SS Rajamouli : రాజమౌళీనా మజాకా…భాగ్యనగరంలో కాశీ సెట్

SS Rajamouli : రాజమౌళీ సినిమాలంటే కేవలం స్వదేశీ మీడియా మాత్రమే కాదు విదేశీ మీడియాకు కూడా ఎంతో ఆసక్తే. తాజాగా రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం వారణాసి

SS Rajamouli

ఎస్ఎస్ రాజమౌళి.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్… హై బడ్జెట్ చిత్రాలతో, అద్భుతమైన కథలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న టాలీవుడ్ డైరెక్టర్… టాలీవుడ్ నుంచే వచ్చిన రాజమౌళి తీసే సినిమాలు మాత్రం హాలీవుడ్ లెవెల్.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లను చూసాక ఎవ్వరైనా ఈ మాట అంగీకరించాల్సిందే.

తన చిత్రంలో ప్రతీ సీన్ పర్ఫెక్ట్ గా వచ్చేందుకు ఎన్ని రోజులైనా కష్టపడే వ్యక్తిత్వం ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli).. అందుకే రెండు మూడేళ్లకు ఒక మూవీ తీస్తున్నా ఆయన క్రేజ్ మాత్రం వేరే లెవెల్. రాజమౌళీ(SS Rajamouli) సినిమాలంటే కేవలం స్వదేశీ మీడియా మాత్రమే కాదు విదేశీ మీడియాకు కూడా ఎంతో ఆసక్తే. తాజాగా రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం వారణాసి.

ఈ మూవీకి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. వారణాసి మూవీ సెట్ ఫోటోలు చూసి విదేశీ మీడియాకు దిమ్మతిరిగిపోయింది. ఏముంది సినిమా సెట్ కే అంత షాక్ అవ్వాలా అనుకోకండి… వారణాసికి సంబంధించి కాశీ నగరం సెట్ ను రాజమౌళి హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు.

సాధారణంగా రాజమౌళి(SS Rajamouli) తన చిత్రాలకు సంబంధించిన ఫోటోలు, ఇతర వివరాలు బయటకు రాకుండా చూసుకుంటారు. టీజర్, ట్రైలర్ టైంలో తప్పిస్తే మిగిలిన సమయాల్లో ఏదీ లీక్ కాకుండా జాగ్రత్త పడతారు. అలాంటి రాజమౌళీ వారణాసి మూవీ అప్ డేట్స్ మాత్రం రెగ్యులర్ గా ఇస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు.

అయితే ఈ సారి హాలీవుడ్ ని టార్గెట్ చేస్తూ మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ జోనర్స్ మిళితం చేసి సరికొత్త కథతో వారణాసిని తీస్తున్నారు. గ్లోబల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ ఇప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. ఈ సినిమా కోసం వేసిన కాశీ సెట్ కు సంబంధించిన వీడియోలు, ఫోటోలను విడుదల చేశారు. దీని కోసం అంతర్జాతీయ మీడియాను ప్రత్యేకంగా ఆహ్వానించి సెట్ ను చూపించారు.

హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ – కోకాపేట్ సమీపంలో 9 ఎకరాల విస్తీర్ణంలో ప్రొడక్షన్ డిజైనర్ మోహన్ బింగి గైడెన్స్ లో ఈ సెట్ వేశారు. 350 మంది ఈ సెట్ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. నిజమైన వారణాసి నగరాన్ని దించేసినట్టు ఈ సెట్ లో ఇళ్లు, వీధులు, మార్కెట్ మొత్తం సహజంగా ఉండేలా నిర్మించారు. దీని కోసం వారణాసి నగరాన్ని వీరంతా పలుమార్లు చూసి డ్రోన్స్, రాడార్ టెక్నాలజీ సాయంతో మొత్తం నగరాన్ని తీర్చిదిద్దారు.

SS Rajamouli

గంగాతీరంలో బోట్లు, పాతబడిన మెట్లు, గోడలు, టెక్చర్ మొత్తం కాశీ నగరమే ఇక్కడకు వచ్చందా అన్న రీతిలో అచ్చుగుద్దినట్టు దించేశారు. చిత్రీకరణ విషయంలో ఎక్కడా రాజీపడని రాజమౌళీ దగ్గరుండి ఈ పనులను చూసుకుంటున్నారు. ఈ సెట్ ను సందర్శించిన విదేశీ మీడియా క్రిస్టోఫర్ నోలన్ తో జక్కన్నను పోలుస్తూ ప్రశంసలు కురిపించింది. ఈ సెట్ లోనే వారణాసి యాక్షన్ సీన్స్ అన్నీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

అలాగే ఇదే సెట్ లో రాజమౌళీ రెండు అంతస్తుల్లో ఎడిటింగ్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. సెట్ లో షూటింగ్ జరిగేటప్పుడు ఎవ్వరూ ఫోటోలు తీయకుండా వీలైనన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. షూటింగ్ సెట్ లోకి ఫోన్లు కూడా నిషేధించారు. కేవలం తాము రిలీజ్ చేసిన ఫోటోలు, వీడియోలు మాత్రమే సోషల్ మీడియా, మీడియాలో వాడేలా ప్లాన్ చేసుకున్నారు.

Sterling Silver : ప్లాటినం లుక్‌తో మెరుపు తగ్గని మన్నిక చెడని జ్యువెలరీ.. 92.5 స్టెర్లింగ్ సిల్వర్ గురించి తెలుసా?

Exit mobile version