Berberine : సోషల్ మీడియాను ఊపేస్తున్న నేచర్స్ ఒజెంపిక్ .. అసలు బెర్బెరిన్ వాడొచ్చో లేదో తెలుసుకోండి..

Berberine : బెర్బెరిన్ వల్ల వెయిట్ తగ్గే ఎఫెక్ట్ కూడా చాలా తక్కువగా ఉండటం లేదంటే మితంగా ఉండటం మాత్రమే జరుగుతుంది.

Berberine

ఈమధ్య ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ తెరిస్తే చాలు నేచర్స్ ఒజెంపిక్( Nature’s Ozempic) ట్రెండ్ తెగ నడుస్తోంది. ఇంజెక్షన్లు పొడిపించుకోకుండా, లక్షలు ఖర్చు చేయకుండా నేచురల్‌గానే కిలోల కొద్దీ బరువు తగ్గిపోవచ్చంటూ ఒక పసుపు రంగు పౌడర్, సప్లిమెంట్‌ బెర్బెరిన్’ (Berberine)ను సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. దీంతో నెట్టింట్లో వైరల్ అవుతోన్న బెర్బెరిన్ నిజంగా ఫ్యాట్ బర్న్ చేసే మ్యాజిక్కా? లేక సోషల్ మీడియా హైప్ మాత్రమేనా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.

నిజానికి బెర్బెరిన్ అనేది ఈరోజే కొత్తగా ల్యాబ్‌లో తయారుచేసింది కాదు. బెర్బెరిస్ అనే చెట్ల వేర్లు, కాండం నుంచి లభించే ఒక నేచురల్ కాంపౌండ్ ఇది. ఆయుర్వేదంలో దీనికి వేల ఏళ్ల హిస్టరీ ఉంది. ఆయుర్వేదంలో దాతురి పసుపు లేదా దారుహరిద్ర (Daruharidra) అని పిలిచే మూలికలోని ప్రధాన భాగమే ఈ బెర్బెరిన్. చైనీస్ సాంప్రదాయ వైద్యంలో కూడా దీన్ని శతాబ్దాలుగా వాడుతున్నట్లు ఆయుర్వేద డాక్టర్లు చెబుతున్నారు.

మరి దీనికి ఉన్నట్లుండి నేచర్స్ ఒజెంపిక్ అనే పేరు ఎందుకొచ్చిందంటే.. ఒజెంపిక్ అనేది టైప్-2 డయాబెటిస్, ఓవర్ వెయిట్ తగ్గడానికి పాశ్చాత్య దేశాల్లో వాడే ఒక కాస్ట్‌లీ డ్రగ్. బెర్బెరిన్(Berberine) కూడా బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి, బ్లడ్ షుగర్ లెవల్స్‌ను తగ్గించడానికి, కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేయడానికి కొంతవరకూ సహాయపడుతుందని కొన్ని రీసెర్చ్‌లలో తేలింది. దీన్ని బేస్ చేసుకుని నెటిజన్లు దీనికి నేచురల్ ఒజెంపిక్ అని ట్యాగ్ తగిలించేశారు.

కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. నిజానికి ఒజెంపిక్ పనిచేసే విధానం, బెర్బెరిన్ పనిచేసే విధానం మొత్తం వేరు వేరుగా ఉంటుంది. బెర్బెరిన్ వల్ల వెయిట్ తగ్గే ఎఫెక్ట్ కూడా చాలా తక్కువగా ఉండటం లేదంటే మితంగా ఉండటం మాత్రమే జరుగుతుంది.

డయాబెటిస్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) ఉన్న మహిళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించడంలో బెర్బెరిన్ కొంత మంచి చేస్తుందని, అలాగే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్ ) తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. కానీ దీన్ని మెడిసిన్స్‌కు బదులు వాడటం, సొంతంగా వాడటం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుంది.

Berberine

నేచురల్ ప్రొడక్ట్ కదా అని డాక్టర్‌ను అడగకుండా వాడేస్తే జీర్ణక్రియ నాశనమవుతుంది. కడుపులో తిప్పడం, మలబద్ధకం, కడుపునొప్పి వంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, బీపీ లేదా షుగర్ టాబ్లెట్లు వాడేవారు డాక్టర్ సలహా లేకుండా బెర్బెరిన్ సప్లిమెంట్లను అస్సలు తీసుకోకూడదు.

డైట్,రెగ్యులర్ వ్యాయామం, సరైన నిద్ర మాత్రమే వెయిట్‌ను శాశ్వతంగా తగ్గిస్తాయి. అంతే తప్ప, ఏ ఒక్క సప్లిమెంట్ కూడా మ్యాజిక్ చేయలేదన్న విషయం తెలుసుకోవాలి. మొత్తంగా బెర్బెరిన్ అనేది ఒక మంచి మూలిక మాత్రమే.. అది ఎప్పుడూ కూడా ఒజెంపిక్‌కి ఆల్టర్నేటివ్ కాదన్న సంగతి గుర్తుంచుకోవాలి.

Tirumala Brahmotsavam : తిరుమల బ్రహ్మోత్సవాలకు వేళాయే.. మరి 200 ఏళ్ల గొడుగుల కైంకర్యం చరిత్ర గురించి తెలుసా?

Exit mobile version