Rashmika
టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక(Rashmika) మందన్న ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అయితే వీరి పెళ్లి సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను.. ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రష్మిక(Rashmika) ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ముఖ్యంగా హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఐటీసీ మెమెంటోస్ హోటల్‌లో.. ఫిబ్రవరి 26న వీరిద్దరి వివాహం అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.తమ పెళ్లి వరకు తమ బంధాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచిన ఈ విజయ్ – రష్మిక జంట, ఇప్పుడు తమ పెళ్లికి సంబంధించిన ప్రతి మధుర జ్ఞాపకాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు.
హల్దీ వేడుక ఫోటోలను షేర్ చేసిన రష్మిక .. తమ హల్దీ రోజు కేవలం పసుపు పూసుకోవడం తోనే, ఆ వేడుక హోలీ పండగలా మారిపోయిందని చెప్పుకొచ్చారు. అందరూ రంగుల్లో తడిసి ముద్దయ్యామని చెప్పిన నేషనల్ క్రష్ ఆరోజు జరిగిన ఆటల్లో తానే గెలిచానని గుర్తు చేసుకుని మురిసిపోతూ చెప్పారు.
విజ్జూ కూడా తన టీమ్‌లోనే ఉన్నాడని చెప్పిన రష్మిక.. అయితే తన జుట్టుకు అంటుకున్న రెడ్ కలర్ ఇప్పటికీ పోలేదని ఆమె సరదాగా పోస్ట్ పెట్టారు. అలాగే ఉదయ్‌పూర్ హోటల్ సిబ్బంది అందించిన సర్వీసులను కూడా ఆమె స్పెషల్‌గా మెచ్చుకున్నారు. మా కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైందంటూ ఎంతో ప్రేమగా సోషల్ మీడియాలో పంచుకున్నారు రష్మిక.
మరోవైపు విజయ్ దేవరకొండ కూడా తన మనసులోని మాటను అంతే అందంగా పంచుకున్నారు. మన దేశంలోనే, అది కూడా అందమైన అవుట్‌డోర్ లోకేషన్‌లో మ్యారేజ్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే .. ఉదయ్‌పూర్‌ను ఎంచుకున్నానని విజయ్ తెలిపారు. తమ పెళ్లిలో హల్దీ వేడుకలో కుటుంబ సభ్యులతో కలిసి గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని విజయ్ అన్నారు.
కాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం ఫిబ్రవరి 26న తెలుగు , కొడవ సంప్రదాయాల ప్రకారమే జరిగింది. ఆ తర్వాత మార్చి 4న హైదరాబాద్‌లో పొలిటికల్ , సినీ సెలబ్రెటీల కోసం భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఈ కొత్త జంట పెళ్లి హడావుడి ముగించుకుని తిరిగి షూటింగ్‌లలో బిజీ అయిపోయారు.
గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న రణబాలి మూవీపై ఫ్యాన్స్ ఇప్పటికే ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసుకున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా 2027 వినాయక చవితి కానుకగా రిలీజయ్యే అవకాశముంది.
