Avocado
ఈరోజుల్లో మెయిన్ హెల్త్ సమస్యలో చెడు కొలెస్ట్రాల్ అనేది చాలామందిని వేధిస్తుంది. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, అనారోగ్యకరమైన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతోంది. ఇది రానురాను గుండెపోటు, స్ట్రోక్ లాంటి పెద్ద సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి దీనిని స్టార్టింగ్‌లోనే అదుపులో ఉంచుకోవడం ఎంతో ముఖ్యం.
మన లైఫ్ స్టైల్‌లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం, సరైన ఫుడ్ తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవల క్లినికల్ లిపిడాలజీకి చెందిన సైంటిస్టులు చేసిన అధ్యయనంలో అవకాడో ఫ్రూట్.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో బాగా పనిచేస్తుందని తేలింది.
ఓవర్ వెయిట్‌తో ఇబ్బంది పడుతున్న వారిపై సుమారు 60 నెలల పాటు ఒక రీసెర్చ్ నిర్వహించారు. దీనిలో పాల్గొన్న వారిని 2 వర్గాలుగా విభజించి, ఒక గ్రూపు వారికి డైలీ రెగ్యులర్‌గా అవకాడోను మెనూలో యాడ్ చేసి ఇచ్చారు. మరొక గ్రూపు వారికి ఎప్పటిలాగే తమ సాధారణ డైట్‌ను ఇచ్చారు. ఈ రీసెర్చ్ ముగిసేసరికి డైలీ అవకాడో తీసుకున్న వారి రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ (LDL) ప్రమాదకర స్థాయిలు గణనీయంగా తగ్గినట్లు శాస్త్రవేత్తలు గమనించారు.
మన బ్లడ్‌లో ఉండే ఎల్‌డిఎల్ కణాలు రక్తనాళాల వాల్‌పై పేరుకుపోయినప్పుడు రక్తప్రసరణకు ఆటంకం కలుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ కణాలన్నింటిలోనూ సన్నగా, వెయిట్ ఎక్కువగా ఉండే చిన్న కణాలు చాలా డేంజర్ అయినవి. ఇవి ఈజీగా రక్తనాళాల్లోకి ప్రవేశించి వాపును కలిగిస్తాయి. అయితే ఫుడ్‌తో పాటు రోజూ అవకాడో తినడం వల్ల ఈ చిన్న రకం చెడు కొలెస్ట్రాల్ కణాలు తగ్గిపోతాయని రీసెర్చ్‌లో ప్రూవ్ అయింది.
అవకాడో(Avocado)లో ఉండే హెల్దీ ఫ్యాట్స్ రక్తనాళాలకు హాని చేసే సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ప్లేస్‌ను భర్తీ చేస్తాయి. దీనిలోని ఫైబర్ జీర్ణక్రియ ద్వారా కొలెస్ట్రాల్‌ను బాడీ పీల్చుకోకుండా అడ్డుకుంటుంది. అలాగే దీనిలో ఎక్కువగా ఉండే పొటాషియం బీపీని కంట్రోల్‌లో ఉంచితే, విటమిన్ ఇ అండ్ యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాల వాపును తగ్గిస్తాయి.
ఈ పరిశోధనలో బయటపడిన మరొక ఆసక్తికరమైన విషయమేమిటంటే.. 6 నెలల పాటు అవకాడో తిన్నవారిలో బరువు లేదా నడుము కొలతల్లో పెద్దగా మార్పులు కనిపించలేదు కానీ, వారి బ్లడ్‌లో ఉన్న ప్రమాదకరమైన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు మాత్రం బాగా తగ్గాయి. అంటే వెయిట్ తగ్గడానికి కఠినమైన నియమాలు పాటించకపోయినా, మనం తినే ఫుడ్‌లో ఒక అవకాడోను యాడ్ చేసుకోవడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుందని స్పష్టమవుతోంది.
ఈ ఫ్రూట్‌ను మన డైలీ ఆహారంలో రకరకాలుగా తీసుకోవచ్చు. ముక్కలుగా కోసి సలాడ్స్‌లో అయినా శాండ్‌విచ్‌లలో అయినా వేసుకోవచ్చు. వెన్న లేదా ఇతర ఆయిల్‌కు బదులుగా దీని గుజ్జును బ్రెడ్‌పై రాసుకుని తినొచ్చు. లేదా స్మూతీలా చేసుకుని కూడా తాగొచ్చు. అయితే దీనిలో క్యాలరీలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి, డైట్‌లో నూనె, నెయ్యి, జంక్ ఫుడ్ తగ్గించి దానికి బదులుగా మాత్రమే అవకాడోను చేర్చుకుంటే మంచిది.
ఈ ఒక్క అవకాడో(Avocado) ఫ్రూట్ తింటేనే గుండె జబ్బులన్నీ నయమైపోతాయని అనుకోకూడదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటు ప్రతిరోజూ వాకింగ్, ఎక్స్‌ర్‌సైజులు వంటివి చేయడం, మంచిగా నిద్రపోవడం, స్మోకింగ్‌కు దూరంగా ఉండటం చేయాలి. అలాగే పండ్లు, కూరగాయలతో కూడిన బ్యాలెన్స్‌డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మాత్రమే గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోగలుగుతాం.
Vitamin D : ఎగ్ తినడానికి ఓ లెక్కుందట.. ఈ చిన్న మిస్టేక్స్ చేస్తున్నారేమో చూడండి..
