Biryani : బిర్యానీ-కూల్ డ్రింక్ కాంబినేషన్..కలిపి తీసుకుంటే అంతే సంగతులు

Biryani : బిర్యానీ.. ప్రస్తుతం ప్రతీ ఒక్కరి జీవితంలో కామనైపోయింది. ఫ్రెండ్స్ తో హోటల్ కు వెళ్లినా లేదా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నా బిర్యానీ లేనిదే ఏదీ ముందుకెళ్లదు

Biryani

బిర్యానీ.. ప్రస్తుతం ప్రతీ ఒక్కరి జీవితంలో కామనైపోయింది. ఫ్రెండ్స్ తో హోటల్ కు వెళ్లినా లేదా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నా బిర్యానీ(Biryani) లేనిదే ఏదీ ముందుకెళ్లదు. ఇక హైదరాబాద్ లో అయితే బిర్యానీకి ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అన్నింటికీ మించి బిర్యానీతో థమ్సప్ లేదా కోక్ (కూల్ డ్రింక్ ) కాంబినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. స్పైసీ బిర్యానీకి(Biryani) కూల్ డ్రింక్ జత కలిపి భోజన ప్రియులు ఆస్వాదిస్తుంటారు. అయితే ఈ కాంబినేషన్ చాలా ప్రమాదం.

ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. సాధారణ భోజనంతో పోలిస్తే బిర్యానీ జీర్ణం అయ్యేందుకు కొంత ఎక్కువ సమయం పడుతుంది. అదే సమయంలో కూల్ డ్రింక్ కూడా తాగితే జీర్ణక్రియను పూర్తిగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా గ్యాస్ సమస్యలకు దారితీస్తుంది. ఎసిడిటీ సమస్య వచ్చే అవకాశముంది. అలాగే కూల్ డ్రింక్స్ లో సహజంగానే అధికస్థాయిలో చక్కెర శాతం ఉంటుంది. ఈ కారణంగా రక్తంలో చక్కెర స్థాయి మరింత పెరిగిపోతుంది.

ఇది క్రమంగా మధుమేహానికి దారి తీసే ప్రమాదం ఉంది. అలాగే దీనిలో ఉండే కాఫీన్, కార్బనేటెడ్ యాసిడ్స్ మానసిక స్థితిపై ప్రభావం చూపి చిరాకు, నిద్రలేమి వంటి లక్షణాలు పెరిగే అవకాశం ఉంది. బిర్యానీలో ఉండే కార్బోహైడ్రేట్లు, శరీరంలో చక్కెర స్థాయిని ఎక్కువ చేస్తాయి. అలాగే కూల్ డ్రింక్స్ లో ఫాస్పోరిక్ యాసిడ్ వంటివి అధిక మొత్తంలో ఉంటాయి.

Biryani

బిర్యానీ తిన్న తర్వాత పేగుల్లో సహజంగా ఉండే గ్యాస్ట్రిక్ యాసిడ్స్ కి తోడు, కూల్ డ్రింక్స్ లోని యాసిడ్స్ జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావం చూపిస్తుంది. మరోవైపు బిర్యానీ-కూల్ డ్రింక్ కాంబినేషన్ కిడ్నీలపై కూడా చెడు ప్రభావం చూపిస్తాయి. బిర్యానీతో పాటు కూల్ డ్రింక్ తీసుకుంటే కిడ్నీలపై విషపదార్థాలు పేరుకుంటాయి.

దీర్ఘకాలంలో కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. బిర్యానీతో శీతల పానీయాలు తీసుకోవడం ఆ సమయానికి రుచిగా, రిలాక్సింగ్ గా అనిపించినా దీర్ఘకాలంలో మాత్రం తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీయడం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ కాంబినేషన్ కు గుడ్ బై చెప్పి వాటికి బదులుగా ఆరోగ్యకరమైన పానీయాలను తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీరు లేదా మినరల్ వాటర్ తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

Biryani : బిర్యానీ-కూల్ డ్రింక్ కాంబినేషన్..కలిపి తీసుకుంటే అంతే సంగతులు

Exit mobile version