Singeetham Srinivasa Rao : ప్రయోగాల దార్శనికుడు సింగీతం శ్రీనివాసరావుకి వీడ్కోలు..మూగబోయిన కథల కెరటం..

Singeetham Srinivasa Rao : ఆలోచనల బౌండరీలను చెరిపేస్తూ, బోర్డర్స్ లేని క్రియేటివిటీతో ప్రేక్షకులను వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఒకే ఒక్క విజనరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు.

Singeetham Srinivasa Rao

సైన్స్ ఫిక్షన్ నుంచి మూకీ వరకు సరికొత్త ట్రెండ్‌ సెట్ చేసిన డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు.. చెన్నైలోని కావేరి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారన్న వార్త అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న సింగీతం నిష్క్రమణతో… సౌత్ ఇండియన్ చిత్రంలో ఒక మైలురాయి వంటి గోల్డెన్ ఎరా ముగిసింది. ఈరోజు అంటే అక్టోబర్ 4న చెన్నైలోనే ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

ఆలోచనల బౌండరీలను చెరిపేస్తూ, బోర్డర్స్ లేని క్రియేటివిటీతో వీక్షకులను వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఒకే ఒక్క విజనరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు(Singeetham Srinivasa Rao). రీల్స్, షార్ట్స్ రాజ్యమేలుతున్న ఈ కాలంలో ..అది కూడా 94 ఏళ్ల వయసులో కుర్ర డైరెక్టర్లకు గట్టి కాంపిటీషన్ ఇస్తూ వెండితెరపై సింగీతం మూవీతో మ్యాజిక్ చేసిన ఆయన.. ఇప్పుడు లేరనే వార్త సినీ ప్రపంచాన్ని షాక్‌కి గురి చేసింది.

నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని ఒక సాధారణ టీచర్ ఫ్యామిలీలో 1931 సెప్టెంబరు 21న జన్మించిన సింగీతం శ్రీనివాసరావు(Singeetham Srinivasa Rao)కి, వయోలిన్ విద్వాంసురాలైన తన తల్లి నుంచి మ్యూజిక్‌లో ఓనమాలు లభించాయి. ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే థియేటర్ ఆర్ట్స్, నాటకాలపై ఆయన ఇంట్రస్ట్ పెంచుకున్నారు.

సూళ్లూరుపేటలో స్కూల్ ఉపాధ్యాయుడిగా చేస్తూనే స్టూడెంట్స్‌తో వైవిధ్యభరితమైన నాటకాలు వేయించేవారు. అలా మొదలైన సింగీతం జర్నీ..మెల్లగా నాటక రంగం వరకూ పాకింది. అప్పుడే లెజెండరీ డైరెక్టర్ కేవీ రెడ్డి దృష్టిని సింగీతం ట్యాలెంట్ ఆకర్షించింది. దాంతో తెలుగు సినీ లోకాన్ని తిరగరాసిన మాయాబజార్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు. అంతేకాక ఫేమస్ సంగీత విద్వాంసుడు సాలూరి రాజేశ్వరరావు శిష్యరికంలో సంగీతంలో మెలకువలు కూడా నేర్చుకుని మల్టీ ట్యాలెంటెడ్ అనిపించుకున్నారు.

భారతీయ సినీ చరిత్రలోనే మోస్ట్ డైనమిక్ ప్రయోగాలకు కేరాఫ్ సింగీతం శ్రీనివాస్ అన్న పేరును పొందారు. మాటల్లేవు, మాట్లాడటాలు అసలే లేవు, కేవలం కళ్లలోని ఎక్స్‌ప్రెషన్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే కమల్ హాసన్‌( Kamal Haasan)ని పెట్టి పుష్పక విమానం అనే మూకీ వండర్‌తో గ్లోబల్ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశారు.

అసలు దక్షిణాదివాసులకు సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ అంటే ఏంటో బాలకృష్ణతో తీసిన ఆదిత్య 369 ద్వారా టేస్ట్ చూపించారు. అలాగే లేటెస్ట్ టెక్నాలజీ, మైండ్ బ్లోయింగ్ గ్రాఫిక్స్‌తో జానపదానికి న్యూ టచ్ ఇస్తూ రూపొందించిన భైరవద్వీపం మూవీ అయితే టాలీవుడ్ రికార్డులనే తిరగరాసింది. కమల్‌ హాసన్‌తో సింగీతం శ్రీనివాసరావు తీసిన అపూర్వ సహోదరులు, మైఖేల్ మదన కామరాజు, విచిత్ర సోదరులు ఇప్పటికీ కల్ట్ క్లాసిక్స్‌గా మిగిలిపోయాయి.

హిందీలో ఘటోత్కచ, ఇంగ్లీష్‌లో సన్ ఆఫ్ అల్లావుద్దీన్ వంటి గ్రాఫికల్ యానిమేషన్ మూవీలతో పాటు మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో ఏకంగా 60కి పైగా చిత్రాలకు సింగీతం దర్శకత్వం వహించారు. 2 నేషనల్ అవార్డులు, 5 నంది పురస్కారాలు సాధించిన ఆయన.. ఇటీవల నాగ్‌ అశ్విన్‌ ప్రొడక్షన్ లో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా సింగీతం అనే మ్యూజికల్ ఫాంటసీకి 94 ఏళ్ల వయసులోనూ డైరెక్ట్ చేసి మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ వయసులో కూడా కేవలం సాంగ్స్, మ్యూజిక్ తోనే మూవీ నడిపించాలనే ఆయన థాట్ ప్రాసెస్ క్రియేటివిటీకి ఇది నిదర్శనం.

ఇక సింగీతం శ్రీనివాసరావు(Singeetham Srinivasa Rao) పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. 1960లో లక్ష్మీ కళ్యాణితో ఆయనకు పెళ్లి జరిగింది. ప్రతి స్టోరీ డిస్కషన్‌లో, స్క్రిప్ట్ డిజైనింగ్‌లో ఆయనకు కొండంత సపోర్ట్‌గా నిలిచిన భార్య లక్ష్మీ కళ్యాణితో తన బంధాన్ని గుర్తు చేసుకుంటూ ..శ్రీకళ్యాణీయం అనే పేరుతో ఆత్మకథను కూడా రచించారు. ఈ పుస్తకాన్ని ఆయన కుమార్తె సుధా కార్తీక్ ఇంగ్లీషులోకి ట్రాన్స్‌లేట్ చేయగా.. మనవడు అభినవ్ ఆవిష్కరించారు. 2022లో భార్య లక్ష్మీ కళ్యాణి దూరమయ్యాక, చెన్నై సాలిగ్రామంలోని కుమార్తెలు, మనవళ్లతో ఉంటున్న సింగీతం ఇప్పుడు శాశ్వతంగా సెలవు తీసుకున్నారు.

Singeetham Srinivasa Rao

మొత్తంగా సింగీతం స్క్రిప్ట్‌లో లేని ఎమోషన్ లేదు, ఆయన టచ్ చేయని జోనర్ అసలే లేదు. టెక్నాలజీ లేని రోజుల్లోనే కళ్లు చెదిరించే దార్శనికతతో చిత్రాలు తీసిన ఆయన, ఈ తరం జనరేషన్ డైరెక్టర్లకు కూడా ఒక గొప్ప ఇన్స్పిరేషన్. ఎక్స్‌పెరిమెంట్ అంటే భయపడే చోట కొత్త రూట్ వేసి గెలిచిన సింగీతం శ్రీనివాసరావు.. వెండితెర హిస్టరీలో ఎప్పటికీ ఒక అన్ బీటబుల్ లెజెండ్‌గానే మిగిలిపోతారు.

పాఠకులకు ప్రశ్న: సింగీతం శ్రీనివాసరావు(Singeetham Srinivasa Rao) చిత్రాలలో మీకు బాగా నచ్చిన మైండ్ బ్లోయింగ్ ప్రయోగం లేదా కల్ట్ కాన్సెప్ట్ మూవీ ఏది? కింద కామెంట్స్‌‌లో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.

Emotional Ignorance : చెప్పినా అర్థం కాదా..లేక కావాలనే నటిస్తారా ? రిలేషన్‌షిప్‌‌లో ఈ ప్రవర్తన వెనుక ఉన్న 4 నిజాలు..

↑
Exit mobile version