Trisha :పెళ్లి చేసుకుంటే మాత్రం విడాకుల వరకూ వెళ్లను.. హాట్ టాపిక్‌గా త్రిష కామెంట్లు

Trisha : విజయ్ వైవాహిక బంధం అలా ముక్కలు కావడానికి త్రిషనే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో, ఆమె పెళ్లి గురించి చేసిన కామెంట్స్ మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి.

Trisha

ఓ వైపు విజయ్ విడాకుల రచ్చ మరోవైపు త్రిష పెళ్లి కబుర్లు.. ఇప్పుడు దక్షిణ భారత సినీ ఇండస్ట్రీలో ఇదే అతిపెద్ద హాట్ టాపిక్ అయి కూర్చుంది. ఒకవైపు దళపతి విజయ్ ఫ్యామిలీలో విడాకుల మంటలు చెలరేగుతుంటే, మరోవైపు త్రిష తన పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విజయ్ వైవాహిక బంధం అలా ముక్కలు కావడానికి త్రిషనే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో, ఆమె పెళ్లి గురించి చేసిన కామెంట్స్ మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి.

నలభై రెండేళ్ల వయసులోనూ చెక్కుచెదరని అందంతో మెరిసిపోతున్న త్రిష(Trisha ).. త్వరలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి విశ్వంభరలో సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం చెన్నై మీడియా కన్ను ఇప్పుడు త్రిష చుట్టూనే తిరుగుతోంది. ఎందుకంటే దళపతి విజయ్ భార్య సంగీత డైవోర్స్ కోసం కోర్టుకు వెళ్లడం..అందులోనూ ఓ హీరోయిన్‌తో తన భర్తకున్న వివాహేతర సంబంధమే కారణం అని తన పిటిషన్‌లో పేర్కొనడమే దక్షిణ సంచలనంగా మారింది.

ఆ హీరోయిన్‌తో బంధం నుంచి బయటపడతానని మాట ఇచ్చి తప్పాడని సంగీత చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ఆమె స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఏప్రిల్ 20న విజయ్ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే టోటల్ గొడవకు త్రిషే కారణం అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

సరిగ్గా ఇలాంటి సమయంలోనే త్రిష(Trisha ) తన పెళ్లిపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్లు చేసింది. సరైన వ్యక్తి దొరికితేనే పెళ్లి చేసుకుంటానని చెబుతూనే..అలా దొరకకపోతే ఒంటరిగానే ఉండిపోతానని కుండబద్దలు కొట్టింది. తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకుని. విడాకుల వరకు వెళ్లడం తనకు అస్సలు ఇష్టం లేదని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది.

Trisha

పెళ్లి అనేది సమాజం కోసం కాదని అన్న త్రిష.. జీవితాంతం కలిసి ఉంటామనే నమ్మకం కలిగినప్పుడే ఆ అడుగు వేయాలంటూ చెప్పుకొచ్చింది. అయితే ప్రేమలో పడటం కంటే నచ్చిన వ్యక్తితో తోడుగా ఉండటమే ఇంపార్టెంట్ అంటూ త్రిష చెప్పిన మాటలు… ఇప్పుడు విజయ్ పరిస్థితులకు అద్దం పడుతున్నాయంటూ మరోసారి సోషల్ మీడియా వేదికగా త్రిష మాటపై చర్చ నడుస్తోంది.

ఇక దీనిని బేస్ చేసుకుని విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ అయిన తమిళ వెట్రి కజగం (TVK) కి నెటిజన్లు కొత్త భాష్యాలు చెబుతున్నారు. టీ అంటే త్రిష, వీ అంటే విజయ్, కే అంటే కృష్ణన్ (త్రిష తండ్రి పేరు) అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగానే తాజాగా విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ .. తన తండ్రిని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడంపైన నెటిజన్లు చర్చలు సాగిస్తున్నారు.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version