకంటే ఇప్పుడు మన టాలీవుడ్‌కి, థియేటర్ల ఇండస్ట్రీకి పెద్ది లాంటి ఒక భారీ బ్లాక్‌బస్టర్ విజయం అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే మన ఇండస్ట్రీ నుంచి ఇలాంటి సరికొత్త చిత్రాలు మరిన్ని వస్తాయి. అలాగే వేరే ఇండస్ట్రీలో హీరోలు చేసిన యాక్షన్‌ను ఆహా , ఓహో అని పొగిడేసే మన హీరోలు, దర్శకులు చరణ్‌ను ఏ రేంజ్‌లో పొగుడుతారో చూడాలి మరి.

Mount Kailash :కైలాస పర్వతాన్ని నేటికీ ఎవరూ ఎందుకు ఎక్కలేకపోయారు? ఆధ్యాత్మిక కారణాలేం చెబుతున్నాయ్?

Exit mobile version