Ravana Tandavam : రామాయణ నుంచి రావణ తాండవం గ్లింప్స్.. ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్స్ క్రేజీ కాంబో..

Ravana Tandavam : రామాయణ మూవీ నుంచి రావణుడిగా యశ్ నటించిన రావణ తాండవం సాంగ్ గ్లింప్స్ రిలీజ్ అయింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌లో దేవీశ్రీప్రసాద్, అనిరుధ్, జీవీ ప్రకాష్ పాడిన ఈ పవర్ ఫుల్ పాట పాడటం హైలైట్‌గా నిలిచింది.

Ravana Tandavam

ఇండియన్ మూవీ హిస్టరీలోనే అత్యంత భారీ క్రేజీ కాంబినేషన్‌కు ‘రామాయణ’ చిత్రం వేదికగా మారింది. బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ మైథలాజికల్ వండర్ నుంచి తాజాగా రిలీజ్‌ అయిన ట్రైలర్‌లో రావణాసురుడిగా కేజీఎఫ్ స్టార్ యశ్ మేకోవర్, డైలాగ్ డెలివరీ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ మూవీ నుంచి రైజ్ ఆఫ్ అసుర పేరుతో ‘రావణ తాండవం'(Ravana Tandavam) సాంగ్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేయగా, అందులో వాడిన మ్యూజికల్ కాంబో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ అద్భుతమైన ట్యూన్ అందించిన ఈ పవర్‌ఫుల్ సాంగ్‌ను సౌత్ ఇండియాకు చెందిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పాడటం హైలైట్‌గా నిలిచింది. తెలుగు వెర్షన్‌ను రాకేందు మౌళి అందించిన సాహిత్యంతో రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ పాడగా, తమిళంలో యంగ్ సెన్సేషన్స్ అనిరుధ్ రవిచంద్రన్, జీవీ ప్రకాశ్ కుమార్ కలిసి పాడారు.

రెహమాన్ మ్యూజిక్‌లో తాను పాట పాడటంపై దేవీశ్రీ ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోను షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. శివుడి పట్ల రావణుడికున్న భక్తిని చాటి చెబుతున్నట్లు ఉన్న ఈ పాటలో యశ్ శివ తాండవం చూస్తుంటే ప్రతి ఒక్కరికీ గూస్‌బంప్స్ రావడం గ్యారంటీ అనేలా సాంగ్ కనిపిస్తోంది.

ఈ పాన్-ఇండియా విజువల్ వండర్‌లో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తుండగా, లక్ష్మణుడిగా రవి దూబే, దశరథుడిగా అరుణ్ గోవిల్ కనిపించబోతున్నారు. అలాగే శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్, మండోదరిగా కాజల్ అగర్వాల్ మెరవడం మరో విశేషంగా నిలవనుంది. ఎన్నో అంచనాల మధ్య రూపుదిద్దుకున్న ఈ ఎపిక్ మూవీ దీపావళి కానుకగా నవంబరు 5వతేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.

Hormonal Effect : హార్మోన్ల ఎఫెక్ట్ స్త్రీలకు మాత్రమేనా? ..ఏజ్‌తో పాటే ఎమోషనల్ హార్మోన్లు అందరిలోనూ మారతాయని తెలుసా?

↑
Exit mobile version