Ayurveda : అందరికీ ఒకే తిండి సెట్ అవ్వదట..ఆయుర్వేదం చెబుతున్న పర్ఫెక్ట్ ఫుడ్ ఇదే..

Ayurveda : ఆయుర్వేదం మనిషి శరీర తత్వాన్ని వాత, పిత్త, కఫ దోషాలు అనే మూడు రకాల దోషాలుగా విభజించింది.

Ayurveda

మన ఫ్రెండ్స్‌లో కొంతమంది ఇష్టమొచ్చినట్లుగా జంక్ ఫుడ్ తిన్నా చాలా స్లిమ్‌గా, యాక్టివ్‌గా ఉంటారు. కానీ మరికొంతమంది కరెక్ట్‌గా హెల్దీ ఫుడ్ తిన్నా కూడా ఎక్కడో తేడా కొడుతుంది. గ్యాస్ అని, అసిడిటీ, ఓవర్ వెయిట్ అని సఫర్ అవుతుంటారు. అటువంటపుడే అసలు ఎందుకిలా జరుగుతుందనే అనుమానం చాలా మందిలో వస్తుంది.

పోషకాలిచ్చే ఆహారం అందరికీ ఒకేలా రియాక్ట్ అవకపోవడానికి మెయిన్ రీజన్ మన శరీర తత్వమేనని ఆయుర్వేదం(Ayurveda) చెబుతుంది. ఎవరి శరీరానికి ఏది పడుతుందో, ఏది పడదో తెలుసుకుని తినడం మొదలుపెడితే జీవితంలో హాస్పిటల్ మెట్లు ఎక్కాల్సిన అవసరమే ఉండదని అంటుంది.

ఆయుర్వేదం(Ayurveda) మనిషి శరీర తత్వాన్ని వాత, పిత్త, కఫ దోషాలు అనే మూడు రకాలయిన దోషాలుగా విభజించింది. ప్రతీ ఒక్కరిలో ఈ మూడు ఏదో ఒక స్థాయిలో ఉంటూనే ఉంటాయి, కానీ వాటిలో ఏది డామినేటింగ్‌గా ఉందో తెలుసుకుని దానికి తగ్గట్టు ఆహారం తీసుకుంటే అసలు సమస్యే ఉండదు.

ముందుగా వాత దోషం ఉన్నవారి విషయం చూసుకుంటే..ఇలాంటి వారికి ఫ్రిజ్‌లో పెట్టిన చల్లటి ఫుడ్, డ్రైగా ఉండే స్నాక్స్, రోజుల తరబడి నిల్వ ఉంచిన పదార్థాలు తింటే వీరికి జలుబు, అజీర్తి వంటి ప్రాబ్లెమ్స్ స్టార్ట్ అవుతాయి. అందుకే వీరెప్పుడూ వేడివేడిగా, తాజాగా ఉండే ఫుడ్‌ను తినడానికి ప్రిఫర్ చేయాలి. నెయ్యి, పప్పులు, గోధుమలు, సూప్‌లు వీరికి అద్భుతంగా పనిచేస్తాయి.

ఇక పిత్త దోషం ఉన్నవారిలో మసాలాలు వేసిన బిర్యానీలు, కారం, పులుపు ఎక్కువగా ఉండే ఐటమ్స్ తింటే వీరికి ఒంట్లో వేడి పెరిగి అసిడిటీ వస్తుంది. ఇలాంటి వారు బాడీని కూల్ చేసే ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. దోసకాయ, కొబ్బరి నీళ్లు, పండ్లు, ఆకుకూరలు వీరి డైలీ మెనూలో ఉండేలా చూసుకోవాలి.

Ayurveda

చివరిగా కఫ దోషం ఉన్నవారు స్వీట్లు, డీప్ ఫ్రై చేసిన పదార్థాలు, పాల ఉత్పత్తులు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. చాలా తేలికగా, త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఎంచుకోవాలి. అల్లం, మిరియాలు, మిల్లెట్స్ వీరికి పర్ఫెక్ట్.

మొత్తంగా ఎవరైనా సరే ఆకలి వేసినప్పుడే తినడం, కేవలం వేడిగా ఉన్నప్పుడు ఆహారాన్నే తినడం అలవాటు చేసుకోవాలి. ఎంత రుచిగా ఉన్నా పొట్ట పగిలేలా తినకూడదు. ఏజ్ , టైమ్‌ను బట్టి డైట్ మార్చుకుంటే ఆరోగ్యం ఎప్పుడూ మీ చేతుల్లోనే ఉంటుంది.

Cinnamon Coffee : దాల్చిన చెక్క కాఫీ టేస్ట్ చేశారా? బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదలరు..

Exit mobile version